చిలకడదుంపలను క్రమం తప్పకుండా తింటే ఏమవుతుందో తెలుసా..?
posted on Oct 29, 2024 9:30AM
చిలకడదుంపలు చాలామందికి ఇష్టమైన ఆహారం. చాలామంది వీటిని ఉడికించి తినడానికి ఇష్టపడతారు. మరికొందరు నిప్పుల మీద కాల్చి తింటారు. ఫుడ్ లవర్స్ అయితే చిలకడ దుంపలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు. వీటితో టిప్స్, టిక్కీ, పూర్ణం బూరెలు, భక్ష్యాలు కూడా చేసుకుని తింటారు. అయితే చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుంటే..
పోషకాలు..
చిలగడదుంపలు ఒక పోషకాల గని అని చెప్పవచ్చు. అవి మన శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తి, చర్మ ఆరోగ్యంలో దాని పాత్రకు ప్రసిద్ధి చెందిన విటమిన్ సి కూడా ఉంటుంది. ఒక మధ్యస్థ-పరిమాణ చిలగడదుంప అంటే సుమారు 130 గ్రాముల చిలకడదుంపలో పోషకాలు ఇలా ఉంటాయి.
విటమిన్ ఎ.. రోజువారీ అవసరమైన దానికంటే 400% కంటే ఎక్కువ విటమిన్-ఎ ఉంటుంది.
విటమిన్ సి.. రోజువారీ అవసరమైన దానిలో 25% లభిస్తుంది
ఫైబర్.. 4 గ్రాములు ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది
పొటాషియం.. గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం
మెగ్నీషియం.. ఒత్తిడిని తగ్గించడానికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది
ఇంకా ఇందులో ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇది మొత్తం శరీర శక్తి స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బీటా-కెరోటిన్ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం లో విటమిన్ ఎ గా రూపాంతరం చెందుతుంది. ఇది చిలగడదుంపలలో సమృద్ధిగా ఉంటుంది. ఈ విటమిన్ కంటి చూపు మెరుగ్గా ఉండటానికి రేచీకటి వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇప్పట్లో చాలామంది కంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు స్వీట్ పొటాటోను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు ఏదైనా సెల్యులార్ దెబ్బతినకుండా శరీరం రక్షణను బలోపేతం చేస్తాయి. స్వీట్ పొటాటోను తరచుగా తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుుతంది.
స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేస్తుంది. మలబద్దకం సమస్య రానీయదు. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
*రూపశ్రీ.