మీరు 100 % ఫెయిల్ అయ్యారు.. సుప్రీమ్ యాస్కిన్ గా బాగానే చేసావు కదయ్యా  

విశ్వ కధానాయకుడు కమల్ హాసన్ (kamal haasan)అప్ కమింగ్ మూవీ భారతీయుడు 2(bharathiyudu 2)ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)దర్శకుడు. దీంతో అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. 1996 లో వచ్చి ఘనవిజయాన్ని సాధించిన భారతీయుడు కి సీక్వెల్  గా పార్ట్  2  తెరకెక్కుతుంది.దీంతో  స్టోరీ పై అందరు ఒక అవగాహనకి వచ్చారు. పైగా ఇటీవల రిలీజైన ట్రైలర్  కూడా అందుకు బలమైన ఊతాన్ని ఇచ్చింది..కానీ కమల్ హాసన్ మాత్రం మీరు ఊహించింది కాదని అంటున్నాడు.

భారతీయుడు 2  వరల్డ్ వైడ్ గా జులై 12 న విడుదల కానుంది. దీంతో  ప్రమోషన్స్ లో వేగం పెరిగింది. ఈ మేరకు కమల్ హాసన్ ,శంకర్ లు ఇటీవలే  ముంబై  కూడా వెళ్లారు. అక్కడ జరిగిన ఒక మీటింగ్ లో కమల్ మాట్లాడుతూ చాలా మంది భారతీయుడు 2  ట్రైలర్ చూసాక  కథ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తు కామెంట్స్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడే అధికారులందర్నీ సిద్దార్ధ్ చంపేస్తాడని కొంత మంది  అంటుంటే, సేనాపతి గెటప్  తో కూడా పార్ట్ 1 లాంటిదే అంటున్నారు. దీంతో నాకు చాలా సంతోషంగా ఉంది.ఎందుకంటే  ఎవరు కూడా మా కథని సరిగా ఉహించలేక పోయారు. అందుకే  సంతోషంగా ఉంది. ఒక్కటి మాత్రం నిజం.  మీరు ఊహించిన కథ మాత్రం భారతీయుడు 2  కాదని చెప్పుకొచ్చాడు.

దేశంలో అవినీతి పెరిగిపోయిందని, అది అంతం అవ్వాలంటే ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని చెప్పించి ఆ తర్వాత కమల్ క్యారక్టర్ సేనాపతిని చూపించారు. అందుకే అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి పోరాడతాడని కామెంట్స్ చేస్తున్నారు. కానీ కమల్ మాత్రం కథ వేరే అనటంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. ట్రైలర్ అయితే రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. అలాగే కమల్ మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసాడు. పార్ట్ 3 లో సేనాపతి తండ్రిపాత్ర కూడా ఉంటుందని చెప్పాడు. దీంతో  భారతీయుడు 3  కూడా ఉండబోతుందని కన్ఫార్మ్ అయ్యింది. 350 కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కిన భారతీయుడు 2 లో కమల్ తో పాటు కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ్, ప్రియా భవాని శంకర్ లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించగా అనిరుద్ సంగీతాన్ని అందించాడు. ప్రెజంట్   సుప్రీమ్ యాస్కిన్ గా కల్కి (kalki 2898 ad)రూపంలో కమల్  తన హవా కొనసాగిస్తున్నాడు.