ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఔట్‌

కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి అనే చర్చ ఒకటి జరుగుతూనే వుంది. ప్రక్రియ మొత్తం పూర్తి చేసి,ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన, నియామాకాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఖాతాలో కలుపుకున్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మేము వండి సిద్ధం చేసిన వ్నకలను వడ్డించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 
 ఇలా  అటు కారు పార్టీ, ఇటు హస్తం పార్టీ క్రెడిట్ మాదంటే మాదని వాదులాడుకోవడం కూడా రోజు చూస్తున్నదే. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పడు నిరుద్యోగ యువత కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంతన్న సర్కార్’ , ఉన్నదీ పోయింది ..ఇంకొకటీ పోయింది అన్నట్లు, కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న చిరుద్యోగాలను గుజుజునేందుకు సిద్డంమవుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏదో చెప్పలేని వ్యతిరేకత ఇబ్బంది ఉన్నట్లుది. బయటకు చెప్పినా చెప్పక పోయినా ప్రభుత్వ ఉద్యోగులు అంటే తెల్ల ఏనుగులు అనే అభిప్రాయం ఏదో ఆయనలో అంతర్లీనంగా ఉన్నట్లు కనిప్స్తోందని ఉద్యోగులు అంటున్నారు. అందుకే, ఆయన  రాష్ట్ర క్లిష్ట పరిష్టిలో ఉన్న ప్రస్తుత సమయంలో డిఏలు అడగకండి, ఫస్ట్ తేదేకి జీతాలు ఇవ్వడానికే, నెలనెల రిజర్వు బ్యాంకు ముందు చేయి చాచ వలసి వస్తోంది. సో ... మీ జీతాలు మీకు  ఇస్తున్నదుకు సంతోషించి, రోజుకో రెండు గంటలు ఎక్కువ పనిచేసి ప్రభుత్వ ఋణం తీర్చుకోండి,అన్నట్లు ఓ చిన్న చిరునవ్వుతో  చురక వేశారు. అలాగే, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్.కొండలా పెరిగి పోయాయి, ఎక్కడ నుంచి తేవాలి,అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండానే’ మరో చురక వేశారు.రిటైర్డ్ ఉద్యోగుల నోటికి తాళాలు కూడా వేశారు.సరే, ఉద్యోగులు, నిరుద్యోగ యువకులతో పెట్టుకుంటే ఏమవుతుందో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత అర్థమయ్యే ఉంటుంది. పంతుళ్ళు చెప్పే పాఠం పూర్తిగా అర్థం అయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుంది కావచ్చును.    
అదలా ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ కన్ను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై పడిందని అంటున్నారు. దశలవారీగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో సగం మందిని తొలిగించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 
అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం  పొదుపు చర్యల్లో వివిధ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌) తొలిగించే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ఇప్పటికే,  వేర్వేరు శాఖల్లో సంబంధిత  ఏజెన్సీల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్వాసనలు మొదలయినట్లు సమాచారం. ఒకేసారి, అందరికీ ఉద్వాస పలికితే, బాధిత యువత ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడి కక్కడ, తమచేతికి మట్టి అంటకుండా, ఏజెన్సీల ద్వారా  కాగల కార్యం కానిస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తం 60 ప్రభుత్వ శాఖల్లో కలిపి, పీఆర్సీ నివేదిక ప్రకారం  1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. ఇందులో  సగం మందిని ఇంటికి పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమయిందని అంటున్నారు.  
కాగా, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో 75 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసియన్ నేపధ్యంలో, తమను ఉద్యోగాల నుంచి తొలిగించి, తమ కుటుంబాలను బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటూఆ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రవాణా శాఖలో మొదటి విడత కింద 62 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం. కార్మిక శాఖలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలిగింపు మొదలైనదని, కాంట్రాక్టు గడువు ముగిసిన ఉద్యోగుల కాల పరిమితి తిరిగి రెన్యూవల్‌ చేయకుండా ఇంటికి పంపిస్తున్నట్టు తెలిసింది. తాజాగా మరో 50 మంది ఉద్యోగుల తొలిగింపునకు నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్‌ శాఖ, టీజీబీసీఎల్‌ నుంచి 80 మంది ఉద్యోగులను తొలిగించడానికి అధికారులు లిస్టు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
నిజానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఔట్‌ సోర్సింగ్‌’ అనేదే ఉండదని చాలా గట్టిగా నామం బలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలోనూ కేసీఆర్, ఔట్‌ సోర్సింగ్‌’, కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేశారు. కొంత మందిని చేసారేమో కూడా, కానీ, ఇప్పడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అసలుకే ఎసరు తెచ్చిందని ఔట్‌ సోర్సింగ్‌’ ఉద్యోగులు ఆందోళన వ్యక్త పరుస్తునారు.