బాలీవుడ్ బాద్‌షా ప్రభాస్.. 'కల్కి' సునామీలో ఖాన్ ల రికార్డులు ఖతం!

పాన్ ఇండియా స్టార్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకడిగా ప్రభాస్ ఉన్నాడు. 'బాహుబలి' నుంచి సినిమా సినిమాకి తమ ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. నార్త్ లోనూ బాలీవుడ్ హీరోలకు ధీటుగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక తన తాజా చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD)తో హిందీలో ఉన్న రికార్డులన్నీ చెరిపేసి.. బాలీవుడ్ స్టార్స్ ని మించిన స్టార్ అనిపించుకోబోతున్నాడు.

నార్త్ లో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు మ్యాజిక్ చేస్తుంటాయి. చిన్న సినిమాగా వచ్చిన 'హనుమాన్' నార్త్ లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అలాంటిది 'కల్కి' అనేది అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మైథలాజికల్ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. మహాభారతంలోని కీలక పాత్రలను తీసుకొని రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. దానికి తోడు సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. విజువల్ వండర్ అని, హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉందని అందరూ అంటున్నారు. ముఖ్యంగా మహాభారతం నేపథ్యంలోని సన్నివేశాలు గూస్ బంప్స్ అని చెబుతున్నారు. ఇది చాలు.. నార్త్ ప్రేక్షకులు 'కల్కి' సినిమాకి క్యూ కట్టడానికి. నిజానికి అడ్వాన్స్ బుకింగ్స్ కే నార్త్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ తో.. వసూళ్లు ఓ రేంజ్ లో వస్తాయి అనడంలో సందేహం లేదు.

నార్త్ ప్రేక్షకులను ఆకర్షించే మరో బిగ్ ఫ్యాక్టర్ 'కల్కి'లో ఉంది. అదే బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇండియన్ సినిమాలో ఆల్ టైం బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అమితాబ్.. 80 ఏళ్ళ వయసులోనూ నటిస్తున్నారు. పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. అలాంటి అమితాబ్ కి 'కల్కి' సినిమాలో అత్యంత కీలకమైన, పవర్ ఫుల్ రోల్ అశ్వత్థామ దక్కింది. ఇది కాసేపు కనిపించే రోల్ కాదు. సినిమా అంతా ఉంటుంది. ఓ రకంగా హీరో లాంటి పాత్ర. అశ్వత్థామ పాత్రలో అలనాటి సూపర్ స్టార్ అమితాబ్ నట విశ్వరూపం చూడటానికి నార్త్ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే అవకాశముంది. ఇక దీపికా రూపంలో కల్కి చిత్రానికి మరో అదనపు ఆకర్షణ ఉండనే ఉంది. ఆమెది కూడా సినిమా అంతా ఉండే చాలా కీలమైన పాత్ర.

అసలే ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ నటించిన మైథలాజికల్ టచ్ ఉన్న ఫిల్మ్. దానికితోడు బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రలు పోషించారు. ఇది చాలదు అన్నట్టు సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్. ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులు మెచ్చేలా, అందునా పిల్లలకు బాగా నచ్చేలా సినిమా ఉంది. పిల్లల మెచ్చే సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల బాట పడతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కలిసొచ్చి వసూళ్ల పరంగా 'కల్కి' సృష్టించే సంచలనాలకు.. ఇప్పటిదాకా బాలీవుడ్ లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.