'సగిలేటి కథ' నుంచి 'అట్టా ఎట్టాగా' వచ్చేసింది!

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ నుంచి రెండో సాంగ్ విడుదలైంది. 

ఈ సినిమాలోని 'అట్టా ఎట్టాగా' రెండొవ లిరికల్‌ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ రధన్ డిజిటల్ లాంచ్ చేసి, చిత్ర యూనిట్ కి విషెష్ తెలియజేసారు.  "అట్టా ఎట్టాగా పుట్టేసినావు.. నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు" అంటూ సాగిన చక్కటి మెలోడీని రాజశేఖర్ సుద్మూన్, జశ్వంత్ పసుపులేటి రాశారు. యశ్వంత్ నాగ్(పరేషాన్ మూవీ ఫెమ్), కమల మనోహరి ఆలపించారు. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడు. సగిలేటి కథ సినిమాలో ప్రతి సాంగ్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా 'అట్టా ఎట్టాగా' సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.

కాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు సెరవేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.