కొబ్బరి నీళ్లతొ వచ్చే ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు..
ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది. కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి. గుండెకు చాలా మంచిది: కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు. జీవక్రియను పెంచుతుంది : రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించుకోవొచ్చు : తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. డీ హైడ్రేషన్ ఉండదు : కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది: కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి.
read moreఫ్యాట్ కరగటం ఆహరం ద్వారానే సాధ్యం..
All of us want to be healthy & fit. But more than healthy & fit people want to lose weight and look beautiful. So for all of them who are keen on losing weight, Veramachaneni Garu gives us 4 categories. To know them in detail, watch the video. https://www.youtube.com/watch?v=c4pmVZvoqcE
read moreIs Excessive Sweating embarrassing you??
Sweating is physiological process occurring in the body, it way of dissipating heat and also means by which certain toxic wastes are thrown out. Sweating in warm and humid conditions or after exercising is considered normal. Sweating occurring in unusual conditions, without any stimulus or even in cooler climates is considered hyperhidrosis or excessive sweating. It is usually linked to some medical conditions like menopause, anxiety or hyperthyroidism. Sweating is embarrassing, it stains clothes and ruins the social interactions, and it may also have serious implications such as making it difficult to grip on things and may earn you the tag of ‘butter fingers’. Hyperhidrosis is mostly neurologic, endocrine, infectious and systemic diseases, most cases are the people who are apparently healthy and still suffer from hyperhidrosis. Systemic conditions associated are; heart diseases, cancer, stroke, hyperthyroidism, menopause, spinal cord injuries, lung diseases, Parkinsonism and certain anti-depressants. Best way to tackle this to find out the trigger and have a judicious approach. Usage of anti-perspirants which contain aluminum or aluminum chloride, oral anti-cholinergic drugs reduce sweating and Botox-A has been approved by the FDA for treating excessive axillary sweating. The sweat gland can be destroyed by microwave energy or lasers, to reduce the sweating. As a last resort is thoracic sympathectomy these will cut off the stimulation of sweat glands, for sweating. -Koya Satyasri
read moreడయాబెటీస్ ఉంటే పండ్లు తినవచ్చా!
డయాబెటీస్ ఉన్నవారు పండ్లకి ఆమడ దూరంలో ఉంటారు. మహా అయితే నేరేడు పండ్ల సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే చక్కెర వ్యాధి ఉన్నవారు నేరేడు పండు తప్ప మరే పండు తిన్నా తేడా వస్తుందేమో అన్న భయం వారిది. నిజానికి మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అతి చవకగా, అతి సహజంగా అందించే బాధ్యత పండ్లది. అలాంటి పండ్లని పూర్తిగా దూరం పెట్టడం వల్ల, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మరి డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి పండ్లను, ఏ రకంగా తీసుకోవాలో నిపుణులు చెబుతున్న మాటలను ఓసారి చూద్దాం... ఎలాంటి బెర్రీలైనా! స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు... ఇలా రకరకాల బెర్రీ పండ్లు ఇప్పుడు మనకి కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నిస్సంకోచంగా తీసుకోవచ్చంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరుకోదనీ, కాబట్టి వీటిని తినవచ్చనీ సూచిస్తున్నారు. పైగా ఈ బెర్రీలలో ఉండే రకరకాల విటమిన్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది కూడా. నారింజ: చక్కెరవ్యాధిగ్రస్తులకు ఇష్టమైన పండు నారింజేనేమో! తీపి కంటే పులుపే ఎక్కువగా