ఎన్టీఆర్ పాటకు డ్రైవర్ డ్యాన్స్.. లోకేష్ ట్వీట్.. కథ సుఖాంతం!

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయినా అనుక్షణం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అలర్ట్ గా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా స్పందిస్తున్నారు. ఆ కష్టాన్ని, నష్టాన్ని తొలగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకు ఉదాహరణ చెప్పాలంటే... ఇటీవల ఆర్టీసీ బస్  డ్రైవర్ ఒకతను దేవర సినిమాలోని దావుడి పాటకు డ్యాన్స్ చేశారు. అదేంటి డ్యాన్స్ చేయడానికీ లోకేష్ ప్రతి ఒక్కరి కష్టంలోనూ నేనున్నానంటూ ముందుకు వస్తున్నారనడానికి సంబంధం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

ఆ డ్రైవర్ ఏదో తన ఇంట్లోనో లేకపోతే డ్యూటీ దిగిపోయిన తరువాతో ఈ డ్యాన్స్ చేయలేదు. బస్సును మార్గ మధ్యంలో నిలిపేసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఆయన చేసిన ఆ డ్యాన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆయన ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించారని గానీ, బస్సు మధ్యలో ఆపేయడం వల్ల తమకు సమయం వృధా అయ్యిందని కానీ ఎటువంటి కంప్లయింట్లూ రాలేదు. అయినా విధి నిర్వహణలో నిర్లక్యంగా వ్యవహరించాడంటూ ఆ కండక్టర్ ను ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే డ్రైవర్ ను ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేయడానికి ముందే లోకేష్ ‘సూపర్ డ్యాన్స్ బ్రదర్.. కీపిటప్, బస్సులో ప్రయాణీస్తున్న వారు కూడా ఎలాంటి ఫిర్యాదులూ చేయకుండా  నీ డ్యాన్స్ ను నాలాగే యంజాయ్ చేసి ఉంటారు ’ అంటూ ట్వీట్ చేశారు. 

ఇప్పుడు విషయానికి వస్తే.. ఆ డ్రైవర్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని ట్వీట్ చేస్తూ ఓ నెటిజన్ లోకేష్ కు ట్యాగ్ చేస్తూ.. విధుల్లో క్రమశిక్షణ, సమయ పాలనా అత్యంత ముఖ్యమైనవే అయినా.. ఎవరికీ నష్టం కలిగించని ఈ చిన్న పాటి వినోదం అందించిన ఆ కండక్టర్ ను సస్పెండ్ చేయడం అన్యాయం అని పేర్కొని, అతడి సస్పెన్ష్ ఎత్తివేసేలా చూడాలి అని కోరారు. లోకేష్ వెంటనే స్పందించారు. ఆ నెటిజన్ కు వెంటనే బదులిస్తూ ఆ కండక్టర్ సస్పెన్షన్ వెనక్కు తీసుకుంటారు. ఆయన వెంటనే విధుల్లో చేరుతారు అని పేర్కొన్నారు. అంతే కాదు తాను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత కలుస్తానని ఆ నెటిజన్ కు రిప్లై ఇచ్చారు. లోకేష్ ఇమ్మీడియెట్ రెస్పాన్స్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.