డాలర్‌ శేషాద్రా మజాకా

dollar seshadri, ttd board dollar seshadri, tirupati dollar seshadri, ttd osd dollar seshadri, ttd employee dollar seshadri, tirumala tirupathi devasthanam dollar seshadri,  dollar seshadri service extendedతిరుమల తిరుపతి ఆస్థాన ఉద్యోగి డాలర్‌ శేషాద్రి రూటే వేరు. టిటిపిలో తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించుకున్నారు. రాష్ట్రంలోని ఒక ప్రముఖ వ్యక్తి వత్తిళ్లకు తల ఒగ్గిన టిటిడి ఆయన పదవీ కాలాన్ని మరోరెండు సంవత్సరాలకు పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది. 1978లో టిటిడిలో ఒక సామాన్య ఉద్యోగిగా  చేరిన శేషాద్రి తిరుగులేని వ్యక్తిగా మారారు.

ఇందిరాగాంధీ కాలంనుండి తన హవా కొనసాగిస్తున్న శేషాద్రి 2004-2006 లో బొక్కసం అధికారిగా ఉన్న సమయంలో 300 డాలర్లను బొక్కేసిన ప్రధాన నిందుతిడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈయనతో ఉన్న మరికొందరు ఉద్యోగులు కేసులో ఇరుక్కున్నప్పటికీ డాలర్‌ శేశాద్రి మాత్రం చక్రం తిప్పి కేసు నుండి బయటపడ్డారు. 2006 లోనే పదవీ విరమణ చేసినప్పటికి పలుమార్లు  ఆయన  పదవిని పొడగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంటూనే వుంది. 2009 శేషాద్రిని విధుల నుండి తప్పించాలంటూ  హైకోర్టు ఓ కేసులో తీర్పు ఇచ్చినప్పటికి తన పలుకుబడిని ఉపయోగించి కాంట్రాక్టు బేస్‌ కింద ఈయన మూడువేల జీతానికి ఏడాదిపాటు ఓయస్‌డిగా చేరారు. ఈపదవి ఆగస్టులో ముగియనుండగా మరోసారి చక్రం తిప్పిన శేశాద్రి తన పదవిని మరో రెండేళ్లు పొడిగించుకున్నారు.