భారీ వర్షాలు.. చంద్రబాబు యాక్టివ్!

భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్టివ్ అయ్యారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. టెలీ కాన్ఫరెన్స్.లో ముఖ్యాంశాలు...

* రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
* చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. పర్యవేక్షణ ఉంచాలి.
 కట్టలు తెగే పరిస్థితి వున్నదేమో గమనించాలి.
* అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న ప్రాంతాలలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి
.
* ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్‌లు పంపి అలెర్ట్ చేయాలి
.
* వాగులు, కాలువల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
.
* వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి
.
* అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయవచ్చు.
* కంట్రోల్ రూమ్‌కి వచ్చిన ప్రజల విజ్ఞప్తులపై వేగంగా స్పందించాలి

* సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా నీటి పారుదల శాఖ చర్యలు తీసుకోవాలి
.
* ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపిన అధికారులు.

* ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించిన అధికారులు. మంగళవారం నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపిన అధికారులు
.
* నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా వుంచినట్టు తెలిపిన అధికారులు.