వరల్డ్ మలేరియా డే 2022 ...

  ప్రపంచ మలేరియా దినోత్సవం.మలేరియా ఒక్కటే కాదు 5 రకాల మలేరియా వస్తుందన్న విషయం మీకు తెలుసా.మలేరియా జ్వరం వచ్చిన వెంటనే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి?మలేరియా జ్వరాన్ని సత్వరం గుర్తించక పోతే ఇది సాధారణ జ్వరమే అని భావించి తప్పు చేయకండి.అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న మలేరియా డే గా ప్రకటించింది.ప్రాణాంతక మైన మలేరియా పై ప్రజలకు అవగాహన కల్పించడం మే కీలకం.ప్రపంచ ఆరోగ్య సంస్థ 2౦21 నాటి రిపోర్ట్ వివరాల ప్రకారం నేటికీ భారత్ లాంటి దేశాలలో ప్రపంచం లోని ఇతర దేశాలలో చాలా ఎక్కువ సంఖ్యలో మలేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే గతం తో పోలిస్తే కొన్ని సంవత్సరాలుగా దేశం లో మలేరియా కేసులు తగ్గుముఖం కావడం గమనించవచ్చు.అయితే మలేరియా  ముప్పు పూర్తిగా తొలగి  పోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.కాగా కోవిడ్ తరువాత మలేరియా పై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.మలేరియా కొన్ని రకాల దోమల వల్ల వ్యాపిస్తున్నవిషయం అందరికీ తెలుసు. అయితే మలేరియా ఒకటి కాదు 5 రకాలు ఉన్నాయన్న విషయం తెలుసా.అసలు మనకు తెలియని ఆరు రకాల మలేరియా ఏమిటో చూద్దాం.  మలేరియా అంటే ఏమిటి ?... మలేరియా జ్వరం ఒకరకమైన తీవ్ర సమస్య ఎనాఫిలిస్ అనే దోమ కాటు వేయడం వల్ల వ్యాపిస్తుంది.ప్లాస్మా డియం వాడవేక్స్ పేరుతో పిలిచేది ప్రోటో జోవా ఉంటుంది. మలేరియా ఎప్పుడు వస్తుంది... మలేరియా జ్వరం వేసవి కాలం లో లేదా వర్షా కాలం లో రావడం సహజం.మలేరియా దోమలు ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతం లో లేదా మురికి నీరు నిల్వ ఉన్న  ప్రాంతాల లో దోమలు తమ గుడ్లను పెంచుతాయి.డెంగు వ్యాధి సంబంధిత దోమలు తాజా నీటిలో పుట్టుకు వస్తాయి.మలేరియా ఎవరికైనా రావచ్చు.నీటి నిల్వ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మలేరియా ఒకటి కంటే ఎక్కువసార్లు మలేరియా రావచ్చు. అక్కడే మలేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలేరియా ఎలా వ్యాపిస్తుంది?... ఎనాఫిలిస్ దోమ ఎప్పుడైతే కాటు వేస్తుందో ఆవ్యక్తి ప్లాస్మోడియం లోకి వ్యాపిస్తుంది.ఈ పరాన్న జీవి లివర్ రక్తనాళాలలో వచ్చి చేరడం తో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురిఅవుతారు.సరైన సమయం లో సరైన చికిత్స అందక పోవడం వల్ల అది ప్రాణాంతకం గా మారవచ్చు. మలేరియాను సాధారణ జ్వరంగా భావించి తప్పు చేయకండి. అదే సమయం లో చికిత్స చేయకుంటే ప్రాణం పోయే ప్రమాదం  ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలేరియా లక్షణాలు... మలేరియా వచ్చిన రోగులు తీవ్రమైన జ్వరం తో పాటు వణికి చలితో తీవ్రంగా వణికి పోతారు.జ్వరం సహజంగా 24 గంటల నుంచి 48గంటలు లోపు చూపిస్తుంది.దీనికికారణం మలేరియాను వృ ద్ది చేసే పరాన్న జీవి సమయ సమయానికి రక్తంలో కలిసి ఉంటుంది.రక్తనాళాలలో విస్తరిస్తుంది.అక్కడ ఒకరకమైన విషాన్ని తయారు చేస్తుంది.ఈ కారణంగా వణుకు తో కూడిన జ్వరం వస్తుంది. దీని లక్షనాలు... తీవ్రమైన జ్వరం,చలివేయడం,తలనొప్పి,ఒళ్ళు నొప్పులు,కండరాల నొప్పులు,వాంతులు,అసహనం బలహీన పడడం వంటి లక్షణాలు ఉంటాయి. మలేరియా రకాలు... మలేరియా సహజంగా 5 రకాలు ఉంటాయి. దీనికి రకరకాల పరాన్న జీవులే కారణం కావచ్చు. 1) ప్లస్మోడియా మలేరియా ... ప్లస్మోడియా మలేరియా ఒకరకమైన ప్రోటోజోవా ఒకరకంగా చెప్పాలంటే బినాయిన్ మలేరియా కారణమౌతోంది.ఈ రకమైన ప్లస్మోడియా ఫాల్సిపెరం లేదా ప్లస్మోడియా ఫాల్సిపెరం లేదా ప్లాస్మాడియా వాడా వైక్స్ అంత ప్రమాద కరమైనది కాదు. 2)క్వార్టాన్ మలేరియా దీనిబారిన పడిన రోగికి ప్రతినాలుగు రోజులకు జ్వరం వస్తుంది. దీనితో పాటు రోగి మూత్రం నుంచి ప్రోటీన్ కోల్పోతారు.ఈ కారణంగా రోగి శరీరంలో ప్రోటీన్ తగ్గిపోతుంది.దీనివల్ల రోగిలో ఇంఫ్లామేషణ్ వాపులు వస్తాయి. ౩)ప్లాస్మా డియో నోలెస్... ఈ రకమైన మలేరియా దేశంలో ఆశియాలో కనుగోన్నారు. ఫ్రైమేట్ మలేరియా ఒక పరాన్న జీవి ఈ మలేరియా సోకిన వారిలో చలివేయడం వణుకు తో పాటు జ్వరంవస్తుంది. లక్షణాలలో జ్వరం,తలనొప్పి ఆకలి వేయక పోవడం,చలితో పాటు తీవ్రమైన వణుకు వంటివి కీలక లక్షణాలుగా వైద్యులు పేర్కొన్నారు. మలేరియా నుండి ఎలా రక్షించు కోవాలి... మలేరియా నుండి రక్షించుకోవాలంటే దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి.మనకుటుంబం దోమల బారిన పడకుండా రక్షించుకోవాలి.ఎవరైనా మలేరియా వచ్చిన రోగిని కాతువేసిన అదే దోమ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కాటు వేస్తే మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దోమకాటు నుండి రక్షింప బడాలంటే మస్కిటో రిపలేన్ట్స్  వాడవచ్చు.లేదా శాస్త్రీయ పద్దతిలో దోమలు లోపలి చొరబడకుండా ఇత్రమార్గాలు పద్దతులు అమలు చేయాలి.                                                                           

read more
మట్టి పాత్ర లో వండితే ఆరోగ్యమా??

  మనం ఆధునిక ప్రపంచం లో ఉన్నాం.అంటే 2౦ వ శతాబ్దం లో అన్న మాటకాదు కాదు ఉన్నమాటే. అంటే మన వంటని కూక్కర్లలో అంటే అల్యూమినియం పాత్రలో వండడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారని అంటున్నారు నిపుణులు.పూర్వీకులు గతంలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆహారాన్ని మట్టికుండలు లేదా తగరపు గిన్నెల్లో వండుకునే వారని పేర్కొన్నారు.కొందరు ఇత్తడి గిన్నెల్లో కూడా వంట చేసేవారని పేర్కొన్నారు.ఇక పూర్వీకులు అయితే రాగి పాత్రలో నీరు తాగేవారని చరిత్రకారులు పేర్కొన్నారు.ఇది మన పూర్వీకుల చరిత్ర. ఇక మట్టికుండలో వండిన వంటసర్వదా ఆరోగ్యం...       మట్టి పరమ పవిత్రమైనది దృష్టిలో పుట్టిన ప్రతిజీవి మట్టిలో పుట్టి మట్టిలో కలవాల్సిందే.మనం మనశరీరం అంతటా ఉండేది మట్టే మాత్రమే మట్టిలో 18 రకాల మైక్రో న్యుట్రీ యన్స్ ఉంటాయి. దీనినే మనం బూడిద అంటాము. మట్టిలో కలిసాక మనం అయ్యేది బూడిదే.  మట్టికుండలో 1౦౦ రకాల పోషక విలువలు ఉంటాయి.ఇక మన పూర్వీకులు మట్టికుండలో నే అన్ని వంటకాలు చేసేవారు. మట్టి కుండలో నీరు తాగేవారని మన పూర్వీకులు తెలిపారు.ఇటీవలి తవ్వకాలలో బయట పడిన విషయాలు మనం చదివాము.అయితే శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో మట్టి పాత్రలో వండే ఆహారం ఎంతో విలువైనది రుచి కూడా అద్భుతంగా ఉంటుందని నిపుణులు విస్లేషిస్తునారు. అంతే కాక ఆహారం పాడు కాకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటుందని ఈ కారణంగా మన శరీరానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యుట్రీఎంట్స్ మట్టి పాత్రలో వండిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి మైక్రో న్యుట్రియాంట్స్ లభిస్తాయని పేర్కొన్నారు.ఈ అంశాన్ని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు పేర్కొన్నారు.  మట్టి పాత్రలో వండితే ఆరోగ్యానికి కలిగే లాభం... 1)ఆహారం వల్ల వచ్చే పోషకాలను 1౦౦% కాపాడుతుంది.ఇంకా అదనపు పోషకాలు ఐన కాల్షియం మేగ్నీషియం,పోస్పరస్,ఐరన్, వంటి మైక్రో న్యూట్రిఎంట్స్, మట్టి పాత్ర ద్వారా శరీరానికి  లభిస్తాయి 2) మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ౩ ) మట్టి పాత్రలో వండే కూరగాయాలు ఇతర వంటకాలలో తక్కువ నూనె ఉపయోగిస్తారు. 4)గ్యాస్ అసిడి టి సమస్యలు ఉండవు. 5) ఆహారం రుచికి రుచి సుచికి సుచి లభిస్తుంది. మట్టి కుండలో వండుకుని తినే సంస్కృతి సాంప్రదాయం మన భారతీయులది.మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని అనుసరించి జీవించినంత కాలం వారికి కంటి చూపు మండగించాలేదని,పళ్ళు ఊడి పోలేదని,చక్కెర వ్యాధి,లేదా మోకాళ్ళ నొప్పులు పెద్దగా రాలేదని వారి శరీరానికి కావాల్సిన న్యుట్రీ యంట్స్ , సక్రమంగా అందినంతకాలం జీవితాంతం వారు ఇతరులపై ఆధారపడకుండా జీవించారని ఆ విషయాన్ని మనం గ్రహించాలని నిపుణులు అంటున్నారు.మనమూ అలా ఉండాలంటే కాలం ఎక్కడ ప్రారంభ మయ్యిందో అక్కడికే మనం వెళ్ళాల్సిందే. అంటే ఆమట్టి కుండలో ఆహారం వంటి పద్ధతిని అనుసరిస్తే మన ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోగలమని నిపుణులు అంటున్నారు.మట్టి పాత్రలే కాదు,మట్టితో చేసిన కుండల నీరు ఎంత చలవోమట్టికుండలో నీరు కింద ఇసక పోసి మట్టి కుండల్లో నీరు పోసి చలివెంద్రాలలో మంచినీరు ఫ్రిడ్జ్ లో ఉండే చల్లటి నీరు కూడా పనికిరాదని అంటున్నారు.సాంప్రదాయ వాదులు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో అన్నం వండడం మట్టి తో చేసిన డీప్ ఫ్రిడ్జ్ లు వాడడం గమనిం చావచ్చు.తెలంగాణా జిల్లాలోని కోదాడ పట్టణం లో మట్టికుండలను వదలంటూ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ జకోటి యా విస్తృత ప్రచారం చేస్తున్నఇలాంటి ప్రయత్నాన్ని మనము అభినందిద్దాం.ప్రోచహిద్దాం.                

