అన్నమయ్య జిల్లాలో చిరుత పులి సంచారం 

అన్నమయ్య జిల్లాలో  నిమ్మనపల్లె మండలంలో చిరుత పులి సంచారం ప్రజలను భయాందోళనలకు  గురి చేస్తోంది. మూడు వేర్వేరు ప్రాంతాలలో పశువులపై చిరుత పులి దాడి చేయడం ప్రజలు వణికి పోతున్నారు. పశువుల కాపర్లు మేతకు కూడా వెళ్లడం లేదు. ఇంటి ముందు కూడా పశువులను కట్టేయడం లేదు. ఏ నిమిషంలో నైనా చిరుతపులి అటాక్ చేస్తుందని భయపడుతున్నారు. నేలమళ్లేశ్వరస్వామి అటవీ ప్రాంతం, చల్లావారిపల్లె బాహుదా ప్రాజెక్టు ప్రాంతంలోని చలిమామిడి కొండ, నిమ్మనపల్లె, వాల్మీకిపురం సరిహద్దు ప్రాంతంలో ఉన్న నూరుకుప్పల కొండలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. గత ఆగస్టులో చిరుతపులి అటాక్ చేయడంతో మర్రిబండ వద్ద దూడ, మేకలకు గాయాలయ్యాయి. 
గత నెల 31న చల్లావారిపల్లెకు చెందిన ఆదెన్న సమీపంలోని బోడికొండ వద్ద   తన పొలంలో షెడ్డు వేసుకుని ఆవులను పోషిస్తున్నాడు. దూడను ఎత్తుకెళ్లి చిరుత చంపేసింది. 
ఈ నెల 1న గౌనిగారిపల్లెకు చెందిన శంకర తన గొర్రెలను బోడికొండ సమీపంలో మేపుతుండగా చిరుతపులి  దాడి చేసి రెండు గొర్రెలపై దాడి చేస్తుండగా గొర్రెల కాపరి అరుపులకు పరుగులు తీసింది.
ఈ నెల 8న చిరుతలగుట్ట వద్ద పారేశువారిపల్లెకు చెందిన రామయ్య మేకను పట్టుకెళ్లింది. దీంతో చిరుత సంచారాన్ని  అటవీ అధికారులు  కన్ఫర్మ్  చేశారు.