సగానికి పైన జబ్బులన్నీ దీనివల్లే!

శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ప్రతిరోజూ వివిధ రకాల విటమిన్లు  సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. ఇవన్నీ  ఆహారం నుండి సులభంగా పొందవచ్చు, అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన,  పోషకమైన ఆహారాన్ని  క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. అయితే అదే ఆహారం విషయంలో చేసే పొరపాట్ల కారణంగా   శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది శరీరంపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.  మెగ్నీషియం కూడా  అలాంటి  మూలకమే..  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం.

మెగ్నీషియం లోపం అనేక వ్యాధుల సమస్యల ప్రమాదాన్ని  పెంచుతుంది . మెగ్నీషియం  మెదడు,  శరీరం  రెండిటికీ ముఖ్యమైనది. ఇది గుండె, రక్తంలో చక్కెర స్థాయిలు,  మానసిక స్థితి సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఆకు కూరల నుండి గింజలు, బీన్స్ వరకు ఎన్నో ఆహారాలలో కనిపిస్తుంది. అసలు మెగ్నీషియం లోపం ఎందుకు ఎలా వస్తుంది?? ఆహారంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అందరికీ ఎందుకు సలహా ఇస్తారో.. దాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుంటే.. 

శరీరంలో మెగ్నీషియం లోపం..

పెద్దలు వారి శరీరంలో 25 గ్రాముల మెగ్నీషియం కలిగి ఉంటారు, వీటిలో అస్థిపంజర వ్యవస్థ 50-60% నిల్వ చేస్తుంది. మిగిలినవి శరీరంలోని కండరాలు, కణజాలాలు,  ద్రవాలకు ఉపయోగం. మెగ్నీషియం లోపం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి బోలు ఎముకల వ్యాధి, మానసిక ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, నరాల సంబంధిత రుగ్మతలతో పాటు రక్తంలో చక్కెర పెరుగుదలకు కూడా కారణమవుతుంది.

 మెగ్నీషియం ఎందుకు అవసరం??

విటమిన్-డి, కాల్షియంతో పాటు ఎముకలకు మెగ్నీషియం  కూడా అవసరం. ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించడానికి మెగ్నీషియం అవసరమవుతుంది. మెగ్నీషియం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతను పెరుగుతుంది,  రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-డి స్థాయిలను నియంత్రించడంలో  కూడా సహాయపడుతుంది. కాబట్టి మెగ్నీషియం శరీరానికి చాలా వసరం.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది.. 

 టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు చాలా ఉపయోగపడతాయి.. మెగ్నీషియం గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  మెగ్నీషియం లోపం ఇన్సులిన్ నిరోధకతతో ముడిపడి ఉంటుంది. అయితే మెగ్నీషియం ను సప్లిమెంట్స్ కంటే ఆహరంతో తీసుకోవడం ఎంతో మంచిది. 

మెగ్నీషియం కోసం ఏమి తినాలి?

మగవారికి ప్రతిరోజూ 400-420 గ్రాముల మెగ్నీషియం  అవసరం అయితే ఆడవారికి 340-360 గ్రాములు అవసరం.  గింజలు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి అనేక ఆహారాలలో మెగ్నీషియం అధిక స్థాయిలో ఉంటుంది. అవకాడో, బంగాళదుంప, అరటిపండు మొదలైన వాటి నుంచి కూడా శరీరానికి అవసరమైన మెగ్నీషియం లభిస్తుంది. వీటిని తీసుకుంటే మెగ్నీషియం లోపాన్ని నివారించవచ్చు.

                                           *నిశ్శబ్ద.