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
మీ ఆహారమే మీ ఔషదం ...

మీ ఆహారమే మీకు మందు అన్న ఆలోచన ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం లో వస్తున్న నూతన పోకడగా చెప్పవచ్చు.ఈ విధానం వందల సంవత్సరాలుగా సాంస్కృతిక వారసత్వం గా కొనసాగుతోంది.అదిసంస్కృతి సంప్రదాయం లో ఇమిడిపోయింది.ఏది ఏమైనప్పటికీ వ్యాధి నియంత్రణ కు నివారణకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంద? అన్నది నేటికి ప్రస్నార్ధకంగా మిగిలిపోయింది. ఆహారంలో సమతుల పోషక ఆహారం... ఆహార నియమ నిబందనలు పాటిస్తేనే ఆహారం మనకు ఔషదంగా పనిచేస్తుందని ప్రముఖ యునాని వైద్యనిపుణులు డాక్టర్ సత్య స్పష్టం చేసారు. ఈమేరకు యునానిలో మేము ఇచ్చే డైటో తెరఫీ తో చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు చేసి విజయం సాధించినట్లు తెలిపారు.మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యం  సంరక్షిస్తుందని దేశంలోని ప్రముఖ ఆస్త్రేలియన్  హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ గుత్త  లక్ష్మణ్  రావు స్పష్టం చేసారు. మేము చేసే ఆహార వైద్యం లో మేము ఇచ్చే డైట్ షీట్ తప్పనిసరిగా పాటిస్తే దీర్ఘకాలిక వ్యాధులు. ముఖ్యంగా శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆహారం ద్వారా వ్యాధిని నయం చేస్తామని అభయం ఇచ్చారు.ఈ అంశం పై లోతైన పరిశోదన చేసిన డాక్టర్ లక్ష్మణ్ రావు తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ సమీకృత ఆహారం తీసుకుంటే ప్రతి యొక్క వ్యక్తి యొక్క ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని దీనిని మేము పూర్తిగా అధ్యయనం చేసామని ఇందుకోసం రోగి పూర్తి చరిత్ర అలవాట్లు సమగ్రంగా తెలుసుకున్నాకే ఆహార నియమాలు అమలు చేస్తామని అన్నారు .మేముసూచించే సమగ్ర ఆహార నియమ నిబందనలు అమలు కు కేవలం రోగులే కాదని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామని క్రమపద్దతిలో ఆహార నియమాలు పాటిస్తే ఎటువంటి మొండి దీర్ఘకాలిక రోగానికి వైద్యం చేయవచ్చని అంటారు మేము చేసిన ప్రయోగాలు మంచిఫలి తాలు ఇచ్చాయని అంటారు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు.ముఖ్యంగా ఆరోగ్య రంగం పై అవగాహన అంగీకరించక తప్పదని ఎవరైతే వ్యక్తులు సమగ్ర పోషక ఆహారం పై అవగాహన ఉన్నవారిలో చాలా బలమైన రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారనేది వాస్తవం.ఇది నిరూపిత మైంది కూడా గర్భదారణ,పిల్లల పుట్టుక,డయాబెటిస్ వల్ల ప్రమాదం తక్కువే కార్డియో వాస్క్యులార్ వ్యాధులు లేకుండా దీర్ఘకాలం పాటు జీవిస్తారని అంటున్నారు ఆస్త్రేలియన్ హెర్బల్ మెడిసిన్ కు చెందిన వైద్యులు డాక్టర్ లక్ష్మణ్ రావు.కొన్ని కారణాల రీత్యా దీనిపై మరింత అవగాహన అవసరమని అంటున్నారు. కొన్ని పరిశోధనలలో మనం తీసుకునే ఆహారం లో ఎక్కువ శాతం కర్బోహైడ్రేడ్స్,చక్కర శాతం,సాచు రేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్,అధిక సోడియం శాతం ఉంటె దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ ఉంటె లోలోపల మనకు తెలియకుండా గుండె సంబంధిత సమస్యలు టైప్ 2 డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు చిన్నపేగులు,పెద్ద పేగులసమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమం లో భాగంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రథిఒక్కరి జీవితం లో సమగ్ర ఆహారం అవసరమని,జీవన శైలిలో మార్పులు అవసరమని ఆహారం లో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు,  ధాన్యాలు,ఆకుకూరలు,తక్కువ కొవ్వు ఉండే పదార్ధాలు,పాలఉత్పత్తులు,హెర్బల్ మెడిసిన్ అందించే జంతువుల ద్వారా ప్రోటీన్ కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలకు సహకరిస్తుంది.నిపుణుల ఆలోచన ప్రకారం ఆహారం తోనే సమగ్ర ఆరోగ్యంఅని నిపుణులు సూచిస్తున్నారు.సమగ్ర ఆహారంతో కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను నిలువరించవచ్చనికొలస్ట్రాల్,ఇంఫ్లామేషన్, బి పి ని పెంచే ఆహారం లేదా నిద్రలేమి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.డబ్ల్యు హెచ్ ఓ ఒకప్రకటన లో సమతుల పోషక ఆహారం తోనే సమగ్ర ఆరోగ్యం,ఇమ్యునిటీ రోగనిరోదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.మరిన్ని పరిశోదన లలో యాంటి ఆక్సిడెంట్ వంటివి అంటే కూరగాయలు,పండ్లద్వారా లభిస్తాయని దీనివల్ల రక్తంలో మెటబాలిజం లేకుండా ఉండడం వల్ల లివర్ సమస్యల తో బాధ పడేవారు కొన్ని వందల సంవత్సరాలుగా సమగ్ర ఆరోగ్య విధానాన్ని కి ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యం  సజావుగా సాగే విధంగా నిర్వహించడం మరింత సులభం.2౦2౦ -2౦25 ఆహార నిబంధనల ప్రకారం సమగ్ర సమతుల ఆహారం తోనే ఆరోగ్యం సాధ్యం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆహారంలో పోషక ఆహారం,పళ్ళ రసాలు ఇందులో పళ్ళు,కూరగాయలు ధాన్యాలు,పప్పుదిన్సులు కొవ్వు లేని పాల ఉత్పత్తులు తక్కువ ప్రోటీన్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఫ్యాట్స్,నూనెలు ఇందులో ఉన్నయని తేల్చారు.ఇందులో చక్కర,ఉప్పు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి,మద్యం  సేవించడం తగ్గించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. కొన్ని ఆహారాలు... కొన్ని ఆహారాలు కొన్ని ఆరోగ్య లాభాలు తీసుకువస్తాయి.మెడిటేరియన్ డైట్, ఆహారం బిపి ని తగ్గిస్తుంది. అమెరిక వ్యవసాయ శాఖ హేల్తీ ఈటింగ్ మై ప్లేట్ అన్నవిధనాన్ని అనుసరిస్తోంది. ఆహారమే ఔషదం... ఆహారమే మందు ఔషదం గా మారడం వెనుక ఒకసాధన అనుభవం,జ్ఞానం,ద్వారా తెలుసుకున్న విషయం ఆహారం లో కీలక పాత్ర పోషిస్తుందని నివారణ నిర్వహణ అంశాలే కీలక మని డాక్టర్ మురళి ఆచార్య అభిప్రాయ పడ్డారు.ఆహారమే ఔషదం అన్న విషయం లో ఒక నిర్వచనం అంటూ లేదు. అయితే సహజంగా ఆహారానికి సమతుల ఆహారానికి ప్రాధాన్యత కల్పించడమే వ్యక్తుల ఆరోగ్యం లో భాగామే నివారణ,లక్షణాలను తగ్గించడమే లేదా వ్యాధిని రివర్స్ చేయడమే అని అంటారు డాక్టర్ మురళీ ఆచార్య.పెద్దమొత్తం లో ఆకుకూరలు, రకరకాల కూరగాయాలు,పళ్ళు ,రోగ నిరోధక శక్తి నిచ్చే డ్రై ఫ్రూట్స్ తదితరాలు ఆహారంలో వినియోగిమ్చడం లక్ష్యం గా పేర్కొన్నారు.తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ప్రాసెస్ చేసినప్పుడు కాకుండా చక్కర,ఇతర నూనెల వాడకం తగ్గించడం ముఖ్యమని అంటున్నారుపరిశోదకులు.ప్రత్యేకంగా మైక్రో న్యుట్రీయంట్ బ్లో మలిక్యుల్ ఎక్కువశాతం ప్రజలు ఆహారాన్ని వైద్యంగా అంగీకరించాలి.ఇందులో అధిక మొత్తంలో కొన్ని రకాల మూలికలు ఇతర మసాలా దినుసులు డ్రై ఫ్రూట్స్ ధాన్యాలు,పప్పు దినుసులు పండ్లు,కూర గాయలు,విరివిగా వాడడం అంటే క్రమపద్దతిలో అంటే డాక్టర్ ఇచ్చే డైట్ షీట్ ఆధారంగా క్రమం తప్పకుండా వాడితే అనారోగ్యం రమ్మన్నా రాదు అంటారు నిపుణులు.ఆహారామే ఔషదం లేదా ఆరోగ్య నిర్వహణ వైద్యంగా అంగీకరించడం సాధ్యమా కాదా ?కొన్ని ఏళ్లుగా ప్రాధమిక స్థాయినుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లో వృద్దిచెందిన వాటితోనే ఆరోగ్యాన్ని నిర్వహించడం వ్యాధికి సరిపడా మందుల పైనే ఆధారపడి ఉన్న మనం దీనిని అంగీకరించగాలమా?ఆహారం ఔషదం విషయం లో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు.పాశ్చాత్య దేశాలలో ఆహారం జీవన శైలి లో మార్పులకు మొదటి ప్రాధాన్యత చికిత్స చేస్తే తప్ప దీర్ఘకాలిక వ్యాధులను నివారించాలేము. ఆహారంలో మైక్రో న్యుట్రీ యంట్ల దృష్టి పెట్టడం వల్ల లాభాలు... వ్యాధిని సమగ్రంగా గుర్తించాక అంటే నిర్ధారణ చేసిన తరువాత న్యుట్రీ షియన్ తెరఫీ లేదా డైటో తెరఫీ అని కూడా అంటారు. యునాని వైద్యులు దీనిని చాలా మంది వైద్యులు తమ వైద్య ప్రక్రియలో వినియోగించడం గమనార్హం వ్యాధిని నియంత్రించడానికి ఆహారం సహకరిస్తుంది. ఇందులో ఆహారం భోజనం దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దోహదం చేస్తుంది. వ్యాదిలక్షణా లను తగ్గించి నాణ్యత తో కూడిన జీవితాన్ని జీవించగలరు అని బల్ల గుద్ది మరీ చెపుతున్నారు వైద్యులు.ఒక పరిశోదనలో శరీరంలో అలసట నొప్పులను నివారించేందుకు ఆధునీక రించిన మేరి టెర్రీనియన్ వల్ల సాధ్యమని నిరూపించారు.లింఫో ఎదిమా కింది భాగం లో వాపులు వంటి వాటికి డైటో తెరఫీ పూర్తిగా పనిచేస్తుందని యునాని వైద్యులు అంటునారు. చవకైన చికిత్స విధానం... ప్రస్తుతం వైద్య చికిత్స సామాన్యుడికి అందు బాటులో లేవు.చికిత్స,రోగులకు చికిత్స దీర్ఘకాలిక చికిత్సలు ప్రజలు ప్రభుత్వ భాగ స్వామ్యం అవసరమని అప్పుడే ప్రజా ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుదని.నిపుణులు అంటున్నారు.ఆధునిక వైద్యం స్థానం లో ప్రత్యామ్నాయ వైద్యం గా మనగాలదా లేదా అన్న అంశం పై శాస్త్రజ్ఞులు పూర్తిగా పరిశోదనలు చేస్తున్నారని అన్నారు.ఆహారం ఔషదం కొంత మేర వైద్య ఖర్చుని తగ్గిస్తుందని వ్యాధి తీవ్రతను సరైన నిర్ధారణ పరీక్షలు చేసి  ఆహారాన్ని వైద్యంగా  అందిస్తేఆసుపత్రులలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ప్రముఖ హెర్బల్ వైద్యులు డాక్టర్ గుత్త లక్ష్మణ్ రావు గారి నమ్మకం విశ్వాసం.వైద్యఖర్చులు తగ్గాలంటే ఆహారం లో నాణ్యత పెంచాల్సిందే.  

