అమెరికా లో కల్కి కలెక్షన్స్ కి  బ్రేక్ పడేదెప్పుడు

ఈ సృష్టిలో ఎన్నో  అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇంత వరకు వాటిని కనిపెట్టడం మహామహుల వల్ల కూడా సాధ్యం కాలేదు. భవిష్యత్తులో సాధ్యం కాదు కూడా. ఇప్పుడు ప్రభాస్ (prabhas) కల్కి 2898 ఏడి(kalki 2898 ad)కూడా అంతు చిక్కని రహస్యాల జాబితాలో స్థానం సంపాదించింది.

జూన్ 27 న విడుదలైన కల్కి కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ గా అనేక రికార్డులని తన ఖాతాలో భద్రపరుచుకుంటుంది. ప్రభాస్ రేంజ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ విషయం పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కానీ నార్త్ అమెరికా కలెక్షన్స్ ని చూస్తుంటే అవి ఎంతటి వరకు వెళ్ళి ఆగుతాయో తెలియని పరిస్థితి. మన కంటే ఒక రోజు ముందుగానే అక్కడ విడుదలైన కల్కి ఫస్ట్ డే నుంచే రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తుంది. లేటెస్ట్ గా లెవన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. లెవన్ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ లో తొంబై ఒక్క కోట్లు రూపాయిల పై మాటే. దీన్ని బట్టి నార్త్ అమెరికాలో కల్కికి  ఎంతటి ప్రజాదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక తాజాగా నిర్మాత అశ్వని దత్ కల్కి రెండవ పార్ట్ కూడా అరవై శాతం పూర్తి అయ్యిందని చెప్పాడు. దీంతో అందరు  కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పార్ట్ వన్ లో అశ్వద్ధామ ఎంత చెప్తున్నా వినకుండా  భైరవ శంబళ నుంచి  సుమతి ని తీసుకెళ్తాడు. అదే టైం లో కాంప్లెక్స్ లో ఉన్న  సుప్రీం యాస్కిన్ గర్భానికి కారణమైన అంశ వల్ల  యవ్వన రూపానికి వస్తాడు. దీంతో నెక్స్ట్  జరగబోయే కథ ఏంటనే ఆసక్తి  అందరిలో నెలకొని ఉంది.