ఈటివీ సుమన్ ఫ్యామిలీకి పవర్ స్టార్ సంతాపం
posted on Sep 8, 2012 4:15PM
రామోజీ రావు తనయుడు, నటుడు సుమన్ మృతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. సుమన్ మృతి చెందారని తెలసి తను ఎంతో బాధ పడ్డానని, సుమన్ చాల మంచి మనిషి అని , నాకున్న మంచి స్నేహితుల్లో ఆయన ఒకరు అంటూ పవన్ ఉద్వేగానికి గురయ్యారు. నిన్న పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సుమన్ భౌతిక కాయాన్ని సందర్శించి రామోజీ రావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.1966 డిసెంబర్ 23న జన్మించిన సుమన్ తన చిన్న వయస్సులో మంచి విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ కి కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందించి సుమన్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా నటుడిగా కూడా ఈ టీవీ సీరియల్స్ లో కనిపించి ప్రేక్షకుల మధిలో తనదైన ముద్ర వేసారు.