బాబు, కొడుకులను టార్గెట్ చేయండి: అమిత్ షా నిర్దేశం
posted on Jul 8, 2019 5:11PM

2022 లో తెలంగాణాలో అధికారమే టార్గెట్ గా అడుగులు వేస్తున్న బీజేపీ అధి నాయకత్వం ఆ దిశగా పావులు కదుపుతోంది. గత శనివారం తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అమిత్ షా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ మీకు కేవలం మూడు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. 2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని, దాని కోసం కెసిఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనీ అయన చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎలాగూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాబట్టి అవసరమైతే కెసిఆర్ ను అయన కుమారుడు కేటీఆర్ ను టార్గెట్ చేయాలనీ రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులకు అమిత్ షా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనితో కెసిఆర్ ప్రభుత్వానికి ఇక చుక్కలే అనే రాజకీయ విశ్లేషకులు ఆభిప్రాయ పడుతున్నారు.