ఏపీలో దసరా సెలవులు రెండు రోజులు అదనం
posted on Sep 19, 2025 1:53PM

ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు. అంటే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు నుంచే ఏపీలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన చేసిన ఓ పోస్టులో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రంలో దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వాస్తవానికి విద్యాశాఖ ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ మేరకు రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా సెలవులు ఉండాలి. అయితే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దసరా సెలవురు రెండు రోజులు పెరిగాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలుహర్షం వ్యక్తం చేస్తున్నాయి.