జగన్ ముద్దులు పెట్టడం మానాలి
posted on May 25, 2015 3:06PM

వైసీపీ నాయకుడు జగన్‌కి ఒక విచిత్రమైన అలవాటు వుంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళకి ముద్దులు పెట్టేస్తూ వుంటారు. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచీ జగన్‌ది ఇదే వరస. ఎదుట వున్నవాళ్ళు ఎవరు... ఆడా... మగా అనేది కూడా ఆలోచించకుండా తల నిమురుతూ, ముద్దులు పెడుతూ ఓదారుస్తూ వుంటారు. ఓదార్పు యాత్ర అయినా, మరే యాత్ర అయినా ముద్దులు పెట్టే సీన్ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. ముద్దులు పెట్టీ పెట్టీ ఆయనకు ఆ పద్ధతి అలవాటు అయిపోయింది. జగన్ ముద్దుల గురించి జనాలు గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నా జగన్ ఎంతమాత్రం పట్టించుకోకుండా తన ధోరణిలోనే వెళ్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ సార్ ఈ ముద్దుల పద్ధతిని మానుకుంటే మంచిదని భావిస్తు్న్నప్పటికీ ఆ విషయాన్ని జగన్‌కి చెప్పే ధైర్యం లేక ఊరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జగన్ ముద్దుల మీద కామెంట్లు చేస్తు్న్నారు. జగన్ ఏదైనా యాత్రను చేపట్టారంటే జనం భయంతో పారిపోతున్నారని, జగన్ అంత దూరంలో వుంటే జనం ఇంకొంచెం దూరంగా పారిపోతున్నారని వ్యంగ్యంగా అంటున్నారు. ఎందుకంటే, జగన్ దగ్గరకి వెళ్తే ఎక్కడ ముద్దులు పెట్టేస్తారోనని జనం భయపడుతున్నారని చెబుతున్నారు. జగన్‌ని చూసి స్త్రీలు జగన్ ముద్దు పెట్టకుండా చూడు దేవుడా అని ప్రార్థిస్తున్నారని, పెళ్ళికాని ఆడపిల్లలయితే జగన్‌ని చూడగానే తుపాకీ పేలినప్పుడు పారిపోయే పక్షుల తరహాలో గల్లంతు అయిపోతున్నారని కామెడీగా అంటున్నారు. ఇలాంటి కామెడీ కామెంట్లకు ఆస్కారం ఇస్తున్న తన ముద్దుల ప్రహసనానికి జగన్ ఇప్పటికైనా తెర దించితే బావుంటుందేమో. మన అమాయకత్వం గానీ, జగన్ ఒకరు చెబితే విని మారే రకమా!?