ఆంధ్రావాళ్ళని తిట్టని అందమైన ఎన్నికలు



తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద ఎంతమాత్రం ద్వేషం వుండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజలు కలసి మెలసి జీవిస్తున్నారు. అయితే రాజకీయ నాయకులకు మాత్రం ఆంధ్రావాళ్ళ మీద మహా ద్వేషం. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ఆంధ్రావాళ్ళని తిట్టనిదే తెల్లారదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తిట్టారు. ఎన్నికల సమయంలో తిట్టారు. దురదృష్టం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తిడుతూనే వున్నారు. ఆంధ్రావాళ్ళని తిట్టడం అనేది తెలంగాణ రాజకీయ నాయకులకు ఆక్సిజన్ లాంటిది. అలా తిట్టకపోతే వాళ్ళకు రాజకీయంగా రోజు గడవదు. సహజంగా ఏ ఎన్నికలు జరిగినా ఆంధ్రావాళ్ళ మీద మాటల బాణాలు వేస్తే చప్పట్లు మోగుతూ వుంటాయి. అయితే ఆంధ్రావాళ్ళని తిట్టకుండా త్వరలో అందమైన ఎన్నికలు జరగబోతున్నాయి. అవి జీహెచ్ఎంసీ ఎన్నికలు.

వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ నాయకుడూ ఆంధ్రావాళ్ళను పల్లెత్తు మాట కూడా అనరు. ఆంధ్రా తెలంగాణ భాయీ భాయీ అని చాలా ఫ్రెండ్లీగా వుంటారు. ఆంధ్రావాళ్ళ కాల్లో ముల్లు దిగితే నోటితో తీస్తా.. ముక్కుతో తీస్తా అంటారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ తెలంగాణ నాయకుల నోటితో తిట్లు తినే ఆంధ్రా వాళ్ళకి ఈ ఎన్నికలు చాలా మనశ్శాంతిని ఇవ్వబోతున్నాయి. హైదరాబాద్ ఎన్నికలలో ఆంధ్రాప్రజల నిర్ణయం చాలా కీలకం అందువల్ల ఏ పార్టీ కూడా ఆంధ్రావాళ్ళను ఈసారి తిట్టే సాహసం చేయబోదు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో  తిట్లర్లే అని మురిసిపోతున్న ఆంధ్రులూ వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా తిట్లు తినడానికి సిద్ధంగా వుండండి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu