కాంగ్రెస్ కి కష్టకాలమేనంటున్న చిరంజీవి
posted on Sep 8, 2012 6:20PM
జుబిలీ హాల్‌లో ఏర్పాటు చేసిన మినీ మేథోమథనంలో చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ముందున్నది కష్టకాలమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి నివేదికలు రూపొందించడమే తప్ప వాటిని అమలు పరిచే పరిస్థితి లేదని, తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలను సంసిద్ధులను చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎవరిని కూడగట్టుకుని వెళ్తున్నారు, ఎవరు ఎవరితో వెళ్తున్నారు అన్నది తెలుసుకోవాలని చెప్పారు. పడడం, మళ్లీ లేవడం ఇన్నేళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి కొత్త కాకపోవచ్చు గాని,ప్రస్తుత పరిస్థితులలో అలా అనుకుంటూ కూర్చుంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను అభివృద్ధి పరిచే పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలకు చెప్పగలగాలని అన్నారు. తనకు పదవులపై ఎటువంటి ఆసక్తి లేదంటూ పార్టీని మరింతగా బలపరచడమే తన లక్ష్యమని అన్నారు.