సామాజిక బాధ్యతగా అన్నార్తులను ఆదుకుందాం!

ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరం ఐదుగురికి చేయూతనిద్దామ‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ఒకరు ముందుకు వచ్చి సహకరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బిజెపి జాతీయ నాయకత్వం పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదవారి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరు ఐదుగురి వ్యక్తులకు తగ్గకుండా ఆహారం అందించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా  కరీంనగర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వంట చేసిన ఆహార పదార్థాలను ఆయన స్వయంగా అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు వివిధ సంస్థల ప్రతినిధులు బాధ్యతగా విధిగా పేదలకు ఆహారాన్ని అందించే కార్యక్రమాలను చర్యలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతున్న కరోనా వైరస్ నివారణ చర్యలకు ప్రజలంతా సహకరించి ఇంటి వద్ద ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు సహకరించాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.