ఉండే నారింజతో శరీరానికి కావల్సిన ‘C’ విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో పీచుపదార్థాలు కూడా అధికమే! పైగా నారింజలో ఉండే ఫోలేట్, పొటాషియం అనే పదార్థాలకి రక్తపోటుని అదుపుచేసే గుణం ఉంది. జామ: డయాబెటీస్ ఉన్నవారు జామని కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ,సీలు ఆరోగ్యానికి కావల్సిన పోషకాలను అందిస్తే, పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. ఇక శరీరంలోని కండరాల పనితీరుని మెరుగుపరిచే పొటాషియం కూడా జామకాయలో సమృద్ధిగా దొరుకుతుంది. యాపిల్: రోజుకో యాపిల్తో రోగాలు దూరమన్న విషయం తెలిసిందే! కానీ కాస్త తియ్యగా ఉండే యాపిల్ అంటే డయాబెటీస్ రోగులు భయపడుతూ ఉంటారు. నిజానికి యాపిల్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంటల్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఇవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాదు! కొన్ని పోషకాలను శరీరం మరింత సమర్థంగా జీర్ణం చేసుకునేందుకు కూడా యాపిల్స్ ఉపయోగపడతాయి. అయితే వీటిని తొక్కుతో సహా తిన్నప్పుడే... మరింత ఉపయోగం అని గుర్తుచేస్తున్నారు వైద్యులు. అరటిపండు: అరటిలో ఉన్న సుగుణాలు అన్నీఇన్నీ కావు! అత్యంత చవకగా ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ అరటిపండులో పొటాషియం, మెగ్నీషియంలు ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట. అంతేకాదు శరీరంలోని జీవక్రియకు (మెటాబాలిజం) తోడ్పడే B6 విటమిన్ కూడా అరటిలో కనిపిస్తుంది. ఇక జీర్ణక్రియకు అరటిపండు చేసే సాయం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! పుచ్చకాయ: ఎండాకాలం వస్తూనే ఊరించే ఈ పండుని పూర్తిగా కాకుండా కొన్ని ముక్కలను తీసుకోవడంలో తప్పులేదంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో విటమిన్ సి ఎలాగూ ఉంటుంది. ఇక పళ్లరసాలను దూరంగా ఉండే డయాబెటీస్ రోగులకు... పుచ్చకాయ, జ్యూస్ తాగినంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉండే అధిక నీరు, దాహాన్ని తీర్చి శరీరానికి కావల్సిన తేమని అందిస్తుంది. కేవలం పైన పేర్కొన్న పండ్లే కాకుండా పీచ్, పియర్స్, కివీ, అవకాడో... వంటి విదేశీ పళ్లు కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన పండ్ల జోలికి ఎవరు వెళ్తారులే అనుకుంటే ఉసిరి, దానిమ్మ, పంపరపనస... వంటివి ప్రతి చోటా కాస్త తక్కువ ధరలోనే లభిస్తూ ఉంటాయి. అన్నింటికీ మించి కాస్త కాస్త మోతాదులో తీసుకోవడం, అన్ని పదార్థాలతో కలిపి లాగించేయకుండా విడిగా తినడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం ఉన్నవారు కూడా పళ్ల రుచిని ఆస్వాదించవచ్చునని సూచిస్తున్నారు వైద్యులు. - నిర్జర
read moreమీ కంటి చూపు పెరగాలా..?
పని ఒత్తిడి.. మారుతున్న జీవనశైలి.. కాలుష్యం కారణంగా చాలా చిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తుంది. దీంతో కళ్ల జోళ్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికమవుతోంది. అయితే కంటికి బలాన్నిచ్చే ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.. ఆ ఆహారం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?time_continue=6&v=ypQMGG7G9Yc
read moreసెల్ ఫోన్ వాడటం వల్ల మెదడులో ఇలాంటి భయంకరమైన వ్యాధి వస్తుందా..?
A research says that excess or continuous usage of cell phone can increase the risks of Brain Tumor. Though the exact number cannot be revealed, Dr. Ranganatham too warns the people who use cell phones excessively. To know in detail watch the video. https://www.youtube.com/watch?v=U5Du_HOHgl0
read moreసమ్మర్ లో మామిడితో మజా
మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు... మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి. ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి... ముఖ్య ప్రయోజనాలను చూద్దాం :- వేసవిలో వడదెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడి రసాన్ని మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. నీరసంతో పాటూ, అలసట కూడా తగ్గుతుంది. వడదెబ్బ సమస్య నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. పచ్చిమామిడి కాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.
