జీర్ణ వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ కూరగాయ తినాలి..!


శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.  ఆహారం సరిగా జీర్ణం అవుతుంటే ఆహారంలో పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. అదే ఆహారం సరిగా జీర్ణం  కాకుంటే శరీర వ్యవస్థ దెబ్బ తింటుంది.  అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  అలా కాకుండా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా,  ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా ఆహారంలో ఒక కూరగాయను జోడించుకుంటే సరిపోతుంది. అదేంటో తెలుసుకుంటే..


గుమ్మడికాయ..

గుమ్మడికాయను చాలామంది రెగ్యులర్ కూరగాయలతో సమానంగా ఉపయోగించడంలో వెనుకబడి ఉంటారు.  చాలా వరకు గుమ్మడికాయను హోటల్స్, పెళ్లిళ్ళు,  అన్న వితరణ వంటి చోట్ల మాత్రమే చూస్తుంటారు.  వంటల్లో గుమ్మడి కాయ వినియోగాన్ని పెంచితే జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


గుమ్మడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది.  అంతే కాదు పైబర్ ఉండటం మూలాన గుమ్మడికాయను తింటే   ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. పదే పదే ఆకలి వేయకుండా అరికడుతుంది. కేవలం పొట్ట ఆరోగ్యం మాత్రమే కాదు..  గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా గుమ్మడికాయ ఉపయోగపడుతుంది.

కేవలం గుమ్మడికాయ మాత్రమే కాదు.. గుమ్మడి గింజలు కూడా జీర్ణక్రియకు మేలు చేస్తాయి. గుమ్మడి గింజలను వేయించి తినవచ్చు.  లేదా వీటిని సలాడ్ లలోనూ జోడించుకోవచ్చు. స్నాక్స్ తీసుకునే సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలు తొలగించి   గుమ్మడి గింజలు తీసుకోవచ్చు.

గుమ్మడికాయను వంటల్లో ఉపయోగించలేక పోతే వాటిని సూప్,  వెజిటబుల్ సలాడ్, స్మూతీ వంటివి తయారుచేసి తీసుకోవచ్చు.


                                                   *రూపశ్రీ.