కుక్క ఆహారం తిని ఇబ్బంది పడ్డ సెరెనా విలియమ్స్..
posted on May 13, 2016 6:06PM
మనుషులు తినే ఆహారం మనుషులు తినాలి.. జంతువులు తినే ఆహారం జంతువులే తినాలి.. అంతేకాని ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులే కదా.. అవి తినే ఆహారం మనం కూడా టేస్ట్ చేద్దాం అంతే తర్వాత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కి. రెండు రోజుల క్రితం ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ ఆడేందుకని రోమ్ వెళ్లింది సెరెనా. ఆమెతో పాటు తన పెంపుడు కుక్క 'చిప్' ను కూడా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తాను బస చేసిన హోటల్ లో తన 'చిప్' కు కూడా ఆహారం తయారు చేయించమని దానికి సంబంధించిన ప్రత్యేక మెను కూడా చెప్పిందంట. అయితే ఎందుకో 'చిప్' కోసం తయారు చేసిన ఆహారం తినాలనిపించిదట సెరానాకు.. అంతే ఒక స్పూన్ తీసుకొని తినడం జరిగింది. అయితే కొద్ది సేపటి తరువాత దాని ప్రభావం తెలిసింది సెరానాకు. స్టమక్ అప్ సెట్ అవడంతో కొంత ఇబ్బంది పడింది. అయితే, తేరుకున్న సెరెనా మర్నాటి మ్యాచ్ లో విజయం సాధించింది.
మ్యాచ్ గెలిచిన అనంతరం.. ‘చిప్’ ఆహారం రుచి చూశారు కదా! ఎలా ఉంది?’ అని అడుగగా ..‘నచ్చలేదు. ఇది మనుషులు తినేది కాదని ఆ మెనూలో రాసి ఉంటే బాగుండేది’ అని సెరెనా జవాబు ఇచ్చిందట.