పురంధేశ్వరిని అంటే నారక్త౦ ఉడుకుతోంది: జయకృష్ణ

 

Balayya Purandeswari, Purandeswari Balayya, balakrsihna tdp, Purandeswari congress

 

నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు. పత్రికల్లో వార్తలు చూసి బాలయ్యకు ఫోన్ చేశాను. లేఖపై సంతకం కోసం నా వద్దకు రాలేదని చెప్పాడు. ఈ విషయంలో వివాదం లేదు. విగ్రహం ఇవ్వాలని స్పీకర్ నుంచి తనకు లేఖ అందగానే తనకంటే పెద్దవాళ్లైన అందరి ఇళ్లకు తానే స్వయంగా వెళ్లి విషయం చెప్పాను’’ అని కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు.



చంద్రబాబు నివాసానికి కూడా మూడు సార్లు లేఖలు పంపించాను. కానీ ఎవ్వరూ దానిని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నాకు ఉంది. నా ఉద్దేశం కూడా అదే అని ఆమె అన్నారు. ఇక పురంధేశ్వరికి ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ మద్దతు పలికారు. దారిన పొయ్యే దానయ్యలంతా నా చెల్లెలు పురంధేశ్వరి గురించి మాట్లాడితే నా రక్త ఉడుకుతోంది అని ఘాటుగా హెచ్చరించాడు. ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో పెడుతున్నందుకు అంతా సంతోషించాలి కానీ వివాదాలు సరికాదు అని అన్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu