'దేవర' గ్లింప్స్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఎన్టీఆర్ లుక్!

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'దేవర' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ, తాజాగా మేకర్స్ కళ్ళు చెదిరే పోస్టర్ ను విడుదల చేశారు.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మూవీ అప్డేట్స్ కోడం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 

ఈ కొత్త సంవత్సరం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా దేవర నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. జనవరి 8న గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో సముద్రంలో పడవ మీద నిల్చొని ఉన్న ఎన్టీఆర్ లుక్ మాములుగా లేదు. పోస్టర్ ని బట్టి చూస్తే అందరూ ఊహించిన దానికంటే కొరటాల ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది.