జామకాయ మధ్యలో విత్తనాలు తినకుండా పడేస్తుంటారా ? దిమ్మ తిరిగే నిజాలివి..!
posted on Dec 24, 2024 9:30AM
జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. యాపిల్ పండులో ఉండే పోషకాలకు సమానమైన పోషకాలు ఉండటం వల్ల, యాపిల్ పండు కంటే తక్కువ ధరలో దొరకడం వల్ల జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. జామపండు పోషకాల నిధి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జామపండు మధ్యలో విత్తనాల భాగం అంటే చాలామందికి నచ్చదు. ఈ విత్తనాల భాగాన్ని తొలగించి కండ భాగాన్ని తింటుంటారు. అయితే జామపండులో నిజమైన బలం దాని మధ్యలో ఉంటుందట. పరిశోధకులు దాని విత్తనాలపై పరిశోధన చేసి ఇందులో చాలా శక్తి ఉంటుందని స్పష్టం చేశారు. దీని గురించి తెలుసుకుంటే..
జామ గింజలు ఎందుకు పారేస్తారు?
కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయంతో చాలా మంది జామ గింజలను పారేస్తుంటారు. కానీ జామ విత్తనాల గురించి చేసిన పరిశోధనలు చాలా షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి.
ప్రయోజనాలు..
జామ గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రమాదకరమని నిరూపించే ALT, AST ఎంజైమ్‌ల స్థాయిలు కూడా తగ్గుతాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది . జామ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. అంటే జామ పండ్లను బాగా తినేవారికి వృద్దాప్యం తొందరగా రాదు.
జామ గింజల్లో కాల్షియం, జింక్, కాపర్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలకు చాలా అవసరం. లేకపోతే బలహీనత మొదలవుతుంది. ఇది తీవ్రంగా మారితే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. . ఈ వ్యాధిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి, సులభంగా విరిగిపోతాయి.
జామపండు మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది రెండు రకాల ఫైబర్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సరైన జీర్ణక్రియ ఉంటే ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, పైల్స్ మొదలైన సమస్యల ప్రమాదం దానికదే తగ్గుతుంది. ఈ లాభాలతో పాటు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది.
విత్తనాలను ఇలా కూడా..
జామ విత్తనాలను నేరుగా జామ పండుతో తినడం ఇష్టం లేకపోతే.. జామ విత్తనాలను పండు నుండి వేరు చేయాలి. వీటిని ఎండబెట్టాలి. తరువాత వీటిని దోరగా వేయించి నిల్వచేసుకోవాలి. వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. అంతే కాకుండా ఈ విత్తనాలను స్పైసీ పౌడర్ లా కూడా తయారుచేసుకుని తీసుకోవచ్చు.
*రూపశ్రీ.