90 కోట్ల విజయ్ మాల్యా విల్లా స్వాధీనం...
posted on May 13, 2016 5:40PM
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా విల్లాను ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ స్వాదీనం చేసుకుంది. గోవాలో 90 కోట్లు విలువ చేసే ఆయన విల్లాను స్వాదీనం చేసుకునేందుకు కలెక్టర్ బ్యాంకు అధికారులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు విల్లాను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు విజయ్ మాల్యాకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇంటర్ పోల్ కు ఓ లేఖ రాసింది. మాల్యాను తమ దేశం నుండి ఇండియాకు పంపించడం కుదరదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తుంది. కాగా ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు.