అరెస్టు చంద్రకాంతిని ఆపలేదు!

చంద్రబాబు అరెస్టు అయిన రోజు... 
ఇక తెలుగు ప్రజల్లో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుంది...
పైగా ఈ రోజు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి ల పెళ్లి రోజు కూడా...
సంవత్సరం క్రిందట...ఇదే రోజు నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును అర్ధరాత్రి బస్సులో నిద్రిస్తూ ఉండగా... ఒక్కసారిగా సీఐడీ బృందాలు కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో అక్కడికి చేరుకొని అరెస్టు చేసిన సందర్భం బహుశా తెలుగు ప్రజల్లో నుండి ఇప్పుడప్పుడే చేరిగిపోదేమో... ఎందుకు అరెస్టు చేస్తున్నారో... తెల్లారే వరకూ మీడియాకి కూడా తెలియలేదు... తెల్లారిన తర్వాత గానీ ఒక క్లారిటీ రాలేదు... స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేశారని...

ఒక్కసారిగా జనం నివ్వెరపోయారు...ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో అరెస్టు అనే మాట వినిపించని చంద్రబాబు అరెస్టు అయ్యాడు అనే మాట నిస్సందేహంగా ప్రజలకు ఆశ్చర్యంగా అనిపించింది...
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అరెస్టు అయిన సందర్భాలు రెండే రెండు... మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్రీ ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని అక్కడికి వెళ్లి నిరసనలు తెలిపిన నేపథ్యంలో చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం మొదటిది అయితే...
రెండవది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డేవేలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్టు చేయడం...
ఇక ఈ రోజును చంద్రబాబు అరెస్టు అయిన రోజు అనేకంటే...జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా తనగొయ్యి తాను 9 అడుగుల వెడల్పు 9 అడుగుల పొడవుతో లెక్కలేసుకోని మరీ తవ్వుకున్న రోజు అని చెప్పక తప్పదేమో...!

బహుశా ఈ విషయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు...!  చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందన , ఆలోచన, ప్రపంచ దేశాల్లో నిరసనలు...ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులతో పాటూ ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడెక్కడో స్థిరపడిన వివిధ రంగాల ఉద్యోగులు అంతా కలిసి తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ మార్గ నిర్దేశకత్వంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన  చంద్రబాబు కృతజ్ఞత సభ యావద్దేశాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది...
ఒక్క మాటలో చెప్పాలంటే... "ఎవరినైనా అరెస్టు చేస్తే వారు చేసిన అక్రమాలు బయటికి వస్తాయి...కానీ చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయంటూ" చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన ట్వీట్ మొత్తం అరెస్టు పర్యవసానాలనే మార్చేసింది.
చేసింది చెప్పుకోవడంలో వెనుకబడింది అనే పదే పదే అనిపించుకునే టీడీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ఇక మనం చెప్పాల్సింది ఏమీలేదు అనుకునేంతలా ప్రజలు స్వచ్చందంగా బయటికి వచ్చి ఒక్కో విషయాన్ని చర్చిస్తుంటే...చంద్రబాబు గురించి తెలియని తరాలకు కూడా ఇదీ చంద్రబాబు అంటే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేని పరిస్థితి రాష్ట్రంలో అనివార్యంగా జగన్ కల్పించినట్టే అయింది.

తప్పు చేసిన ఎవ్వరైనా శిక్షార్హులే... కానీ చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోవడం ...370 కోట్ల అవినీతి అని చెప్పి చివరికి ఎలెక్టోరల్ బాండ్లను చూపించి 27 కోట్లుగా చెప్పడం...ఒక్క రూపాయి కూడా లావాదేవీలు జరిగినట్టు నిరూపించలేక ...ఇన్నర్ రింగ్ రోడ్ అనీ...ఫైబర్ నెట్ అనీ...రోజుకో కేసు పెట్టుకుంటూ వెళ్ళిన జగన్ ప్రభుత్వం చివరికి ప్రజల్లో నవ్వులపాలు కాక తప్పలేదు.
కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు కూడా ఇలాంటి చర్య పార్టీకి కచ్చితంగా నష్టం చేస్తుంది అని సన్నిహితుల దగ్గర మాట్లాడినప్పటికీ...జగన్ నిర్ణయానికి ఎదురుచెప్పే సాహసం చెయ్యలేక మిన్నకుండిపోయారనేది వైసీపీలో అంతర్గత చర్చ.
కేవలం... చంద్రబాబును జైలుకు పంపించాలన్న దుగ్ధతోనే... చంద్రబాబు కూడా బైలుపై బయట ఉన్న వ్యక్తే అని చెప్పడం కోసమే జగన్ ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టాడు అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది...

