అన్నాన్ని ఇలా వండి తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరగదు..!

 


అన్నం భారతీయుల ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో  అన్నం లేకపోతే తిన్నట్టు ఉండదని అంటుంటారు. అయితే అన్నం తినడం వల్ల  బ్లడ్ షుగర్ పెరుగుతుందని అంటారు.  అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అంటారు. ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నానికి దూరం ఉండటం మంచిదని అంటారు. అయితే అన్నాన్ని కింది పద్దతిలో వండుకుని తింటే చక్కెర స్థాయిలు పెరగవు.  అదెలాగో తెలుసుకుంటే..

 బియ్యాన్ని బాగా కడగాలి..

అన్నాన్ని వండటానికి  ముందు బియ్యాన్ని బాగా కడగాలి. కనీసం 3 నుండి 4 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడగడం వల్ల బియ్యం మీద ఉన్న దుమ్ము, ధూళి పోవడమే కాదు.. బియ్యానికి అంటుకుని ఉండే ముతక పదార్థం వదిలిపోతుంది.

బియ్యాన్ని వండటానికి నీరు పోసి అందులో నాలుగైదు లవంగాలు వేయాలి.  నీళ్ళు బాగా మరిగించాలి.  నీరు మరుగుతున్నప్పుడు అందులో బియ్యం వేయాలి. ఇలా నీటిలో బియ్యం వేసినప్పుడు పైన నురుగు వస్తుంది.  ఈ నురుగును తొలగించాలి.  స్టవ్ ఆప్ చేసి బియ్యంలో నీటిని వంపేయాలని.  ఇలాఒంపేసిన తరువాత వేరే నీటితో బియ్యాన్ని మళ్లీ కడగాలి.  ఇలా చేయడం వల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయట.

బియ్యంలో సాధారణంగానే గ్లైసెమిక్ ఇండెక్స్  ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నాన్ని ఏ పద్దతిలో వండినా కార్బోహైడ్రేట్స్,  గ్లూకోజ్ శరీరంలోకి వెళతాయి.  ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నం తినే విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. పై పద్దతిలో బ్లడ్ షుగర్ పెరగకపోయినా మరీ అతిగా అన్నం తినడం ప్రమాదమే.. ముఖ్యంగా అన్నం,  బంగాళదుంపలు మధుమేహాన్ని చాలా తొందరగా పెంచుతాయి. అన్నం, బంగాళదుంపల కాంబినేషన్ అస్సలు తినకపోవడం మంచిది.


                                                  *రూపశ్రీ