ఇ.డి.చిపెట్టను జగన్ బొమ్మాళీ!



నిన్ను ఎవరు క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు అనే డైలాగ్ చాలా సినిమాల్లో వినే వుంటాం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఆ డైలాగ్‌ని కాస్తంత మార్చి చదువుకోవచ్చు... ‘‘నిన్ను ఎవరు క్షమించినా ఆ ఇ.డి. (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మాత్రం క్షమించదు’’. అవునండీ బాబు... అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్‌‌ని ఎవరు క్షమించినా ఇ.డి. మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించి విడిచిపెట్టేట్టు లేదు. అక్రమాస్తుల కేసుల విచారణ మొదలైనప్పటి నుంచి ఇ.డి అప్పుడప్పుడు జగన్‌కి సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ఆయనగారికి కంటి నిండా నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటి వరకు జగన్‌కి సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్‌కి సంబంధించిన కీలకమైన, ఆయువుపట్టు లాంటి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇ.డి. సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే సీబీఐ ధాటి నుంచి తట్టుకోవడం ఈజీగానే వుందిగానీ, ఈ ఇ.డి. తాకిడికి తట్టుకోవడం మాత్రం జగన్‌కి చాలా కష్టంగా మారింది. అందుకే ఇ.డి.ని అదుపు చేయడానికి జగన్ నానా తంటాలూ పడుతున్నాడు. సీబీఐ దగ్గర వున్న తన అక్రమాస్తుల కేసులు పరిష్కారమయ్యే వరకూ ఇ.డి. నా జోలికి, నా ఆస్తుల జోలికి రాకుండా చూడాలని జగన్ ఇ.డి. ప్రత్యేక కోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశాడు.

అయితే ఇ.డి. కోర్టు ముందు జగన్ వాదదను ఖండిస్తూ కోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకూ తాను ప్రేక్షకపాత్ర వహించాల్సిన అవసరం లేదని, తాను తనదైన పద్ధతిలో విచారణ జరపవచ్చని స్పష్టం చేసింది. మనీలాండరింగ్ చట్టంలోని ఏయే సెక్షన్ల ప్రకారం తాను జగన్ మీద చర్యలు తీసుకోవచ్చో సవివరంగా కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు విషయంలో జరుగుతున్న విచారణను జాప్యం చేయడానికే జగన్ తన ప్రమేయాన్ని ప్రశ్నిస్తున్నాురని ఇ.డి. వివరించింది. ఈ కేసు విషయంలో ఇ.డి. చేసిన వాదనను చూస్తుంటే ఇ.డి. జగన్ సార్‌ని అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu