దువ్వాడ, మాధురి.. ఇక అంతా ఓపెన్!
posted on Oct 7, 2024 11:58AM
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి సంబంధ బాంధవ్యాలపై తీవ్ర దుమారం రేగిన విషయం అందరికీ తెలిసిందే. కట్టుకున్న భార్య దువ్వాడ వాణిని కాదని దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో కలిసి వుంటున్నారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, మాధురితో కలిసి బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. శ్రీవారిని దర్శించుకుని జంటగా బయటకు వచ్చిన వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.ఈ సమయంలో మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కోలాహలం వేళ ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి కనిపించారు. ఇటీవలి కాలంలో మూడు స్తంభాలాట తరహాలో జరిగిన వివాదం తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటగా కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల భార్యా పిల్లలతో వివాదం తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఓపెన్ అయిపోయారు... ఏ ఇంటి విషయంలో అయితే దువ్వాడ వాణి పట్టుబడుతోందో ఆ ఇంటిని దివ్వెల మాధురి పేరిట రిజిస్టర్ చేసేశారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ మూడు కోట్లు బాకీ వున్నారని, అందుకే ఆ బాకీ కింద ఈ ఇంటిని తనకు రాసేశారని దివ్వెల మాధురి చెబుతుంటే, దువ్వాడ వాణి మాత్రం ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు అంటూ చెబుతున్నారు. ఎప్పటికైనా దివ్వెల మాధురిని ఆ ఇంటి నుంచి బయటకి పంపేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇంత రచ్చ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా ఓపెన్ అయిపోయారు. దివ్వెల మాధురితో మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. స్కూటీపై షికార్లు చేస్తున్న ప్రేమ జంటను చూస్తుంటే ముచ్చటగా వుందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ ఇద్దరినీ ట్రోలింగ్ చేస్తున్నారు.