దానం నాగేందర్ చూపు కాంగ్రెస్ వైపు 

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కంటే బిఆర్ఎస్ ఎక్కువస్థానాల్లో గెలుపొందింది. మూడునెలలు పూర్తికాకమునుపు ఈ నగరం నుంచి బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ బాట  పడుతున్నారు. కెటీఆర్ ప్రధాన అనుచరుడైన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ చక్రం తిప్పారు. అధికారం మారడంతో ఆయన కూడా మారిపోయారు.రామ్మోహన్ మేయర్ గా ఉన్నప్పుడు రాజధానిలో విలువైన భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కబ్జాల భాగోతం బయటపడకుండా కాంగ్రెస్ లో గప్ చుప్ గా చేరిపోయినట్లు తెలుస్తోంది.  తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అధికారికంగా శనివారం చేరవచ్చని సమాచారం. నాగేందర్ పై కూడా కబ్జా ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ హాయంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్ బిఆర్ఎస్ అధికారంలో రాగానే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కారు పార్టీలో చేరారు. ఇప్పుడు కారుపార్టీకి రాజీనామా చేసి మళ్లీ హస్తం పార్టీలో చేరే అవకాశం ఉంది. తన నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ ను నాగేందర్ కబ్జా చేసినట్లు కెసీఆర్ ప్రభుత్వానికి ఆధారాలు లభించడంతో అప్పట్లో నాగేందర్ బిఆర్ఎస్ లో చేరారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూట గట్టుకుంది. దీంతో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. గత ఎన్నికలలో తన రాజకీయ గురువైన పిజెఆర్ తనయ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ  పోటీ చేసినప్పటికీ బిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయినప్పటికీ దానం మనసు కాంగ్రెస్ వైపే ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలని అనుకున్నారేమో తిరిగి  ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నాగేందర్ పై కూడా భూ కబ్జా ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి బిఆర్ ఎస్ నేతలు, అధికారులపై సీరియస్ గానే ఉన్నారు . కాబట్టి దానం అడుగులు కాంగ్రెస్ వైపే పడుతున్నాయి. మరో బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికి తొడగట్టి సవాల్ చేశారు.  అరేయ్ రేవంత్ దమ్మనదారా అంటూ సవాల్ చేశాడు . నిన్న కర్ణాటక డిప్యూటి సీఎం డి. శివకుమార్ ను కలిసారు.ఒకటి రెండు రోజుల్లో అతను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానీయకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి విద్యాసంస్థలు ఆక్రమంగా భూ కబ్జాలు చేసి చర్యలకు రేవంత్ సర్కారు ఉపక్రమించింది