ఆమె నా రాజకీయ వారసురాలు కాదు...
posted on Sep 7, 2017 12:59PM
![](/teluguoneUserFiles/img/ashok(3).jpg)
అదితి పూసపాటి ఈమె ఎవరనుకుంటున్నారా..కాస్త రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకి ఎవరికైనా తెలుస్తుంది ఈమె కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూతురని. ఆశోక్ గజపతిరాజు పెద్ద కుమార్తె అదితి. ఇప్పుడు ఈమెనే హాట్ టాపిక్ అయ్యారు. దీనికి కారణం ఈమధ్య గజపతిరాజు ఎక్కడ ప్రచారం జరిగినా ఆమెను తీసుకెళ్లడమే. అయితే ఇప్పుడు ఆయనకు పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టు కనిపిస్తోంది. ఆయన రాజకీయ వారసురాలిగా 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయాల్సి ఉంది. కొద్ది నెలలుగా జిల్లాలో భారీ ఎత్తున దీనిపై ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన అశోక్ గజపతిరాజు తన కూతురిని కూడా తీసుకొచ్చారు. ఈసమావేశంలో అశోక్ గజపతిరాజు చంద్రబాబు ఇద్దరూ భేటీ అయి కాసేపు ముచ్చటించగా.. బీజేపీలోకి వెళ్తున్నట్టు వచ్చిన వార్తలపై మాట్లాడుకున్నారట. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని తాను బీజేపీలో చేరడం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారట. ఇంకా తన కూతురి అరంగేట్రంపై మాట్లాడుతూ... కుమార్తెను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే ఆలోచనేమైనా ఉందా అని చంద్రబాబు అడుగగా...అలాంటిదేమీ లేదని, వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయాలనుకుంటున్నానని అశోక్ స్పష్టం చేశారట. దీనికి చంద్రబాబు.. అలాంటప్పుడు పార్టీ కార్యక్రమాలకి తీసుకురావడం ఎందుకు... ఇకపై ఆమెను రాజకీయాల్లో ప్రమోట్ చేయెద్దని చెప్పేశారట.