జయ ఆస్తులన్నీ ఎవరికి సొంతం?
posted on Dec 7, 2016 11:12AM

దేశంలో అత్యంత సంపన్న సీఎమ్‌లలో జయలలిత ఒకరు. జయ బతికున్నంత కాలం విలాసవంతమైన జీవితం గడిపారు. ఖరీదైన కార్లలో తిరిగారు. ఆమె ఆస్తుల విలువ అధికారికంగా రూ.117 కోట్లు. అనధికారికంగా ఎంత ఉందో.. ఎవ్వరికీ తెలీదు. జయకు వారసులంటూ ఎవరూ లేరు. మరి ఆమె ఆస్తులు ఎవరికి సొంతం?? అనే ప్రశ్న మొదలైందిప్పుడు. పోయెస్ గార్డెన్‌లో ఉన్న జయ నివాసం విలువ దాదాపుగా రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు ఓ డజను ఖరీదైన కార్లు, బంగారం, వజ్రాలూ.. ఇలా సంపద ఎంతో ఉంది.
ఇవన్నీ ఎవరికి చెందుతాయి?? జయ ఈ ఆస్తులకు సంబంధించిన వీలునామా ఏమైనా రాశారా? జయ ఆప్తమిత్రురాలు శశికళకు వీటి గురించి ఏమైనా తెలుసా?? ఇలా లెక్కలేని ప్రశ్నలు ఎన్నో. హైదరాబాద్ శివార్లలో జయకు ఓ ద్రాక్ష తోట ఉంది. హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇల్లు కూడా ఉంది. ఇవన్నీ పర్యవేక్షించేది ఎవరు?? జయ తాలుకూ కొన్ని ఆస్తులు కోర్టు గొడవల్లో ఉన్నాయి. అవన్నీ ఎవరికి సొంతం అవుతాయి? జయ చివరి రోజుల్లో వీలునామా రాసే ఉంటారని, వాటికి సంబంధించిన లెక్కలన్నీ శశికళకు బాగా తెలుసని చెన్నై మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది. జయ లోగొట్టు ఏంటో.. శశికళకే ఎరుక.