జైల్లో జగన్ ని కలిసిన కాసాని జ్ఞానేశ్వర్
posted on Dec 14, 2012 1:33PM
.jpg)
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం ఆయన ఆ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి ని చంచల్ గూడ జైలులో కలుసుకున్నారు.
అందరూ జగన్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ ప్రముఖ బిసి నేత వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే బహిరంగ సభలో తన అభిప్రాయాలను ప్రజలకు చెపుతానని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కాసాని ఆ రంగంలో సంపాదించిన డబ్బుతో ఆయన కులం ‘ముదిరాజ్’ కోసం పలు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ఓ సమయంలో తెలుగు దేశం కు దగ్గరయినప్పటికి, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో ఆయన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు.
కాసాని గతంలో ‘మన పార్టీ’ అనే రాజకీయ పార్టీని కూడా నడిపారు. రంగా రెడ్డి జిల్లా నుండి గతంలో ఆయన శాసనమండలి కి పోటీ చేసి ఓడిపోయారు.