ఏపీ టూరిజం శాఖ ఎండిగా అమ్రపాలి

ఐఏఎస్ ఆఫీసర్‌గా తెలంగాణ కేడర్లోనే కొనసాగాలని తీవ్రంగా ప్రయత్నించి విఫలమై ఆంధ్ర ప్రదేశ్ లో అనివార్యంగా రిపోర్ట్ చేసిన అమ్రమాలికి కీలక పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.    తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌ కమిషనర్ సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అమ్రపాలి 2010 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె తనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగిన ఆమ్రపాలి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా కూడా పనిచేశారు. మళ్ళీ తెలంగాణ కేడర్‌కి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు అత్యంత ప్రాధాన్యత కలిగిన   జీహెచ్ఎంసీ కమిషనర్‌ తో పాటు పలు కీలక బాధ్యతలు అప్పగించింది.

ఇటీవల ఆమెను ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిందిగా  ఆదేశాలు వచ్చినప్పటికీ  తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని   కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరినప్పటికీ ఫలిం లేకపోయింది.  ట్రైబ్యునల్ లోనూ, కోర్టులోనూ కూడా చుక్కెదురవ్వడంతో  ఆమ్రపాలి అనివార్యంగా తెలంగాణ విడిచి విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్‌ లో రిపోర్టు చేశారు.  ఆలా రిపోర్టు చేసిన అమ్రపాలికి ఏపీ సీఎస్ నిరభ్ కుమార్ ఏపీ టూరిజం శాఖ ఎండీగా, అలాగే  ఏపీ టూరిజం అథారిటీ  సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.