డబ్ల్యూపీఎల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు
posted on Jan 14, 2026 12:13PM

డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 71 పరుగులు చేసి జట్టును ఏడు వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చింది. ఈ ఇన్నింగ్స్‌తో డబ్ల్యూపీఎల్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.
మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్లలో హర్మన్(1016 పరుగులు) రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ముంబై ఇండియన్స్‌కే చెందిన నాట్ సీవర్ బ్రంట్(1101పరుగులు) కొనసాగుతోంది. గుజరాత్‌తో మ్యాచులో 193 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా, హర్మన్‌ప్రీత్ క్రీజులోకి వచ్చాక మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది. హర్మన్ విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హర్మన్‌కు నికోల్ కేరీ (23 బంతుల్లో 38*) చక్కటి సహకారం అందించింది.