read moreవేసవిలో ఈ ఆహారంతో జాగ్రత్త
వేసవి భగభగలకి ఒళ్లంతా పొగలు కక్కడం ఖాయం. కానీ ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే... మితంగా ప్రొటీన్లు: ఒంట్లో వేడి చేసిందని చెబితే చాలామంది వైద్యులు ఒప్పుకోరు. కానీ కొన్ని పదార్థాలలో ఉండే అధిక ప్రొటీన్ల వల్ల... ఒంట్లోని జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుతుందనీ, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదంపప్పు, ఓట్స్, మెంతులు, చేపలు వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెంకొంచెంగా తీసుకోమని సూచిస్తున్నారు. నూనెపదార్థాలు: నూనె ఎక్కువగా ఉండే వేపుళ్లు, చిరుతిళ్ల వంటి పదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే మంచిదట. నూనె పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పైగా నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చర్మం కూడా జిడ్డోడుతుందని తేలింది. అలా నూనెపదార్థాలు ఒంటి లోపలా బయటా కూడా చిరాకు కలిగిస్తాయన్నమాట. మద్యపానం: వేసవి వచ్చిందంటే చాలు... ఆ పేరు చెప్పి పీపాలకు పీపాలు బీరు తాగేస్తుంటారు. ఒకవేళ బీరు దొరక్కపోతే ఎలాంటి మద్యానికైనా సిద్ధంగా ఉంటారు. బీరుతో సహా ఎలాంటి మద్యానికైనా dehydration కలిగించే లక్షణం ఉంది. అందుకనే మద్యం సేవించేటప్పుడు ఒళ్లంతా చెమటలు కక్కడం, మాటిమాటికీ మూత్రానికీ వెళ్లాల్సి రావడం జరుగుతుంది. మామిడిపళ్లు: వేసవికాలంలో మామిడిపళ్లే గుర్తుకువస్తాయి. ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి కదా! అని ఆబగా లాగించేస్తుంటాం. కానీ మామిడిపళ్లు మోతాదుని మించితే.... విరేచనాలు తప్పవు. పైగా వీటికి వేడి చేసే గుణం కూడా ఉంది. అందుకనే నిరంతరం మామిడిపళ్లు తింటే పెదాలు పగలడం, సెగ్గడ్డలు రావడం జరుగుతుంది. పాలు: పాల నుంచి వచ్చే పెరుగు, మజ్జిగలు వేసవిలో దాహాన్ని తీరుస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. కానీ నేరుగా చల్లటి పాలు తాగితే మాత్రం చిక్కులు తప్పవు. చాలామందికి పాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండదు. పైగా చల్లటి పాలని తాగడం వల్ల, వాటిని తిరిగి శరీర ఉష్ణోగ్రతకి అనుగుణంగా మార్చేందుకు మరింత వేడిని ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇక టీ, కాఫీలలో ఉండే కెఫిన్కి కూడా డీహైడ్రేషన్ కలిగించే లక్షణం ఉంది. ఇవే కాదు మాంసాహారం, మసాలా పదార్థాలు, చపాతీలు... ఇవన్నీ కూడా వేసవి తాపాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందంటున్నారు. - నిర్జర.
read moreమీ పిల్లలు బాగా ఆడాలంటే ఈ ఫుడ్ పెట్టండి
పిల్లలు ఆరోగ్యంగా ఉండటమంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగా కూడా వాళ్లు ఎదగాలి.. ఇది కావాలంటే వారికి చదువుతో పాటు ఆటలు నేర్పించాలి.. అలా అని ప్రతీ ఒక్కరూ సచిన్, సానియా, సైనా నెహ్వాల్ అవ్వాలని కాదు.. ఎదిగే పిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. వైద్యుల సలహాలో.. లేక మారుతున్న కాలమో కానీ దీని ప్రాధాన్యత గుర్తించిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్పోర్ట్స్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. అయితే వాళ్లు ఆటలు ఆడటానికి తగినంత శక్తి కూడా ఎంతో అవసరం.. లేదంటే పిల్లలు నీరసించిపోతారు.. వారిలో ఎనర్జీ లెవల్స్ బాగా పెరగడానికి కొన్ని రకాల పోషకాహారాలను సూచిస్తున్నారు నిపుణులు.. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=HLTHriVZaTc