read more
పచ్చి మామిడి తింటే లాభమా?

వేసవి వచ్చిందంటే పచ్చిమామిడి కాయాలు తెచ్చింది. పచ్చి మామిడి కాయ తింటే ఆరోగ్యలాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? పచ్చిమామిడి కాయ వల్ల పొట్టలో వచ్చే సమస్యలకు ఉపసమనం లభిస్తుందని నిపుణులు అంటునారు.వేసవి కాలం ఆపైన పచ్చిమామిడి కాయ తింటూ ఉంటె ఉంటుంది దీనికి మించిన బెస్ట్ కామినేషన్  లేదనే చెప్పాలి.పచ్చి మామిడి కాయ ఒక్కోముక్క తింటూ ఉంటె పుల్లగా కాస్త ఉప్పు కారం అడ్డుకుని తిన్న ఆటేస్ట్ వేరనే చెప్పాలి.సహజంగా వేసవికాలం లో పచ్చిమామిడి తో చేసిన ఏ వంటకమైన టేస్టీ గానేఉంటాయి.అసలు ఇంట్లో ఉండే పిల్ల పెద్ద అందరూ పచ్చిమామిడిని తినడానికి ఇష్టపడతారు.వేసవికాలంలో పిల్లలు సైతం మామిడి కాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక లాభాలు ఉన్నాయి. లు నుంచి రక్షణ... వేడిమి నుంచి ఉపసమనం తో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కొంత మేలుచేస్తుంది. మామిడిలో మంచి ఇంఫ్లామేటరీ యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసే లక్షణం మామిడి కాయకు ఉంది. అది మీ శరీర తత్వాన్ని చల్ల బరిచేందుకు దోహదం  చేస్తుంది. పచ్చి మామిడి కాయ వేసవి వేడిమి వల్ల వచ్చే లూ ప్రభావాన్ని తగ్గిస్తుంది.శరీరంలో నీటి శాతం పెంచేందుకు పచ్చి మామిడి తింటారు. వర్క్ అవుట్ తరువాత మంచి వేసవి రిఫ్రెష్మెంట్ డ్రింక్ గా చెప్పవచ్చు. ఇమ్యునిటీ ని పెంచే మామిడి కాయ... ఇటీవలి కాలంలో సుదీర్ఘంగా మనం ఎదుర్కుంటున్న దీర్ఘకాలిక సమస్యలలో కోరోనా వల్ల ఇమ్యునిటీ కోల్పోయారు.ఇమ్యునిటీ ని తిరిగి పొందాలంటే పచ్చి మామిడి దోహదం చేస్తుంది. పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇమ్యునిటీ ని పెంచేందుకు సహకరిస్తుంది. పచ్చి మామిడి కాయ ను తినడం ద్వారా వేసవిలో వచ్చే సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. ఆరోగ్యమైన గుండెకు మామిడి... మామిడిలో మేగాఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. మేగిఫెరిన్ కొలస్ట్రాల్,ట్రై గ్లిజరాయిడ్స్,ఫేటి యాసిడ్ స్థాయిని నియంత్రించడం లో దోహదం చేస్తుంది. ఎవరికైతే గుండె సమస్యలు వస్తాయో,తీవ్రత నుండి తట్టుకునే పచ్చిమామిడిలో మెగ్నీషియం, పొటాషియం,సంపూర్ణం గా లభిస్తాయి.గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది పచ్చిమామిడి. క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది... పచ్చి మామిడి కాయ నుండి లభించే ఫెనోల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. అది క్యాన్సర్ వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.మామిడి కాయ శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం కాంతి వంతం... పచ్చి మామిడి కాయ తినడం వల్ల చర్మం సంరక్షిస్తుంది. పచ్చిమామిడి తినడం వల్ల పిం పుల్స్,మచ్చలు,కంటికింద చారలు,కళ్ళుగుంటలు పడడం,రకరకాల సమస్యలకు తగ్గిస్తుంది. శరీరంలో నీరు... వేసవిలో ఎండవేడిమికి శరీరంలో నీటి శాతం తగ్గడం సహజం.పిల్లలు పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం లో నీరు తగ్గుతుంది.దీనివల్ల మనశరీరం హైద్రేడ్ అవుతుంది.                                          

read more
వరల్డ్ లివర్ డే 2022...

    ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లివర్ డే ను ప్రతియేటా నిర్వహిస్తారు.వరల్డ్ లివర్ డే లక్ష్యం ఒక్కటే మనలివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని పద్దతులు పాటించడం అవసరం అంటున్నారు నిపుణులు.మనశరీర అవయవాలలో లివర్ అత్యంత కీలక మైన అవయవం.మన శరీరం తీసుకునే ఆహారం అరగాలాంటే లివర్ కీలకం. శరీరంలో పిత్తశాతం పెంచడం లో శరీరంలోని విష పదార్దాలను తొలగించి శరీరాన్ని డీ టాక్స్ చేసే పనిని చేస్తుంది. లివర్ చేసేపనిలో ముఖ్యమైనది బ్లడ్ షుగర్ ను నియంత్రించడం. ప్రోటీన్ ను తయారు చేస్తుంది. ఈ సమయం లో లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యవసరం.ప్రతిఏ టా వరల్డ్ లివర్ డే ను 19 ఏప్రిల్ న నిర్వహిస్తారు.వరల్డ్ లివర్ డే సందర్భంగా లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకుందాం. లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకునే పద్దతులు... 1)మనం ఇంతకు ముందే చెప్పినట్లు శరీరాన్ని డీ టాక్స్ చేయడం. మీరు ఈ మధ్య కాలంలో అనారోగ్యం కలిగించే పదార్ధాలను తీసుకుంటే లివర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. లివర్ పాడై పోయే ప్రమాదం ఉంది అని నిపుణులు అంటున్నారు. అనారోగ్యం కల్పించే ఆహార పదార్ధాలు లివర్ భాగాలకు నష్టం కలిగిస్తాయి.ఇదే సమయం లో మీకు పొగత్రాగడం లేదా మద్యపానం,జంగ్ ఫుడ్స్,ప్రాసెస్ చేసిన ఆహారం లేదా ఫాస్ట్ ఫుడ్స్ వాటినుండి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 2)వ్యక్తి నియమిత పద్దతిలో శరీర వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాదు లివర్ లో వాపులు కూడా తగ్గుతాయి. వ్యాయామం చేయడం వల్ల లివర్ సరిగాపనిచేయడం లో ప్రభావం చూపుతుంది. ౩) లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం బరువు నియంత్రించడం అత్యవసరం. ఎవరైతే స్తూల కాయం తో ఇబ్బంది పడుతున్నారో వారి శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే బరువు నియంత్రించడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. 4) మనం మన మిత్రులకు కుటుంబ సభ్యులకు కొన్ని విషయాలు పంచుకుంటాం కాని ఇలా చేయడం వల్ల లివర్ లో పలు సమస్యలు రావచ్చని మీరు వాడే టూత్ బ్రష్, చేతి గోళ్ళు కొరుక్కోవడం వంటి వాటిగురించి పంచుకోవడం కన్నా వ్యక్తిగత శుభ్రత స్వీయ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచించారు.పైన పేర్కొన్న అంశాలద్వారా తెలిసింది ఏమిటి?అంటే లివర్ ను ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరం కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

read more
కరోనా నాల్గవ వేవ్ భారత్ ను తాకనుందా ?...

ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వైరస్ లతో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ ఎందుకంటే ఒమైక్రాన్ లోని బి ఏ2 బి ఏ1 కలిసి ఉందన్న విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది.కాగా చైనాలో ఇప్పటికే కరోనా ఉగ్రరూపనికి షాంఘై నగరంలో కరోనా లాక్ డౌన్ ఖటి నంగా అమలు చేస్తున్నా కరోనా కోరలు చా స్తోందని కరోనా బాధితులు లక్షలుగా పెరగడం తో మరోసారి భారత్ ను చుట్టివేస్తుందేమో అన్న అనుమానం ప్రజలను వేదిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్ లోని మహారాష్ట్రాలోని ముంబైలో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు నమోదు అయిననేపధ్యం లో క్రమంగా కోరోనా కేసులు , డిల్లి,యు పి రాష్ట్రాలలో 1౦౦౦ కి పైగా కేసులు నమోదు అవుతూ ఉండడం తో కరోనా వస్తుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.ఈ నేపధ్యం లో కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ విషయం పై తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా వెల్లడించారు. దేశంలో ని పలురాష్ట్రాలలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం తో ఈ కారణం గా చాలా మంది మనసులో ఉన్న అనుమానం ఒకటే ఇది 4 వ వేవ్ కాదు కదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూనాకాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఉపశమనం కలిగించే వార్తను అందించారు.కేసులు గణనీయంగా పెరగడానికి మూలకారణం కరోనా నిబంధన లు సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో నాలుగో విడత కు అవకాశం లేదని ఎందుకంటే ప్రజలలో వైరస్ కు వ్యతిరేకంగా9౦ %సహజంగానే ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగిందని అన్నారు మనీంద్ర అగర్వాల్.వాస్తవానికి ఐ ఐ టి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ రెండు సంవత్సరాలుగా తమవద్ద ఉన్న గణితశాస్త్ర లెక్కల ప్రకారం కోరోనా పై భవిష్యత్తును అంచనా వేస్తూ వచ్చారు. అవి నిజమయ్యాయి కూడా ఉత్తరప్రదేశ్ లో గత మూడు రోజులుగాకోరోనా కేసులు వ్యవహారం లో 1౦౦౦ కి పైగానే నమోదు అవుతున్నాయి, ఆదివారం దాకా యు పి లో 1౩5 కొత్త కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యం లో 61౦ కి పైగా కేసులు నమోదు అవుతునాయి. ప్రజలలో ఈ వైరస్ పట్ల 9౦% రోగనిరోదక శక్తి ని కలిగి ఉన్నారని కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం లేదని  అన్నారు.  కరోనా 4 వ వేవ్ రాదు... ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా రెండవ వేవ్ సమయం లో చాలా పెద్ద ఎత్తున వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దానికి వ్యతిరేకంగా టీకా కార్యక్రమం చేపట్టడం తో ప్రజలలో ఇమ్యునిటి పెరిగేందుకు దోహదం చేసిందని అన్నారు.కేంద్రప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన దాటా సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 186.51 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పారు.ఇక యు పి విషయానికి వస్తే ఇక్కడ 86% ప్రజలకు వ్యాక్సిన్ రెండు రెండు డోసులు అందించడం జరిగింది. వ్యాక్సిన్ విషయం లో యు పి మొదటి స్థానం లో ఉండని ఈ కారణం గానే ప్రజలు ఆసుపత్రులలో వెళ్ళే అవకాశం లేకుండా పోయిన విషయాన్ని అంతకు ముందే ప్రొఫెసర్ అగర్వాల్ కోరోనా రెండవ,మూడవ వేవ్ స్పష్టం చేసారు.ఇప్పటివరకూ కోరోనా పై విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేసారు. యుపిలో గత 24 ఘంటలలో 1౩5 కొత్త కేసులు వస్తూ ఉండడం తో డిల్లి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.  

read more
ఇక వాల్వ్ సర్జరీ కి గుడ్ బై చెప్పొచ్చు...

  కవాటాలలో సమస్యలు ఉంటె వాటికి  మరమత్తు చేసే చికిత్సలు ఎప్పటినుంచో ఉన్నాయి.కానీ పూర్తిగా పాడై పోయిన కవాటాన్ని తీసి వేసి కొత్త కావటాన్ని అమార్చాలంటే మాత్రం సర్జరీ తప్పనిసరి అయ్యేది.సర్జరీ చేసే పరిస్థితి లేనివాళ్ళకు ఎటువంటి చికిత్స చేయాలో అర్ధమయ్యేది కాదు. అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్ చేయడానికి సర్జరీ అవసరం లేని కొత్త చికిత్స పదేళ్ళ క్రితమే అందుబాటులో ఉంది. రెండేళ్ళు గా మన దేశం లో అందుబాటులో ఉంది. అదే ట్రాన్స్ కేధటర్ అయోర్టిక్ వాల్వ్ రెప్లేస్మెంట్.11 ఏ ళ్ళ క్రితం అతనికి సర్జరీ చేసినా ఫలితం లేదన్నారు.డాక్టర్స్ ఇకచనిపోవడమే తప్ప బతికే మార్గం లేదని అన్నారు. ఆరోగి తాలూకు బంధువులు.అప్పుడే అతనిని బతికించడానికి అలెన్ క్రిబెయర్ ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఒక్కఅవకాశం ఇమ్మన్నాడుఏ పుట్టలో ఏ పాముందో అని సరే అన్నారు బంధువులు.అద్భుతం --ఆరోగి బతికాడు.అప్పుడే అలెన్ క్రిబియర్ చేసిన చికిత్స ట్రాన్స్ కేధటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్ మెంట్ ఆకొత్త విధానామే నేడు ఎందఱో రోగులకు వరంగా మారిందని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ కుమార్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. సర్జరీ లేని చికిత్స... కవాటా లలో సమస్యలు ఉన్నప్పుడు అంటే కవాటం లో సమస్య ఉన్నప్పుడు సాధారణంగా దాన్ని రకరకాల పద్దతుల ద్వారా రిపేర్ చేస్తారు. కాని కవాటం పూర్తిగా దేబ్బతిన్నపుడు దాన్ని తీసివేసి కొత్త కావటాన్ని అమార్చాల్సి వస్తుంది.అలాంటప్పుడు అంటే కవాట మార్పిడి అవసరం.  సర్జరీ కన్నా  టి ఏ వి ఆర్ మేలు అంటున్న నిపుణులు... ఇంతకు ముందు సర్జరీ చేయలేనివాళ్లు కు మాత్రమే చేసేవాళ్ళు. కాని అందరికీ బావుందని అధ్యయనాలు జరిజాయి.ఈ అధ్యయనాలను పార్టనర్ స్టడీస్ అంటారని శ్రీనివాస్ స్పష్టం చేసారు.మొదటిపార్ట్ నర్ స్ట డీలో సర్జరీ కి ఫిట్ గా లేని వాళ్ళ కోసం ఈ ప్రొసీజర్ మంచిదని తేలిందిరెండో అధ్యయనం లో సర్జరీకి ఫిట్ గా ఉన్నవాళ్ళకు ప్రొసీజర్ ప్రొసీజర్ మంచిఫలితాలు ఇస్తుందని తేలింది.  మూడో అధ్యయనం లో సర్జరీ కన్నా ఇది మంచిదని తేలింది. సర్జరీ మె డిసిన్స్కన్నా దీనిని ఎంచుకోడం ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. దేశం లో 6౦ ఏళ్ళు పై బడిన వాళ్ళకు ఎవరికైనా చేయవచ్చు. టి వి ఆర్ చికిత్స ఎలా చేస్తారు?... ఈ చికిత్స చేయడానికి ముందు సమస్య ఏ మేరకు ఉందొ తెలుసుకోడానికి కొన్ని పరీక్షలు అవసరం క్లినికల్గా స్టేత్ తో పరీక్షించడం శబ్దం తెలుస్తుంది. ఎకో టెస్ట్ తో కవాటం ఏ మేరకు కుంచించుకుంది.ఏమేరకు బ్లాక్ ఉందొ తెలుస్తుంది. ఎటువంటి వాల్వ్ వాడాలి ఎంతసైజ్ వాడాలో నుర్దారించ వచ్చు. సిటి స్కాన్ ద్వారా కాలి రక్త నాళం 5 మిల్లీ మీటర్లు ఉందొ లేదో తెలుసుకోవచ్చు.అయోర్టా సైజు వాల్వు ఏ సైజులో ఉందొ కూడా చూడవచ్చు.అందుకు సిటి స్కాన్ తప్పనిసరి రక్తనాళం లో బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకోడానికి ఆంజియోగ్రామ్ చేస్తారు.ఆతరు వాతే ట్రాన్స్ కేధటర్ ఆయోర్టిక్ వాల్వ్ రెప్లేస్ మెంట్ ప్రొసీజర్ చేస్తారు.దీనికోసం పెద్ద పెద్ద కోత పెట్టాల్సిన అవసరం లేదు.కాలి రక్త నాళం గుండా వాల్వ్ ను పంపించి పాడైన వాల్వ్ స్థానం లో కొత్త కవటాన్నివేస్తారు రక్త నాళం గుండా 14 ఫ్రెంచ్ మాత్రమే కోత పెట్టి కొత్త కావటాన్ని పంపిస్తారు బెలూన్ ద్వారా వాల్వ్ ను అమరుస్తారు. అన్ని కవాటాలకూ చేయొచ్చా ?... ప్రస్తుతం మైట్రల్ వాల్వ్ పాడైతే కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇదే అయోర్టిక్ వాల్వ్ ను రివర్స్ చేసి పెడుతున్నారు.దీనిని అయోర్టిక్ వాల్వు కు మాత్రమే చేస్తున్నారు. మైట్రల్, ట్రే కస్పిడ్ వాల్వ్ కు ఇలాంటివి అందుబాటులోకి రావొచ్చు.ఇంకా వీటిపై అధ్యనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మైట్రల్ వాల్వ్ పాడైతే దాన్ని రివర్స్ చేసి పెడుతున్నారు భవిష్యత్తులో దీనికి కూడా ఇలాంటి ట్రాన్స్ కేధటర్ రీప్లేస్ మేంట్ అందుబాటులోకి రావొచ్చు లీకేజ్ ఉన్నాకూడా పెట్టవచ్చు.                                                          

read more
మామిడి పండు తో ఏదైనా కలిపి తిన్నారో అంతే....

మీరు మామిడి పండు తింటున్నారా  తిన్నతరువాత ఇంకేమైనా తిన్నారో అంతే సంగతులు ప్రమాదం పొంచి ఉందన్న విషయం మీకు తెలుసా.?మామిడి పండు తిన్న వెంటనే 5 రకాల ఆహారాలు నిషిద్దం వాటిని మామిడి పండుతో కలిపి తిన్నారో అనారోగ్యం పాలైనట్లే.మామిడి పండును చూడగానే మీకు నోరు ఊరడం ఖాయం అసలు మామిడి పండు ప్రేమికులుఅయితే మాత్రం నోరు కట్టుకుంటారా చెప్పండి.ఎందుకంటే ఇది మామిడిపళ్ళ సీజన్ వచ్చేసింది. దీనికోసమే మామిడి పండుప్రియులు సంవత్సరం అంతా వీటికోసం ఎదురు చూస్తూ ఉంటారు.నోరు ఊరించే నూజివీడు రసాలు, కోసుకు తినే పళ్ళు, కలెక్టర్ కాయలు,తోతాపురి కాయలు,బెనిషా ,చిన్నరసాలు ,పెద్దరసాలు ఎన్నిరకాల మామిడిపళ్ళు అసలు మామిడి పండునుఆశ్వాదిస్తూ తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందోతినే వాళ్ళకే తెలుస్తుంది. అయితే మామిడి పండును తింటున్నప్పుడు కొన్నివిషయాలు తప్పనిసరిగా పాటించండి.వేసవి కాలం వస్తూనే మార్కెట్లో ఫలరాజు మామిడి పండు చేసే సందడి వేరు. రకరకాల మామిడిపళ్ళు మనకు మార్కెట్లో దర్సనమిస్తాయి.అసలు మామిడి పండు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. మామిడి పండ్లు మార్కెట్లో కనపడడం పాపం రాత్రి పగలు అదే పనిగా మామిడి పళ్ళను జుర్రేస్తూ ఉంటారు.వాటిధర ఎంతైనా కాని అవి తినితీరాల్సిందే అంటారు.అయితే మామిడి పండు తినే వారు కొన్నిఅంశాల పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మామిడి పండు తిన్న వెంటనే మరి ఎఇతర వస్తువు తినకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అలా చేయకుంటే మీరు అనారోగ్యం పాలవ్వడం ఖాయం.మీరు ముందు ముందు మామిడిపళ్ళు తిని ఆస్వాదించాలని జాగ్రత్తలు పాటించండి. మామిడి పండు తిన్న వెంటనే కొన్నిరకాల వస్తువులు తినకూడదు అన్న విషయం తెలిసిన వాళ్ళు తక్కువే.మిమ్మల్ని మీరు రక్షించుకోకుంటే అది మీకే కష్టం రండి అదిఎమిటో చూద్దాం. 1) మామిడి పండు తిన్నాక కూల్ డ్రింక్ తాగవద్దు... ఏదైనా తిన్న తరువాత సహజంగా ఎవరికైనా దాహం వేస్తుంది. ముఖ్యంగా తీపి వస్తువులు తిన్నాక దాహం వేస్తుంది. దానికి నీళ్ళు తాగితే చాలు కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు అంటే సోడా,పంచదార కలిపిన ఇతర పానీయాలు శరీరానికి హాని కలిగిస్తాయి.మామిడి పండులో సహజంగానే తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆతరువాత కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది. 2) పెరుగు తినవద్దు... దక్షణాది రాష్ట్రాలలో సహజంగా భోజనం తరువాత పెరుగు అన్నం లో అరటి పండు,లేదా వేసవి కాలంలో  మామిడి పండు తినడం అలవాటు.ఇంకొందరు మామిడి పండు తిన్నాక చివరన చేతిలో పెరుగు వేసుకుని తినడం అలవాటు.అది సరైన పద్ధతి కాదు.ఎందుకంటే మామిడి పండు పెరుగు కలిపి తినడం వల్ల కార్బన్ డైయాక్సైడ్ తయారు అవుతుంది దీనివల్ల పొట్టలో పలు రకాల సమస్యలు వాస్తాయి. ౩)నీరు తాగడం... ఏ మైనా తిన్న వెంటనే మంచినీళ్ళు తాగడం సరైన పద్దతికాదు. తిన్న తరువాత దాహం వేయడం సహజం. కొంతసేపు ఆగిన తరువాత నీటిని తాగడం మంచిది.మామిడి పండు తిన్న వెంటనే నీరు తాగితే అరగడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంది.దీనివల్ల గ్యాస్ గుండెల్లో మంట వంటి సమస్యలురావచ్చు ఖారం లేదా మసాలాలకు దూరంగా ఉండండి ... సహజంగా వేసవి కాలం లో భోజనం తరువాత మామిడి పండు తినడానికి ఇష్టపడతారు.అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ పద్ధతి సరైనది కాదు.మసాలాతో కూడిన ఖారం తిన్న తరువాత మామిడి పండు తింటే పొట్టలో మంట, వికారం,తెమిలినట్లు గా ఉండడం వంటి సమస్యలు.వస్తాయి ఒక్కోసారి వెక్కిళ్ళు వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాకరకాయ తినవద్దు ... మనం సహజంగా భోజనం చేస్తున్నప్పుడు మీ పళ్ళెం లో కాకర కాయ మామిడి పండు కలిపి తినడం ద్వారా పొట్టకు సంబంధించిన సమస్యలురావచ్చు మామిడి పండు తిన్న వెంటనే కాకర కాయ తినడం వల్ల వాంతులు కడుపులో మంట,కడుపులో మెలిప్ప్పినట్టుగా  ఉండడం ఇతర వస్తువులు తినలేని పరిస్థితి సమస్యలు వస్తాయి. సో అదండీ మామిడి పండు ఇతర వస్తువులతో కలిపితీసుకుంటే వచ్చే అనర్ధాలు.చెప్పడం మావంతు ఆచరించడం ఆచరించక పోవడం మీవంతు.                                 

read more
ఆరోగ్యానికి ఆయుర్వేద పానీయాలు!

వేసవిలో మీశరీరం చల్లగా ఉండాలంటే సహజ సీద్ధమైన శీతల పానీయాలు ఇవే... వేసవికాలంలో ఎండవేడిమి తట్టుకోవాలంటే ఏదైనా చల్లగా తాగాలని అనిపిస్తుంది. శరీరం వేడిమి తాపం నుండి బయట పడాలంటే శరీరం చల్ల బడా లంటే నాలుగు రకాల సహజ సిద్ధమైన ఆయుర్వేద పానీయాలు మీకోసం.వేసవిలో  వేడి గాలులతో వాతావరణం వేడెక్కిపోతుంది శరీరాన్ని చల్ల బరచడం అత్యవసరం. అందుకోసంమే కొన్ని ఆయుర్వేద పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరం చల్లబడడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మేము మీకు ఇలాంటి కొన్ని రకాల పానీయాల ను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.అవి మీ ఆరోగ్యానికి సహాయ పడతాయాని ఆశిస్తున్నాం. చందనంతో పానీయం... చందనం అంటే మీశారీరాన్ని ముఖ్యంగా చర్మాన్ని చల్ల బరచడమే కాదు ఆరోగ్యంగా ఉంచడం లో లాభ పడుతుంది. ముఖ్యంగా ఇందులో ఒక ఆధ్యామిక రహాస్యం చూడవచ్చు. తిరుపతి లో తల నీలాలు సమర్పించిన తరువాత చందనాన్ని రాసుకోవడం గమనించవచ్చు. కాగా ఉగ్రనారసింహ రూపాన్ని శాంత పరచడానికి చందనం పూయాడం అనవాయితీగా వస్తున్న ప్రక్రియ. దీనిద్వారా మరెన్నో చర్మసంబందిత సమస్యలకు చందనం అరగదీసి పూస్తారు.ఇక పానీయానికి సంబంధించి చందనం లో సహాద్ ను కలిపి తాగడం ద్వారా వేదిమినుంచి ఉపసమనం కలుగుతుంది. ఖస్ ఖస్ తో చల్లని పానీయం... ఖస్ ఖస్ అనగానే మనం తెలుసుకుంటే ఖాస్ ప్రత్యేకమైన అని ఆర్ధం వస్తుంది.అయితే పూర్తిగా సోధిస్తే దీనిఅసలు పేరు ఖష్ ఖష్ అంటే గసగసాలు సహజంగా గసగసాలు మన వంటింట్లో నిత్యం వాడే దినుసుగా చెప్తారు. ముఖ్యంగా మసాలా కూరలు చికన్ మటన్ లలో గసగసాలు కొబ్బరి తోచేసిన మషాలా ను వాడడం గమనించవచ్చు.అయితే ఖస్ ఖస్ లో అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంగీకరించక తప్పదని  అంటున్నారు నిపుణులు.ఖస్ లో ప్రోటీన్ తో పోరాడే శక్తి ఉందని,ఐరన్ ,కొలస్ట్రాల్ వంటి  చాలా సుగుణాలు ఉంటాయి. ఖస్ తో చేసిన ష ర్బత్,పానీయం శరీరాన్ని డీ హైడ్రేషన్  నుండి రక్షిస్తుందని అంటున్నారు నిపుణులు. బేల్ అంటే వెలగ పండుతో మరో శీతల పానీయం... వెలగ పండువాడకం ఈ తరం వారికి తెలియదు.అయితే వెలగ పండును అత్యంత ప్రభావ వంతమైన వైద్య గుణాలు ఉనట్లు ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు.వెలగ పండును గ్రామీణ ప్రాంతలాలో ఇప్పటికీ వాడతారు.ఆయుర్వేదం లో వెలగ పండు ఆకులు పళ్ళకు చాలా ప్రాధాన్యత కల్పిస్తారు.వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచేందుకు అందరు వెలగ పండుతో చేసిన షర్బత్ డ్రింక్ ను వాడవచ్చు.ముఖ్యంగా పొట్టలో వచ్చే కడుపు మంటకు ఉపశమనం కలిపించే శక్తి వెలగ పండుకు ఉందని అంటున్నారు నిపుణులు. దానిమ్మ తో కూల్ కూల్ డ్రింక్... దానిమ్మ దీనిగురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శరీరంలో రక్త హీనత బలహీనం గా ఉన్నవారు తప్పనిసరిగా తీసుకునే పళ్ళలో ఒకటి దానిమ్మ గింజలు. దీనిని తీసుకోవడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.దానిమ్మలో ఐరన్ పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు వైద్యులు. మీరు దానిమ్మ జ్యూస్ చాలా సార్లు తాగిఉందవచ్చు.దానిమ్మతో చేసిన డ్రింక్ వేసవి కాలం లో చల్లగా ఉంచే స్వభావం దానికి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. గులాబీ తోస్పెషల్  డ్రింక్... గులాబీ మంచి సువాసన ఇచ్చే పువ్వు.గులాబీ వల్ల వచ్చే సువాసనకన్నా గులాబీ వాటర్ ను కొన్ని రకాల వైద్యానికి. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి గులాబీ వాటర్ పేస్ ప్యాక్ లలో వాడడం మనం గమనించవచ్చు. వేసవికాలం లో గులాబి పకుడియాల నుంచి తీసిన డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరం  చాలా చలాకీగా చురుకుగా ఉంచుతుంది అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది.                          

read more
ఊపిరితిత్తులలో మైక్రో ప్లాస్టిక్ ...

  ఊపిరి తిత్తులలో మైక్రో ప్లాస్టిక్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. శాస్త్రజ్ఞులు తొలిసారిగా చేసిన పరిశోదనలో ప్రస్తుతం జీవిస్తున్న వారిలో సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ రేణువులను ఊపిరి తిత్తులలో ఉన్నాయని గుర్తించారు. ఈవిషయం మనకు తెలిసినప్పటికీ కీలక పరిశోదనలో మనం సూక్ష్మం గా ఉన్న ప్లాస్టిక్ కణాలాను మనం పీలుస్తున్నామని అది  ఊపిరి తిత్తులపై అత్యంత ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈకారణంగా మరిన్ని తీవ్ర సమస్యలు వస్తున్నాయని తెలిపారు.సూక్ష్మం గా ఉన్న ప్లాస్టిక్ రేణువులు చాలా చిన్నవి అందులోనూ 5 మిల్లి మటర్ల కన్నా తక్కువే.ఇలాంటి ప్లాస్టిక్ రేణువులు సహజంగా సముద్ర తీరాలాలో కనిపిస్తుంది. అదీ కొండప్రాంతలాలో గాలిలో ఇలా చాలా తక్కువ సంఖ్యలో ఉన్న డెబ్రీ లలో చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి మనం నీటిని ఫిల్టర్ చేసినప్పుడు అవి చొచ్చుకు పోతాయి.అలాంటి సూక్ష్మ ముఖ్యంగా సముద్రపు ఒడ్డున జీవించే జాలార్లు వారి జీవితం అత్యంత ప్రమాదకరంగా మారింది.    ఈ విషయం పై హాల్ మార్క్ మెడికల్ స్కూల్ విశ్వ విద్యాలయం లో 1౩ మంది వద్ద సేకరించిన నమూనాలలో 11 మంది లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు కనుగోన్నారు. ఊపిరి తిత్తులలో సంబంధించిన కణాలు నమూనాలను పరీక్షించారు.ఇతర ల్యాబొరేటరీ లలో చేసిన పరిశోదన వివరాలాను పర్యావరణం సాధారణ సైన్స్ ప్రచురించేందుకు అనుమతించారు. మైక్రో ప్లాస్టిక్ ను గతం లో నే మానవులలో శరీరంలో ఉన్నట్లు గుర్తించారు. కేడావర్ అటోప్సిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది సజీవంగా ఉన్నవారి ఊపిరి తిత్తులలో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించారు. అదీ ఊపిరి తిత్తులలో కింది భాగం లో ఉందని గుర్తించామని డాక్టర్ లవురా సడో ఫీస్కీ హల్ మార్క్ మెడికల్ యునివర్సిటి ప్రోఫెసర్ ఈ పరిశోదనకు నేతృత్వం వహించారు. ఈ పరిశోదన సజీవంగా ఉన్న ఊపిరి తిత్తుల కణాల నుండి సేకరించారు. కొన్నిరకాల సర్జరీ పద్దతులను అమలు చేసినట్లు ఇప్పటికీ వారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికీ వారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఈ రోజుకూ వారు నిత్యజీవితం లో వైద్యం చేయించుకు కుంటున్నట్లు తెలిపారు. శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 12 రకాల ప్లాస్టిక్ ను సహజంగా ప్యాక్ చేసిన బోటిళ్ళలో, బట్టలు, తాళ్ళు, ఉత్పత్తి చేసే పద్దతుల వల్ల ప్లాస్టిక్ చేరుతుందని అదీ పురుషులలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఊపిరి తిత్తులలో కింది భాగం లో ఎన్నోరకాల పార్టికల్స్ ఉంటాయాని అయితే శుద్ధి చేసిన తరువాత ఊపిరి తిత్తులలో చేరి ఉండవచ్చని మైక్రో ప్లాస్టిక్స్ వాటి పరిమాణం మానవులు పీల్చుకోదగిన పరిణామం లో ఉన్నాయి. రక్తం లో కూడా ఇలాంటి పార్టికల్స్ ఉన్నట్లు గుర్తించారు. మైక్రో ప్లాస్టిక్ గాలిద్వారా స్సోకినట్లు గుర్తించారు.          .           

