బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. సచిన్, విరాట్ కోహ్లీపై కేసు

వేలాది మంది జీవితాలలో చీకటి నింపుతున్న బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైనే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తున్న సెలిబ్రిటీలపై కూడా వరుసగా కేసులు నమోదు చేస్తున్నది. ఇప్పటికే ప్రముఖ సినీనటులు ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రాణా వంటి వారిపైనే కాకుండా వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల, బుల్లి తెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసింది. ఆయా కేసులలో ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిథి శ్యామల, బుల్లి తెర నటులు విష్ణుప్రియ తదితరులను పోలీసులు విచారించారు.  తాజాగా 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ ఓనర్లే టార్గెట్ గా కఠినమైన సెక్షన్లు వారిపై నమోదు చేశారు. వీరిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. 

అంతే కాకుండా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండైల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ లపై కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు కేసు నమోదైంది.అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమేట్ చేశారనీ, వీరిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అర్జున్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.