read moreకడుపులో బిడ్డని బట్టి తల్లి ఆరోగ్యం
పుట్టబోయే బిడ్డ ఆడపిల్లా, మగపిల్లవాడా అని చెప్పడానికి మన పెద్దలు రకరకాల లక్షణాలు చెబుతూ ఉంటారు. పొట్ట ఎత్తుగా ఉందా, ఆయాసం వస్తోందా, ఒళ్లు చేశారా... ఇలా భిన్నమైన లక్షణాల ఆధారంగా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని అంచనా వేస్తుంటారు. వినడానికి ఇవన్నీ సరదాగానో, కించిత్తు ఛాదస్తంగానో కనిపిస్తాయి. కానీ ఈ మధ్యే జరిగిన ఓ పరిశోధనని కనుక గమనిస్తే... మన పెద్దల మాటలని మరీ అంత కొట్టి పారేయడానికి వీల్లేదని అనిపిస్తుంది. ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు... తల్లి గర్భంలో ఉన్న శిశువు లైంగికతకీ, ఆమె రోగనిరోధక శక్తికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు మన ఒంట్లో రోగనిరోధక శక్తిని ప్రతిబింబించే సైటోకైన్స్ (cytokines) అనే కణాల తీరుని గమనించారు. కడుపులో ఆడపిల్ల ఉన్నా, మగపిల్లవాడు ఉన్నా ఈ సైటోకైన్స్ సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు. కానీ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు ఏర్పడే సైటోకైన్స్ తీరు కాస్త విభిన్నంగా కనిపించింది. గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే కనుక inflammation అనే చర్యకు అనుకూలమైన సైటోకైన్స్ కనిపించాయట. మన శరీరంలోకి హానికారక సూక్ష్మక్రిములు కానీ రోగకారకాలు కానీ ప్రవేశించినప్పుడు... వాటిని ఎదుర్కొనేందుకు జరిగే పోరాటమే inflammation. ఈ సందర్భంగా శరీరాన్ని పోరాటానికి సన్నద్ధంగా ఉంచేందుకు తెల్లరక్తకణాల వంటి కణాల సంఖ్య ఇతోధికంగా పెరిగిపోతుంది. గాయం చుట్టూ మనకి కనిపించే వాపు ఇలా ఏర్పడేదే! అయితే ఈ inflammation ఒకోసారి మన రోగనిరోధక శక్తికి సాయపడితే, మరికొన్ని సందర్భాలలో లేనిపోని ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది. అనవసరంగా శ్వాసనాళాలు వాయడం వల్ల ఆస్తమా, కీళ్ల దగ్గర వాపు ఏర్పడటం వల్ల ఆర్థ్రయిటిస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆడపిల్ల కనుక గర్భంలో ఉంటే ఇలా inflammationకు సంబంధించిన లక్షణాలు అధికంగా కనిపిస్తాయన్నమాట. దీని వలన మేలు, కీడు రెండూ అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భీణీ స్త్రీలకు చికిత్స చేసేటప్పుడు వారి కడుపులో ఉన్న శిశువు ఆడా, మగా అన్న విషయం మీద స్పష్టత ఉంటే... దానికి అనుగుణంగా వారికి చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు. గర్భిణీ స్త్రీలలో ఆస్తమా వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, వారి కడుపులో ఉన్న శిశువు లైంగికతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అన్నింటికీ మించి... తగిన వ్యాయామం, ఆకుకూరల వంటి పోషకాహారం తినడం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి అవాంతారాలూ లేకుండా పండంటి బిడ్డను కనవచ్చని సూచిస్తున్నారు. - నిర్జర.
read moreమీరు ఎన్నిసార్లు తినాలో.. ఏం తినాలో.. తెలుసుకోండి
We often hear people telling that, they do not eat much still put on weight. So where is the problem? What diet should we follow? How to stay healthy & fit? Understand the Veeramachineni Diet, follow it & stay healthy! To know more, watch the video.
read moreటీ తాగే ముందు మంచినీళ్లు తాగాల్సిందే.. ఎందుకంటే...
