జయలలిత సమాధి కావటానికి... కారణాలు ఇవే! 


ఫిబ్రవరీ 24, 1948... డిసెంబర్ 5, 2106! ఈ తేదీల మధ్య ఒక శకం ముగిసిపోయింది! జయలలిత తన ప్రస్థానం ముగించి మెరీనా బీచ్ లో డిసెంబర్ 6న సేద తీరింది! కాని, ఇప్పుడు చాలా మంది చర్చ ఆమె మరణం నుంచి అంత్యక్రియల వ్యవహారంపైకి మళ్లింది! పురుచ్చి తలైవీ మిగతా అన్ని విషయాల మాదిరిగానే ఆమె , ది ఎండ్ కూడా ఆసక్తి రేకిత్తిస్తోంది... 


జయలలిత హిందువు. అంతే కాదు ఆమెది తమిళ అయ్యంగార్ కుటుంబం. అంటే, బ్రాహ్మణ వనిత అన్నమాట. మరి అటువంటప్పుడు అమ్మ అంత్యక్రియలు ఎలా జరగాలి? ఆమె పార్థివ దేహాన్ని వేద మంత్రాలతో దహనం చేయాలి. కాని, అలా చేయలేదు. అదే ఇప్పుడు ఎందరికో అనుమానం కలిగిస్తోంది! ఎందుకని తమిళ సీఎంని సమాధి చేసేశారు? దీనికి చాలా మంది చాలా సమాధానాలే చెబుతున్నారు...


జయలలిత హిందువే అయినా ఆమెకు పెళ్లి అవ్వకపోవటం వల్ల దహనం చేయలేదని కొందరి అభిప్రాయం. కొన్ని కులాల వాళ్లు పెళ్లి కాని వార్ని సమాధి చేయటం సంప్రదాయంగా వస్తోంది. ఇక మరి కొందరి అభిప్రాయం ప్రకారం జయకు వారసుడంటూ ఎవరూ లేకపోవటంతో కూడా సమాధి చేయటానికి శశికళ మొగ్గు చూపిందంటున్నారు. సుధాకరన్ అనే అతడ్ని జయలలిత దత్తత తీసుకుని గ్రాండ్ గా మ్యారేజ్ చేసినప్పటికీ తరువాత అతడు జయతో కలిసి వుండలేదు. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరూ జయ అంతి క్షణాల్లో ఆమె వద్ద లేరు. ఈ కారణల వల్ల కూడా జయలలితను సమాధి చేయాల్సి వచ్చిందట.


వ్యక్తిగత కారణాలతోనే కాదు, సామాజికంగా కూడా తమిళుల్లో చాలా మంది పూడ్చి పెట్టే పద్ధతే పాటిస్తుంటారు. గత తమిళ సీఎంలు ఎవ్వర్నీ దహనం చేయలేదట. అందుకే, జయను కూడా ఆమె సినిమా, రాజకీయ గాఢ్ పాదర్ ఎంజీఆర్ సమాధి పక్కనే సమాధి చేశారట! ఏదీ ఏమైనా, జయలలిత జీవితంలో ప్రతీ అంశమూ వార్తల్లో నిల్చింది. అలాగే ఈ అంత్యక్రియల సంగతి కూడా హాట్ టాపిక్ అయింది...

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu