వైఎస్ జగన్ కి తన రేంజ్ చెప్పిన ప్రభాస్.. ఇంతకీ చూసే ఉంటాడా! 

ప్రభాస్ (prabhas)కల్కి 2898 ఏడి(kalki 2898 ad)వరల్డ్ వైడ్ గా  పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.దీంతో  సినిమా చూడాలనే ఉత్సాహంతో  జనం థియేటర్స్ ముందు  బారులు కడుతున్నారు.  టికెట్స్  క్లోజ్ అయిపోయినా సరే ఎలాగైనా సినిమా చూడాల్సిందే అంటూ అక్కడే తిష్ట వేస్తున్నారు. ఈ టైంలో కల్కి గురించి కొన్ని విషయాలని తెలుసుకొని మరింత ఎగ్జైట్మెంట్ కి లోనవ్వుతున్నారు.

భారతీయ సినీ చరిత్రలోనే కల్కి అత్యంత హెవీ  బడ్జట్ తో తెరకెక్కింది. సుమారు 600 కోట్ల రూపాయిలు దాకా ఖర్చు అయ్యాయి..నటీనటుల వేతనాలు, సెట్స్ కి అయిన  ఖర్చుతో పోలిస్తే విఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేసారు.అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)కమల్ హాసన్ (kamal haasan)నలభై సంవత్సరాల తర్వాత కలిసి నటించారు. చివరి సారిగా  గిరిఫ్తార్ లో కలిసి చేసారు. ప్రభాస్ రైడ్ చేసే బుజ్జిని  నాలుగు కోట్ల ఖర్చుతో తయారు చేసారు. కమల్ హాసన్ క్యారక్టర్ కి సంబంధించిన  మేకప్ కి హాలీవుడ్ కి చెందిన ప్రతిభావంతమైన మేకప్ వాళ్ల్లు వర్క్ చేసారు. అదే విధంగా అశ్వద్ధామ క్యారక్టర్ ని వేసిన అమితాబ్ మేకప్ ని వెయ్యడానికి మూడు గంటల సమయం,  తియ్యడానికి రెండు గంటల సమయం పట్టేది .ఇక మూడు ప్రపంచాల మధ్య జరిగే కల్కి అవుట్ లుక్ మొత్తాన్ని చూపించడానికి 700 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించారు.  హ్యారిపోటర్, ఇంటర్ స్టెల్లార్, డ్యూన్, బ్లెడ్ రన్నర్ వంటి   భారీ హాలీవుడ్ చిత్రాలకి పని చేసిన టీం కల్కి కి  పని చేసింది .అదే విధంగా  షూటింగ్ మొత్తానికి  ఐ మాక్స్ డిజిటల్ కెమెరా ని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ని వాడిన మొదటి భారతీయ సినిమా కల్కి నే. ఇవే కాకుండా ఇంకా ఎన్నో వండర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిని  తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చర్చలకు వస్తున్నాయి. ఏ పి మాజీ ముఖ్య మంత్రి  సినిమా హీరోలని  ఎంత  చిన్న చూపు చూసిందో తెలిసిందే. చర్చల కోసమని పిలిచి గేట్ బయట నుంచే వాళ్ళని నడిపించాడు.అలాగే టికెట్ రేట్స్ ని కూడా తగ్గించాడు. ఇప్పుడు కల్కి దెబ్బతో సినిమా పవర్  జగన్(jagan)కి మరోసారి తెలిసొచ్చింది. మరి ఇప్పుడు అందరిలో  కల్కి చూడాలనే ఉత్సాహం పెరిగిపోయింది.  ఆ ఉత్సాహం జగన్ వెంట  వైఫైలా  ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఇక జగన్ ని కలిసిన సినిమా పెద్దల్లో ప్రభాస్ కూడా ఉన్నాడు.