చాలామందికి టీ, కాఫీలు తాగేముందు మంచినీళ్లు తాగడం అలవాటు. ఒకవేళ ఇంటికి వచ్చినవాళ్లకి టీ, కాఫీలు ఇస్తే, వాళ్లు అడిగి మరీ మంచినీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా తాగడం మంచిది కాదన్నది కొంతమంది నమ్మకం. నీళ్లు తాగిన వెంటనే వేడి వేడి టీ తాగడం వల్ల... నాలుక, పళ్లు పాడైపోతాయని వాదన. ఈ మాటలో నిజం ఎంత! - టీ, కాఫీలలో ఎసిడిటీ ఎక్కువగానే ఉంటుంది. ఎసిడిటీని pH valueతో కొలుస్తారు. అందులో టీ, కాఫీ, పాలు అన్నీ pH 5 నుంచి 7 పాయింట్ల మధ్య స్కోర్ చేస్తాయి. ఇంత ఎసిడిసీ ఉన్న టీ, కాఫీలను తాగడం వల్ల పళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు! ఈ ఎసిడిటీ గొంతు, కడుపులో కూడా లేనిపోని సమస్యలని సృష్టిస్తుంది. అది గ్యాస్, అల్సర్స్లాంటి సమస్యలకి దారి తీయవచ్చు. నీళ్లు తాగాక టీ తాగడం వల్ల ఈ ఎసిడిటీ dilute అయిపోయి ఎలాంటి side effects ఉండవు. - మన నోటి దగ్గర నుంచి కడుపు దాకా ఉన్న భాగాలని Aero Digestive System అని పిలుస్తారు. వేడి వేడి టీ ఈ Aero Digestive System లోంచి వెళ్లేటప్పుడు, వీటి మీద ఉన్న సున్నితమైన పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. టీకి ముందు మంచినీరు తాగితే ఈ ప్రమాదం ఉండదట. కేవలం టీ అనే కాదు ఏ పదార్థం తీసుకునే ముందైనా గొంతు కాస్త తడుపుకుంటే అది Aero Digestive Systemకి lubrication లాగా పనిచేస్తుంది. - వేడి వేడి టీ ఒకేసారి నాలుక మీద పడటం వల్ల, నాలుక మీద ఉండే సున్నితమైన taste buds దెబ్బతింటాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల, నాలుకకి అంత వేడి అనిపించదు. - టీ డికాషన్ ఒక natural colour లాగా పనిచేస్తుంది. అందుకే కొన్ని hair dyes లో టీ పొడిని కూడా ఉపయోగిస్తారు. అలాంటి టీ నేరుగా పళ్లకి తగలడం వల్ల, క్రమంగా పళ్లు పసుపురంగులోకి మారిపోతాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల పళ్ల మీద ఒక protective layer ఏర్పడి, అవి రంగు మారకుండా చేస్తాయి. - టీలో కెఫిన్, ధియామిన్ లాంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి లిమిట్ దాటితే శరీరానికి నష్టం తప్పదు. టీ తాగేముందు ప్రతిసారీ మంచినీళ్లు తాగడం వల్ల... ఒంట్లోకి చేరిన కెమికల్స్ని ఎప్పటికప్పుడు బయటకి పంపే అవకాశం ఉంటుంది. ఇక నోరు dryగా ఉన్నప్పుడు టీ తాగేకంటే, ఓ గుక్కుడు మంచినీళ్లు తాగిన తర్వాత టీ తాగితే... దాని రుచిని పూర్తిగా ఆస్వాదించవచ్చని అంటారు. మనలో చాలామంది టీ అలవాటుని మార్చుకోలేం. కానీ దానికి మరో చిన్న అలవాటుని జోడించడం వల్ల ఎంత ఉపయోగమో చూశారు కదా! - Nirjara
read moreఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుందా!
ఇప్పటి తరానికి ఆయిల్ పుల్లింగ్ అంటే తెలుసో లేదో కానీ, ఓ ఇరవైఏళ్ల క్రితం ఇది ఇంటింటిమాటగా ఉండేది. అప్పట్లో ఆయిల్ పుల్లింగ్ ప్రయత్నించని వారు అరుదుగా కనిపించేవారు. ప్రతి ఇంట్లోనూ ఆయిల్ పుల్లింగ్కి సంబంధించిన చిన్నా చితకా పుస్తకాలు కనిపించేవి. ఇంతకీ ఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుందా? మనదే! మనదే! అయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ మూలాలు ఆయుర్వేదంలో కనిపిస్తాయి. నోటిపూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలకు నువ్వులనూనెను కొద్ది నిమిషాల పాటు పట్టి ఉంచడమో, పుక్కిలించడమో చేయమని సూచించేవారు. ఆయుర్వేదంలో ఒక తరహా చికిత్సకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను పూర్తిస్థాయి వైద్యంగా తిరిగి 1990వ దశకంలో వెలికితెచ్చారు కొందరు ఔత్సాహికులు. సర్వరోగనివారిణి? ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియను నువ్వులనూనెతో, అది కూడా కొన్ని సందర్భాలలో మాత్రమే ఉట్టంకించారు. కానీ రక్తపోటు మొదలుకొని కేన్సర్ వరకూ ఎలాంటి రోగమైనా ఆయిల్ పుల్లింగ్తో నయం అయిపోతుందన్న ప్రచారం మొదలైంది. రోజూ ఓ ఇరవైనిమిషాలసేపు ఆయిల్ పుల్లింగ్ చేస్తే మొదటి రోజు ఈ ఫలితం వస్తుంది, రెండో రోజు ఆ ఫలితం వస్తుంది అంటూ గణాంకాలు చెలరేగిపోయాయి. దాదాపు 30 రకాల రోగాలను ఆయిల్ పుల్లింగ్తో చటుక్కున నయం చేయవచ్చన్న మాటలు వినిపించసాగాయి. ఇదే సమయంలో ఇళ్లలో రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం ఎక్కువ కావడంతో ఇంటింటా ఆయిల్ పుల్లింగ్ కనిపించేది. పనిచేస్తుందా! ఆయిల్ పుల్లింగ్ ప్రచారకుల వాదన ప్రకారం మన నోట్లో నానారకాల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్తో ఈ హానికారక క్రిములు నశించిపోతాయి. అంతేకాదు, కాసేపు అలా పుక్కిలిస్తూ ఉండటంవల్ల శరీరంలోని విషరసాయనాలన్నీ (టాక్సిన్స్) నూనెలోకి వచ్చి చేరతాయి. తద్వారా శరీరంలోని రోగాలన్నీ నిదానంగా తగ్గిపోతాయి. వాస్తవం ఏమిటి! మిగతా వైద్య విధానాలతో పోల్చుకుంటే ఆయిల్ పుల్లింగ్ మీద జరిగిన పరిశోధనలు తక్కువ. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం (ఓరల్ హైజీన్) కాస్తో కూస్తో మెరుగుపడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది. కొబ్బరినూనె, నువ్వులనూనెలతో పుల్లింగ్ చేసినప్పుడు నోటి దుర్వాసన, పంటి గార, చిగుళ్ల నుంచి రక్తం వంటి సమస్యలు తగ్గినట్లు వెల్లడైంది. అంతేకానీ శరీరంలోని ఇతరత్రా సమస్యల మీద ఇది పెద్దగా ప్రభావం చూపలేదని పరిశోధకులు పెదవి విరిచారు. పైగా ఆయిల్ పుల్లింగ్తో పోలిస్తే మౌత్వాష్తో పుక్కిలించడం, రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వంటి చర్యలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని తేల్చారు. మరేం చేయడం! శాస్త్రీయంగా ఆయిల్ పుల్లింగ్ ప్రభావానికి సంబంధించి అంతగా ఫలితాలు వెల్లడవనప్పటికీ, ఈ ప్రక్రియ పనిచేస్తుందని నమ్మేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయిల్ పుల్లింగ్తో కనీసం నోరన్నా శుభ్రపడుతుంది కాబట్టి ఇది హానికరం అని చెప్పలేం. అలాగని అద్భుతాలు సాధిస్తుందని గుడ్డిగా నమ్మడానికీ లేదు. తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు తమ సమస్యలు ఆయిల్ పుల్లింగ్తో తీరిపోతాయనుకుంటే కష్టమే! పైగా ఆయిల్పుల్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ దానిని మింగేస్తే వాంతులు, విరేచనాలతో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. - నిర్జర.
read moreతేనె తింటే ఈ జబ్బులేవి మీ దగ్గరికి రావు!
తేనంత తీయనిది అని మనం తీయదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన వాటిలో ప్రధానమయిన వాటిలో తేనె ఒకటి గా చెప్పుకుంటాం. ప్రాచీన కాలం నుండి ఆహారంగాను, ఔషధాల్లోనూ కూడా దీనిని వాడుతూ వస్తున్నారు. అద్భుతమయిన తీయదనం, అరుదయిన లక్షణాలు సొంతం చేసుకున్న తేనె యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=sMINAsZuqGM
read moreసిట్రస్ పండ్లతో గుండె జబ్బులకు చెక్
సిట్రస్ పండ్లను మహిళలు తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. మహిళలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లను జ్యూస్ రూపంలోనూ లేదా అలాగే తీసుకోవడం ద్వారా గుండెపోటును నివారించవచ్చును. నిమ్మ, ఆరెంజ్, ఉసిరి లాంటి సిట్రస్ పండ్లతో పాటు ఆపిల్, దాక్ష, దానిమ్మ వంటి వాటిని తీసుకోవడం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. తాజా కూరగాయలు, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్లలో ఫ్లావోనోయిడ్స్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. మహిళలు ముఖ్యంగా విటమిన్ "సి"గల పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలని, దీనివలన సిట్రస్ పండ్లలోని ఫ్లావోనోయిడ్స్ గుండెకు సంబంధించిన రక్తపు నాళాల పనితీరును మెరుగుపరుస్తాయని, తద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనం ద్వారా వెల్లడైంది.
read more

















.jpg)




