పాపం శ్రీలక్ష్మి!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే ఎవరికీ అయ్యో పాపం అని కూడా అనాలని అనిపించదు.  ఎందుకంటే గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రొకో కేసులలో విచారణను ఎదుర్కొన్నారు. ఆ అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అయితే అప్పటి తప్పిదాల నుంచి ఆమె ఎటువంటి పాఠాలూ నేర్చుకోలేదు. 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత.. ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అలా వచ్చిన ఆమెకు జగన్ కీలక పోస్ట్ ఇచ్చారు. 

సీనియర్ ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి జగన్ క్విడ్ ప్రోకో కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు. అప్పట్లో, కేసుల ఒత్తిడి ఆమె ఆరోగ్యం క్షీణించింది మరియు చాలా నెలలు ఆమెను వీల్ చైర్‌కు పరిమితం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ ఇప్పించారు.  ఆమె జగన్ కోసం మళ్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అది పక్కన పెడితే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ మరి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తదుపరి సీఎస్ ఎవరు అన్న చర్చకు వచ్చింది. సీనియారిటీని బట్టి చూస్తే నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో  శ్రీలక్ష్మి నియమితురాలు అవ్వాల్సి ఉంటుంది.

అయితే  జగన్ తో మఅంటకాగి నింబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఆమెకు ఆ పదవి దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవు.  దీంతో ప్రతి ఐఏఎస్ కలలు కనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి శ్రీలక్ష్మికి అందే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందుకు కారణం ఆయన స్వయం కృతాపరాధమేనని ఏపీ సెక్రటేరియెట్ లో చర్చ జరుగుతోంది.  జగన్  కోసం నిబంధనలను తుంగలోకి తొక్కినందుకు శ్రీలక్ష్మి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు.  ఆమె మూల్యం చెల్లిస్తోందని ఏపీ సెక్రటేరియట్ లాబీల్లో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా శ్రీలక్ష్మికి సీఎస్ పదవి దక్కకపోవడానికి అన్యాయాలకు కొమ్ము కాసి, అధికార పార్టీ అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి వంత పాడటమే కారణమని అంటున్నారు.