రెండున్నర లక్షల దొంగ పింఛన్లు.. వైసీపీ హయాంలో ఇదో జగన్మాయ!

వైసీపీ హయాంలో కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లుగా సాగింది. జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలలో దోపిడీ పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగింది.  జగన్ ఓటమి తరువాత అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మల సంక్షేమం కోసం తాను కోట్లు వెచ్చించాననీ, ఆ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లన్నీ ఎక్కడకు పోయాయి. ఏదో కుట్ర ఉంది.. కానీ ఆధారాలు లేవు, ఏం చేయలేం అంటే నిర్వేదంగా మాట్లాడారు.

కానీ జగన్ చెబుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారుల కంటే.. అనర్హులైన అస్మదీయులకే సింహభాగం అందాయని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.   సంక్షేమం పేరిగ జగన్ జలగలు యథేచ్ఛగా నొక్కేశాయని ఇప్పుడు బయట పడుతోంది. సంక్షేమం పేరిట జగన్ సర్కార్ అందించిన పింఛన్లూ పక్కదారి పట్టాయని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్  హయాంలో లబ్ధిదారులకు కోత పెట్టి మరీ దాదాపు రెండు లక్షల 50 వేల దొంగ పింఛన్లు  పంపిణీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

రాష్ట్రంలో కొలువుదీరిన తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం ఈ దొంగ పింఛన్ల వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్రంలో అనేక మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా జగన్ సర్కార్ తప్పుడు మార్గాల ద్వారా సొంత వారికి పెద్ద ఎత్తున ఈ సామాజిక పింఛన్లు అందించిందని తెలియవచ్చింది.

ఆధార్ కార్డులో వయస్సు మార్చుకుని, దొంగ వికలాంగ సర్టిఫికెట్లతో అలాగే వితంగా, ఒంటరి మహిళ పింఛన్లను లక్షల మంది అక్రమంగా, అర్హత లేకపోయినా అందుకున్నారని. వీరికి పింఛన్లు అందజేయడం కోసం అర్హలకు కోత పెట్టారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనర్హులకు కాకుండా అర్హులకే పింఛన్లు అందేలా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సర్కార్ సమాయత్తమౌతోంది. ఈ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. దొంగ పింఛన్ల విషయంలో బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.  మండల స్థాయినుంచీ ప్రక్షాళన జరగాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.