read more
స్టమక్ ఫ్లూ అంటే మీకు తెలుసా ?...

  స్టమక్ ఫ్లూ అంటే ఏ మిటి ? స్టమక్ ఫ్లూ లక్షణాలు ఎలా గుర్తించాలి ?దీనినుంచి మనం ఎలా రక్షించ బడాలి?మనం తీసుకునే ఆహారం సరిగా లేనందువల్ల మన పొట్టలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి స్టమక్ ఫ్లూ పొట్టకి ఫ్లూ  ఇది ఏమిటి? అని మాత్రం ఆశ్చర్య పోకతప్పదు. దీనిని వైద్య పరిభాష లో గ్యాస్ట్రో ఏంట్రా యిటీ స్ అని అంటారు. శరీరంలో పంచ తత్వాలలో వాపు వల్ల లేదా కడుపులో ఇన్ఫెక్షన్ వల్ల స్టమక్ ఫ్లూ వస్తుంది. ఈ వ్యాధి అంత ప్రమాద కరమైనది కాదు.దీనిని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు.స్టమక్ ఫ్లూ కు కారణం సహజంగా వైరస్ బ్యాక్టీరియా పరాన్న జీవులు లేదా ఒక్కోసారి మీరు వాడే మందులు సైతం రీయాక్షన్ కూడా కారణంగా చెప్పవచ్చు. స్టమక్ ఫ్లూ అంటే ఏమిటి?.... స్టమక్ ఫ్లూ వల్ల రోగి పొట్టలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల కారణంగాకడుపులో తిప్పినట్టు, తెమిలి నట్టు.   అతి సారం వంటి సమస్యలు రావచ్చు. నోరో వైరస్, నోటా వైరస్.ఎగస్ట్రా వైరస్,తదితర వైరస్ లు లేదా ఎల్లప్పుడూ మీరు తీసుకునే ఆహారం విషపూరితం కావడం,లేదా పాడై పోయిన ఆహారం తీసుకోవడం, మనం తీసుకునే నీరు కలుషితం కావడం అది శరీరంలో చేరడం. వల్ల వేసవిలో నీరు కలుషితమై పోవడం వల్ల పిల్లల నుండి వృద్ధుల వరకూ బలహీనం గా ఉన్నవారిలో ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. వేసవి,వర్షా కాలం లో తీవ్ర ప్రమాదం.... స్టమక్ ఫ్లూ విషయం లో వేసవికాలం లేదా వర్షా కాలం వాతావరణం లో ఎక్కువగా చూడవచ్చు. వాతావరణం లో వేడిమి చమట పట్టడం.శరీరం నుండి ఉప్పు నీరు బయటికి పోవడం తో ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది. ఈ కాలం లోనే శరీరంలో బయట బ్యాక్టీరియా పెరిగేందుకు అనువైన వాతావరణం గా చెప్పవచ్చు. ఈ వాతావరణం లో పండ్లు, కూరగాయలు, ఒండిన అన్నం కూర త్వరగా పడిపోతాయి. అప్పుడు ఈగలు,దోమలు ,జీవాణు వులు. ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకు వెళతాయి. స్టమక్ ఫ్లూ లక్షణాలు... ఆకలి వేయక పోవడం.పోత్తనోప్పి, వాంతులు,ఆతిసారం , మంట, ఒక్కోసారి చలిగా ఉండడం ,వణకడం.జ్వరం. మడమలు పదాలు పట్టుకు పోవడం.కండరాలాలో నొప్పి, శరీరంలో స్వల్పంగా వేడి, ఎక్కువగా చమట పట్టడం. స్టమక్ ఫ్లూ నుండి రక్షణ పొందడం ఎలా?... వేసవి కాలం లో ప్రత్యేకంగా నీటిని తీసుకోవాలి,మజ్జిగ,నిమ్మరసం, ఒఅరెస్ వంటివి తీసుకోండి. ఎర్రటి ఎండలోతిరగడం,లేదా వేడి నీళ్ళు తాగడం చేయకండి. పైన పేర్కొన్న లక్షణాల ను గుర్తించి ఏమాత్రం అశ్రద్ధ చేసిన ఒక్కోసారి ప్రాణ హాని తప్పదు అంటున్నారు నిపుణులు.                                                     

read more
ఎక్స్ ఈ వేరియంట్  భారత్ లో ప్రభావం ఎంత ?..నిపుణుల విశ్లేషణ...

  కరోనా కొత్త వేరియంట్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది.గతంలో దీని తీవ్రతను అంచనా వేయడం లో ఇబ్బంది పడ్డ మనం ఎక్స్ ఇ వేరియంట్  తీవ్రత ప్రభావం ఏమేరకు ఉంటుంది? అన్నది పెద్ద సందేహం సామాన్యులను వేదిస్తోంది. అయితే భారతీయులు ఎక్స్ ఇ వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు తీపి కబురు అందించారు. ఈ అంశం పై వెల్లూర్ కు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ గగన్ దీప్ కాగ్ ఎక్స్ ఇ వేరియంట్ వల్ల పెద్దగా ప్రమాదం లేదన్న తీపి కబురు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కోరోనా వైరస్ నూతన వేరియంట్ పై పెద్దగా భయపడాల్సింది లేదని ఎందుకంటే ఒమైక్రాన్ సబ్ వేరియంట్ తో పోల్చినప్పుడు ఎక్స్ ఇ ప్రమాదకారి కాదని తీవ్రత ఉండే అవకాశం లేదని తేల్చారు. ఎక్సి ఇ వేరియంట్ చింతించాల్సిన అవసరం లేదు... జాన్ హాప్కిన్స్  కు చెందినా గుప్తా-క్లిన్స్కో ద్వారా నిర్వహించిన చర్చలలో కాగ్ మాట్లాడుతూ వేరియంట్స్ వస్తాయాని ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పర్యటిస్తున్నారు,సందర్శిస్తున్నారు, ఇప్పటి వరకూ మనవద్ద ఉన్న ఎక్స్ ఇ వేరియంట్ సమాచారం ప్రకారం బి ఏ2 ,వల్ల కాస్త భయపడినా బిఏ 1 అంత ప్రమాద కారి కాదు. ఎక్స్ ఇ వేరియంట్ బిఏ1,బి ఏ2 ఇది ఒమైక్రాన్ వేరియంట్ తీవ్ర రూపం దాల్చలేదు. భారాత్ లో వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఈ వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదు.అయితే ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వేరియంట్స్ తో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ మాత్రమే ఎందుకంటే ఒమైక్రాన్ లోని బిఏ2 ,బిఏ1 కలిసిందని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. భారాత్ లో ఎక్స్ఇ వేరియంట్ పై సస్పెన్స్... కొన్ని రోజుల ముందు బి ఎం సి భారత్ లో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు పూనా నమోదు అయ్యింది. ఇండియన్ సార్క్ కోవిడ్2 జీనోమిక్స్ కన్సోర్టియం జీనోమ్ నిపుణుల విశ్లేషణలు చేసారు. వారికి వచ్చిన సందేహాల ప్రకారం దీని జీనో మిక్స్ కాంస్టిట్యుట్యూషన్ ఎక్సి ఇ వేరియంట్ తో కలవడం లేదు. అరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది... 6౦ సంవత్సరాల కన్న తక్కువ వయస్సు ఉన్న ప్రజలకు బూస్టర్ డోస్ యొక్క ప్రభావం చూపేందుకు అవసరమైన డాటా ప్రస్తుతం తమవద్ద లేదని చివరి సమా వేషం లో ఐ సి ఎం ఆర్ డైరెక్టర్ బలరాం బార్ఘవ పాల్గొన్నారు. కాగా డాక్టర్ కాగ్ చేసిన వ్యాఖ్యను బలరాం బార్ఘవ బలపరచడం విశేషం. ఈ సందర్భంగా బార్ఘవ మాట్లాడుతూ ప్రాధమిక కేంద్రలాలో అత్యధికంగా నిధులు ఖర్చుచేయడం,మంచి శిక్షణ ఇవాల్సిన అవసరం ఉందని ప్రాధమిక ఆరోగ్య కేంద్రలాలో హీన పక్షం ఎం బి బీస్ డాక్టర్స్ అవసరం ఉందని. అనారోగ్యం చికిత్స విషయంలో ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని బార్ఘవ అన్నారు. దానా దీనా ఎక్సి ఇ వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండబోదని నిపుణులు-నిపుణులు విశ్లేషించారు.                                        

read more
శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!

హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!   శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.

read more
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతిఏటా ఏప్రిల్ 7 వ తేదీన నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క లక్ష్యం తమ తమ  ఆరోగ్యం పట్ల ఆనుసరించాల్సిన పద్దతులపై అవగాహన చైతన్యం కల్పించడం చేయాల్సి ఉంటుంది. దీర్ఘ కాలం పాటు చురుకుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లు అవసరమో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ----- మంచి అలవాట్లు అలవారచుకోవాలంటే ఒక్కరోజులో సాధ్యం కాదు. వీటిని మెల్లి మెల్లిగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఊబకాయంతో పాటు డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు,ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే గుండె పోటు,ఇతర అనారోగ్య సమస్యలు, ఇవన్ని అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చిన సమస్యలు కావు. మీరు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు సమయపాలన వల్ల సమయానికంటే ముందే మీకు కొన్ని హెచ్చరికలు చేస్తుంది. మనం మాత్రం ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఆరోగ్యం పట్ల శ్రద పెట్టాలి. ఆ సమయంలో అలా చేయనందు వల్లే ప్రతి ఏటా ఏ ప్రిల్ 7 న మిమ్మల్ని మీఅరోగ్యం పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియ చేయడానికే మా ఈ ప్రయాత్నం. ప్రతి ఏటా ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మీరు అనుసరించాల్సిన లక్షణాలను కొన్నింటిని వివరించే ప్రయత్నం చేస్తాం. అవి మీరు సుదీర్ఘ కాలం పాటు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నాం. మీరు తీసుకునే ఆహారం ఆస్వాదిస్తూ తినండి... భోజనం చేయడం వల్ల ఆరోగ్యం తో పాటు శక్తి నిస్తుంది. ఈ సమయం లో ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏమిటి అంటే భోజనాన్ని మెల్లిగా ఆస్వాదిస్తూ తినాలి.త్వర త్వరగా తినాలన్న ఆలోచనలో ఒకేసారి ఎక్కువగా భోజనం తీసుకుంటారు. దీనికారాణం గానే మీ శరీరం ఊబకాయం గా మారుతుంది. మెల్లి మెల్లిగా ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఆహారం తక్కువగా తిన్న కడుపు నిండి పోతుంది. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కార మౌతాయి. ఆహారంలో ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవాలి... శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ తో కూడిన సంపూర్ణ పోషకాల ఖజానా అవసరం. చాలా నెలలుగా మన శరీరం కోసం లాభాదాయక మైన ప్రోటీన్ లతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల మన పొట్ట నిండి ఉంటుంది. అందుకే మనకు త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు ఊబాకాయం, రెండింటిని నియంత్రించ వచ్చు. శాఖాహారులకోసం సోయా, కాబూలి చన, పన్నీరు, స్ప్రవుట్స్ వంటివి ప్రోటీన్ చాలా అద్భుత మైన ప్రత్యామ్నాయం గా చెప్పవచ్చు. ఇంటి ఆహారంతోనే ఆరోగ్యం... ఇంట్లో తయారయ్యే ఆహారంలో మీకు కావాల్సిన విధంగా నూనె,ఉప్పు, మసాలా, వేసుకోవచ్చు. బయట వండిన ఆహారంలో అన్నీ ఎక్కువ స్థాయిలో కలిసి ఉంటాయి ఆహారం రుచికరంగా ఉండచ్చు. కాని ఆరోగ్య పరంగా అది సరైనది కాదు. అని అంటున్నారు నిపుణులు. నెలలో ఒకటి రెండు సార్లు లేదా ప్రత్యేకమైన సందర్భం లో తీసుకోవడం తప్పుకాదని అయితే ప్రతిరోజూ ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం నిరాకరించమని నిపుణులు సూచిస్తున్నారు. మీశారీరాన్ని మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోండి... ఆహారం బాగా తీసుకోవడం తో పాటు శరీరక  వ్యాయామం చేయించడం చేయడం కూడా అత్యవసరం వ్యాయామం వల్ల శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉండడం తో పాటు మూడ్ కూడా బాగుంటుంది. అలసట సమస్యలు ,ఒత్తిడివంటి వాటి నుండి దూరంగా ఉండవచ్చు.అయితే ఇందుకోసం వర్క్ అవుట్ అంటే  పెద్ద సైజు జిమ్ లు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూడా రకరకాల వ్యాయామాలు చేయవచ్చు. రకరకాల కార్యక్రమాలు చేయవచ్చు. రక రకాల కార్యక్రమాలలో భాగంగా చీపురు తో శుభ్రంగా ఊడవడం, తడి బట్ట పెట్టి తుడవడం లేదా శుభ్రం చేయడం.ఇంటిలోపల బయట మొక్కలు పెంచడం పిల్లలతో ఆడుకోవడం ఇంట్లో అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ కు బదులు మెట్ల ను వినియోగించడం వంటి వి చేయడం ద్వారా చురుకుగా ఉండవచ్చుప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా మన  ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో మన ఆరోగ్యాన్ని కాపాడతాడని అనుకోవడం వ్యర్ధం.కీలక మైన ఉపద్రవం వచ్చినప్పుడే రాణి అధికార యంత్రాంగం ఇప్పుడు మాత్రం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున వస్తుందని ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తుందని ఎలా నమ్మగలం ఎలా విశ్వసించ గలం. 

read more
కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఇ అత్యంత ప్రమాదకరం డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక...

  కరోనా వైరస్ ప్రారంభ మైన నాటి నుండి ఎన్నోరకాల వేరియంట్లు ముందుకు వస్తూనే ఉన్నాయి.అయితే ఎక్స్ ఇ నూతన వేరియంట్ ను గుర్తించారు.ఎక్స్ ఇ పై డబ్ల్యు హెచ్ ఓ అమందో చూద్దాం.ప్రపంచం లో కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గు ముఖం పడుతోందని అని అనుకుంటున్న సమయం లో అందరు తమ తమ విధులను నిర్భయం గా చేసుకుంటున్నారు. ఈ సమయంలో మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చిందని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది.డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం కోరోనా వేరియంట్ ఎక్స్ ఇ ని గుర్తించినట్లు తెలిపింది. మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటి అంటే సాధారణ ఒమైక్రాన్ తో పోలిస్తే ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా వ్యాపిస్తుందని తెలిపారు. కాగా ఇప్పటివరకూ కోవిడ్ 19 ఒమైక్రాన్ లేదా అన్ని వేరియంట్లలో కన్నా ఇది అధికంగా మ్యుటేట్ చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని మూడవ వేవ్ గా విస్తరించేందుకు పెద్ద్దసమయం పట్టలేదన్న విషయాన్ని గమనించాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఒమైక్రాన్ వేరియంట్ కారణం గా వచ్చిన ఉప్పెన మొదటి వేవ్ కన్నా మూడవ విడతలో ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య  తక్కువే అని పేర్కొన్నారు. ఒమైక్రాన్ డెల్టా వేరియంట్ ను సైతం వెనక్కు నెట్టి ఆశ్చర్యాన్ని కలిగించిందని నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్ ఎక్స్ ఇ ఐ దు వాస్తవాలు... కొత్త వేరియంట్  ఎక్స్ ఇ ఐ దు గురించిన 5 అంశాలు తెలుసుకుందాం. ఎక్స్ ఇ ఒమైక్రాన్ బిఏ 1 బి ఏ 2 కలిసి ఉన్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచే వైరస్ వేరియంట్స్ గురించిన సమాచారం అందించే ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తుంది.డెల్టా క్రాన్ కన్నా ముందుగా వచ్చిందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.గతకొంత కాలం గా వైరస్ లు  మరికొన్ని కలిసి పుట్టుకు వస్తున్నాయి.అందులో ఫ్లూరాన్  కూడా ఒకటి.ఎక్స్ ఇ కూడా బిఏ1 బిఏ 2 కలిసిన వేరియంట్ గా గుర్తించారు. ఈ రెండూ కాక ఇంకెన్ని ఉన్నాయి.అవి ఎక్కడ ఉన్నాయి అన్న అంశాల పై దృష్టి పెట్టాల్సి ఉంది. అని నిపుణులు అంటునారు.   ఎక్స్ ఇ వేరియంట్ ఆందోళన కరమా?.... ఎక్స్ ఇ వేరియంట్ స్వరూప స్వభావం ఎలా ఉంటుంది అన్న విష యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన ప్రారంభ రిపోర్ట్ లో ఎక్స్ ఇ వేరియంట్ ఆందోళన కరమైన వైరస్ గా పేర్కొంది. మార్చ్ 25 న వచ్చిన రిపోర్ట్ లో యు కే లో ఇప్పటి వరకూ 6౩7 మంది పై ప్రభావం చూపించిందని ఒమైక్రాన్ బిఏ 1 బి ఏ2 కలిసిన వేరియంట్ గా పేర్కొన్నారు.యు క్ కు చెందిన ఆరోగ్య శాఖ ఎజే సి సలహాదారు సుసాన్ వా ప్కిన్స్ మాట్లాడుతూ వేరియంట్ యొక్క ప్రభావం గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా బి ఏ 1 బి ఏ 2 కలగలిసిన వేరియంట్ ఎక్స్ ఇ మార్పు ఉన్నట్లు  వివరించారు. ఈ వేరియంట్ ఎక్కడ పుట్టింది, ఎలా వృద్ధి చెందింది అన్న అంశాలు పూర్తిగా తెలియాల్సి ఉంది అని అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కోరోనా వేరియంట్స్ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సహజంగా అది వంశ పా రం పర్యంగా వేరియంట్ కు పరివర్తన చెందే గుణం ఉందని ఈ పరివర్తన లేదా రూపాంతరం చెందడం అత్యంత హానికరం గా పేర్కొన్నారు. ఎక్స్ ఇ త్వరగా వ్యాపిస్తుంది ... ఎక్స్ ఇ వేరియంట్ ఎక్కువ మందికి త్వరగా వ్యాపిస్తుందని త్వరగా సంక్రమిస్తుందని తెలుస్తోంది. ఒమైక్రాన్ తో పోల్చినప్పుడు దీని ప్రభావం 1౦ రెట్లు ఎక్కువగా ఉంటుందని సత్వరం వ్యాపిస్తుంది. ఇప్పటి వరకూ ఒమైక్రాన్ వేరియంట్ మాత్రమే త్వరగా విస్తరించి సంక్రమిస్తుందని భావించారు. ఒమైక్రాన్ ప్రపంచాన్ని చుట్టేయడానికి పెద్ద సమయం పట్ట లేదన్న విషయాన్ని గుర్తించాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఎక్స్ ఇ తీవ్రత ఎలాఉంటుంది?... డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం మరింత సమాచారం కోసం వేచి చూడాలని. గతం లో ఉన్న ఒమైక్రాన్ బి1 బి2 ప్రభావం లో పెద్దగా మార్పు లేదని ఒమైక్రాన్ కారణం గానే మూడవ విడత వేవ్ వచ్చిందని ఇప్పుడు చైనాలో వీర విహారం చేస్తోందని మార్చ్ నెలలో చైనాలో కోవిడ్ బారిన పడిన పడిన వారి సంఖ్య ఒక లక్ష కు ఎక్కువే ఉన్నాయని, ఇందులో అత్యధిక కేసులు షాంఘై లోనే ఉండడం గమనార్హమని డబ్ల్యు హెచ్ ఓ విశ్లేషించింది. ఇప్పటి వరకూ దీని ప్రభావం ఎక్కడ ఉంది?... ఒమైక్రాన్ ఎక్స్ ఇ వేరియంట్ ప్రభావం పడింది. యు కే కు చెందినా రక్షణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎక్స్ ఇ వచ్చిన నాటి నుంచి 6౩7 మంది పై ప్రభావం చూపించిందని తెలుస్తోంది.ఎక్స్ ఇ ప్రభావం దీనిలక్షణా లు సోకినా వారికి చేస్తున్న చికిత్స ఎలాంటి వాతావరణం లో మరింత ప్రభావ వంతం గా ఉంటుంది అన్న అంశం పై మరింత లోతైన అధయనం చేయాల్సి ఉందని ఆ వివరాలు అందిన వెంటనే వెల్లడిస్తామని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.                                          

read more
వడదెబ్బ బారిన పడకుండా ఎలా నివారించాలి?..