కానీ ఆశ్చర్యం ఏంటంటే...  చంద్రబాబు అరెస్టు అయితే ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తితే... ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలు బయటికి రావడానికి అంతలా సాహసించలేదు... కానీ మరో 8 నెలల్లో జరిగిన ఎన్నికల్లోగానీ ప్రజలు ఎందుకు బయటికి రాలేదో అర్ధం కాలేదు. జగన్ బహుశా కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకు పరిమితమవుతామని...ప్రజలు కొట్టిన చావు దెబ్బకి జగన్ కనీసం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటివరకు సరిగ్గా వారం రోజులు కూడా నిలకడగా ఉండలేని పరిస్థితి నెలకొంది.మరోవైపు ఆంధ్రప్రదేశ్ కంటే ముందే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏ స్థాయిలో కనిపించిందో బహుశా కేటీఆర్ కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు.

ఇక్కడ చంద్రబాబు అరెస్టులో ప్రత్యేకమైన మరో అంశం...17ఏ.. ఈ 17ఏ అంటే ఎంటో కూడా చంద్రబాబు అరెస్టుతో అందరికీ తెలసిపోయింది. ఇక చంద్రబాబు అరెస్టు విషయంలో ఈ విషయాన్ని సీఐడీ పరిగణనలోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదు తీసుకోవాల్సిందేనని నిన్న మొన్నటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసుల్లో విచారణ సందర్భంగా తేటతెల్లమైంది.
అంటే చంద్రబాబుకు 17ఏ  వర్తిస్తుంది... కానీ వైసీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి లేకుండానే అరెస్టు చేసి ఇక్కడ కూడా అధికారులు జగన్ భక్తులుగా నిరూపించుకొని ఇప్పుడు అనుభవిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం.

ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమకు ఎలాంటి వారు నాయకులుగా కావాలో వారే తమ ఓటు ద్వారా ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే,  ప్రస్తుతం విజయవాడ వరద విలయంలో చిక్కి అల్లాడుతుంటే... వారం రోజులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మిగతా మంత్రులు...ఎమ్మెల్యేలు అధికారులు శ్రమిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం... కానీ...ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు ఇవ్వడంతో పాటూ... వారి ఇళ్లను కూడా శుభ్రం చేసి బాధితులకు అప్పగించడం చంద్రబాబు మార్క్ పరిపాలన అనక తప్పదు...
ఇక్కడే కీలక విషయం...ఏంటంటే... 
ఈ ఇళ్లను శుభ్రం చేసే పనులు మాత్రమే కాక డ్రైనేజీ...కరెంటు...పాడైపోయిన తలుపులు కిటి కీలు...టీవీలు ఫ్రీడ్జిలు... ఇవన్నీ యుద్ధప్రాతిపదికన బాగు చేసి బాధితులకు అందించడానికి ఒక ప్రయి వేటు కంపనీతో భాగస్వామ్యం చేసుకుంది ప్రభుత్వం... ఆ కంపెనీ నుండి విజయవాడ వరదల్లో పని చేస్తున్న దాదాపు 500 మంది  స్కిల్ల్డ్ వర్కర్లు...టెక్నిషియన్లు... చంద్రబాబు స్థాపించిన , చంద్రబాబు అరెస్టుకు వైసీపీ ప్రభుత్వం కారణం చూపిన స్కిల్ డేవేలప్మెంట్ ప్రోగ్రాం నుండి ట్రైనింగ్ అయిన వారే కావడం కొసమెరుపు.