బ్రిటన్ పార్లమెంట్లో మోహన్ బాబుకు అరుదైన గౌరవం....
posted on May 13, 2016 6:29PM
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు బ్రిటన్ లో ఓ అరుదైన గౌరవం దక్కింది. మోహన్ బాబు నటించిన పలు సినిమాల్లోని డైలాగ్స్ అన్ని ఒక పుస్తకంగా ప్రచురించి దానిని బ్రిటన్ పార్లమెంట్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్‌మన్, వీరేంద్రశర్మ, మోహన్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడి సభ్యులనుద్దేశించి లక్ష్మీ మంచు ప్రసంగించగా, మంచు మనోజ్ తండ్రిని అనుకరిస్తూ హావభావాలు, డైలాగులతో అలరించారు. మంచు విష్ణు కోరడంతో చివరగా ‘పెదరాయుడు’ చిత్రంలోని పాపులర్ డైలాగ్స్ చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు మోహన్ బాబు. కాగా కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట జీవితంలో హీరోగా, విలన్ గా, నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నారు.