వేణు స్వామిపై చర్యలకు హైకోర్టు ఆదేశం

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాగచైతన్య, శోభితల వివాహ నిశ్చితార్థం సమయంలో వారి విడాకులు ఖాయం అంటూ వారి వ్యక్తిగత జీవితంపై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై  వేణు స్వామిపై  పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయగా..  మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసి  తమ ముందు హాజరు కావాలని గతంలో వేణుని ఆదేశించిన సంగతి తెలిసిందే.  

తనను హాజరు కమ్మని ఆదేశించే అధికారం మహిళా కమిషన్ కు లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది.  వేణు స్వామిని తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించే అధికారం మహాళా కమిషన్ కు ఉందని పేర్కొంటూ.. వేణు స్వామిపపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మహాళా కమిషన్ ను ఆదేశించింది.