దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు
posted on Jan 14, 2026 10:34AM
.webp)
సంక్రాంతి పర్వదిన సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మకర సంక్రాంతి మీ జీవితాల్లో సరికొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నాని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన నువ్వులు-బెల్లం తీపిదనంతో నిండిన ఈ దివ్యమైన పండుగ, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని తీసుకురావాలి. సూర్య భగవానుడు మనందరినీ ఆశీర్వదించాలి" అని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర సమయం. ఈ సందర్బంగా సమాజంలో శాంతి, సామరాస్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. మకర సంక్రాంతి, మాఘ్ బిహు, పొంగల్ వంటి పండుగలు భారతదేశపు పంట కోతల పండుగలని, ఇవి మన దేశ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెబుతాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ పండుగలు రుతువుల మార్పుకు సూచికగా నిలుస్తాయని, ప్రకృతి, సాంస్కృతిక వైవిధ్యం, సామాజిక సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయని తెలిపారు.