వడదెబ్బ ఎవరికీ వస్తుంది. వడదెబ్బ ప్రమాదం నుండి ఎలారక్షించు కోవాలి? మార్చ్ నెల చివరి వారం లోనే ఎండలు ముదిరి పోయాయి,వడగాడ్పులు ఎండవేడిమి పెరిగి పోతోంది.దీనికి తోడు మరెన్నో అనారోగ్య సమస్యలు పెరుగు తాయి. ముఖ్యంగా ముఖ్యంగా గుండె సమస్యల తో బాధ పడు తున్న వారువేసవి ఎండల నుండి సంరక్షించు కోవాలి.అన్నదే పెద్ద సందేహం.బహుశా మీరు వినే ఉంటారు చలికాలం వచ్చిందంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు చాలా ప్రమాదం పొంచి ఉందని ఈ వాతావరణం లో నూ గుండె సంబందిత సమస్యలు చూడ వచ్చని కేవలం మంచు గడ్డ కట్టే చలిలో మాత్రమే కాదు తీవ్రమైన ఎండా వేడిమి కూడా గుండె సంబంధిత సమస్యలను పెంచుతుంది.వాస్తవానికి ఒక పరిశోదన ప్రకారం వాతావరణం లో వచ్చే కొన్ని మార్పులు గుండె సంబంధిత సమస్యలు మనల్ని ఇబ్బందుల లోకి నెడతాయి అని నిపుణులు అంటున్నారు. వడ దెబ్బ ఎలా వస్తుంది...? ఈ సంవత్సరం ఎండాకాలం అదే వేసవి కాలం త్వరగా వచ్చేసినట్లు ఉంది కదా అంతే కాదు. వేడిమి ఉష్ణోగ్రతలు క్రమేపి త్వరగా పెరుగుదల కనిపిస్తుంది. గుండె సంబంధిత రోగులకు వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం వేడిగా ఉన్న వాతావరణం లో మనశరీరం లో వేడి పెరిగి పోతుంది. మనము ఎండవేడిమి ఉన్న ప్రాంతం లో నివసించక తప్పదు. మీ గుండెలో  స్పందనలు వేరు వేరుగా ఉంటాయి గుండెలో దడ హార్ట్ బీట్ లో మార్పులు వస్తాయి.రక్త ప్రసారం అందించాలంటే చాలా ఇబ్బంది పడాలి.అందుకే శరీరం తనకు తానుగా చల్లగా చేసుకోదో ఆ ఒత్తిడి గుండె ఇతర అవయవాల పైన పడుతుంది. దీనివల్ల వారికి తీవ్రనష్టం ఏర్పడుతుంది. ఈ కారణం గానే గుండె పై దాడి చేస్తుంది వడదెబ్బ రూపం లో భయట పడుతుంది. వడ దెబ్బ వల్ల ప్రమాదమే ఎక్కువట... వడదెబ్బ ఎవరికైనా  తగలవచ్చు. వాటిని ఎదుర్కోవచ్చు. ఎవరైతే గుండె సంబందిత సమస్యలతో బాధపడుతున్నారో. వడ దెబ్బ ప్రమాదం పొంచి ఉంది.గుండె జబ్బులు ఉన్న వారిలో చమట వస్తే ప్రమాదమే అని గుర్తించాలి.ఎప్పుడైతే ఎండవేడిమి పెరిగి పోతుందో. మనందరికీ చమట వస్తుంది. శరీరం లో చేరే వేడికి వ్యతిరేకంగా సహజం గానే అది పని చేస్తుంది. అయితే గుండె సంబంధిత రోగులకు ఈ విషయం అంత సులభం కాదు. అది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.శరీరానికి అవసరమైన ఖనిజాలు చమటరూపం లో  బయటికి పోతాయి.ఈ కారణం గానే గుండెపై తీవ్రాత్తిది పెరుగుతుందని వైద్యులు గుర్తించారు.వేసవి కాలం లో మీ శరీరం  ఆరోగ్యంగా ఉంచాలంటేడీ టాక్సీ ఫికేషణ్ కోసం ఈ ఆహారాన్ని తీసుకోండి. వదదెబ్భ నుండి ఎలారక్షించు కోవాలి?... నీరు ఎక్కువగా తీసుకోవాలి.గుండె సంబంధిత రోగులు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మందులు వాడు కుంటూ ఎక్కువగా మంచినీరు తాగే ప్రయత్నం చెయ్యాలి.ఎండవేళ లో బయటకు రాకండి..అధికంగా వేడిమి ఉండే సమయం లో అదీ మధ్యాహ్నం 12 గం నుండి సాయంత్రం 4 గం వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆసమయంలో బయటికి రావద్దని ఒక వేళ తప్పని సరి పరిస్థితిలో బయటకు వస్తే మంచి నీటి బాటిల్ మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎండనుండి రక్షించుకునేందుకు టోపీలు లేదా షేడ్స్ వాడండి. వ్యాయా మం తప్పక చేయండి... గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలాని సూచించారు. ఉదయం వేళలో మాత్రమే వ్యాయామం చేయాలి.లేదా వాతావరణం కాస్త చల్ల బడ్డాక వ్యాయామం చేయాలి. ఒకవేళ ఎక్కువగా చమట వస్తుంటే మీగుందే వేగం పెరిగి పోతుంది.గుండె నొప్పి సమస్యలుమళ్ళీ ప్రారంభ మౌతాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను  సంప్రదించడం అవసరం. రెగ్యులర్ చకప్ చేయించండి... వాతావరణం ఎలా ఉన్నా గుండె వ్యాధులు తో బాధ పడు తున్నవాళ్ళు రెగ్యులర్ చకప్ చేయిస్తూ ఉండాలి. దీనిద్వారా మిమ్మల్ని మీరు మీ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని తద్వారా వేసవి కాలం లో వచ్చే వడ దెబ్బ నుంచి మీ గుండెను కా పా డుకోవాలని సూచిస్తున్నారు. వేసవి కాలం లో వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.                                            

read more
ఎండాకాలం లో ఎదురయ్యే  సమస్యలు...

అసలే ఎండాకాలం ఆపైన ఉడక పోత ఇంకేముంది మీ శరీరంలో ఏమాత్రం నీరు,ఉప్పుశాతం తగ్గిన వెంటనే వ్యక్తి లో నీరసం,అలసట వస్తుంది.ఎండ తాపానికి ఎంతటి ఆరోగ్య వంతుడైనాసరే అతని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల అనారోగ్యానికి సంబంధించి న సమస్యలు వస్తాయి.అందుకే ఎండాకాలం లో ఎక్కువశాతం ఎంతవీలైతే అంత ఎక్కువ నీరు తాగడం మంచిది.వాతావరణం లో ఒక్క సారిగా అదిక చలినుండి , వాతావరణం లో అధిక ఎండ తీవ్రత వేడిమి పెరిగి పోతుంది.ఈ కారణం గానే కొంతమేర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దీనికి కారణం వేడిమి,వేడి గాలుల వల్ల ఎవరి ఆరోగ్యమైన అనారోగ్యానికి గురి కావాల్సిందే. ఎండాకాలం లో మనల్ని వేదించే కటిన మైన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.మీరు ఎండ బారిన పడ్డప్పుడు మీరు ఎండను తట్టుకోవడం కష్టం. అది మీఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలాలో మరణించడం కూడా సంభవించ వచ్చు. ఎండ వేడిమి ఎవరికీ ప్రమాదం ?... గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు. * ఊబకాయం ఉన్న వాళ్ళు * హై బిపి సమస్య ఉన్న వాళ్ళు. * వృద్ధులు,సామాన్యులు యుక్త వయస్కులు,యువతీ యువకులు. * ముఖ్యంగా ఎండలో పని చేసే కార్మికులు.   ఎండ వల్ల వచ్చే సాధారణ సమస్యలు... వేడి వల్ల శరీరంలో చమట పొక్కులు వస్తూ ఉంటాయి. ఇవి చర్మం పై దీర్ఘకాలం పాటు ఎండలో ఉండడం వల్ల చమట పొక్కులు మంట కారణం అవుతుంది. వేడిమి వల్ల చమట పట్టడం వల్ల శరీరంలో మార్పులు రావడం సహజం.శరీరం పై ఎర్రటి పొక్కులు ,మంట దురద వంటి సాధారణ సమస్యలు ఉంటాయి. ఎండాకాలం వడదెబ్బ... శరీరం లో చల్ల బడే తత్వం తక్కువగా ఉండడం వల్ల. కొన్ని నిమిషాల లోనే శరీరపు ఉష్ణోగ్రతలు పెరిగి పోతాయి.అది ఒక్కోసారి తీవ్ర అస్వస్తత కు గురి అవుతారు. శరీరంలో బిపి,షుగర్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల. ఒక్కోసారి కోమా లేదా భ్రమ, గుండె సమస్యలు డీ హై డ్రెషన్ వచ్చి మరణించే అవకాశం ఉంది. ఎండవేడిమి వల్ల అలసట... ఈ పరిస్థితిలో అధికంగా చమట పట్టడం వల్ల శరీరం లో ఉప్పు నీటి శాతం తాగ్గిపోతుంది. ఈ కారణంగా త్వరగా అలిసి పోతారు. అలిసి పోయి నప్పుడు కళ్ళు తిరగడం,దాహం శరీరంలో వేడి పెరగడం తల నొప్పి వంటివి ఉంటాయి. ఎండ వేడిమి కి కండరాలు పట్టుకు పోతాయి ... ఎండ వేడిమి కారణం గా శరీరంలో ఉప్పు నీటి శాత్హం తగ్గిపోతుంది.దీనికారణంగా భరించలేని ఒళ్ళు నొప్పులు క్రామ్ప్స్ అని అంటారు. ఒక్కసారిగా పిక్క పాటయి వేయడం తీవ్రమైన నొప్పి తో గిల గిల లాదిపోతారు.ముఖ్యంగా పొట్ట,చెయ్యి, వీపు వెనుక ప్రాంతం లో తీవ్రమైన నొప్పి తో బాధ పడతారు.ఒక్కోసారి ఎడమ చేయి లేదా కుడి చేయి భుజాలు, మెడనరాలు సైతం తీవ్ర మైన నొప్పి ఉంటుంది. ఎండవేడిమికి కళ్ళు తిరగడం... దీర్ఘ కాలం పాటు ఎండలో ఉండడం వల్ల చాలా సార్లు వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోతాడు. దీనికి కారణం శరీరం లో నీటి శాతం తగ్గడం.వల్ల కూడా కావచ్చు.ఎండ వేడిమి వల్ల కళ్ళు తిరగడానికి కారణం ,తలనొప్పి, లేదా తల తిరగదానికి కారణం  లో బిపి,లేదా లో షుగర్ కూడా కావచ్చు అన్న విషయం గమనించాలి.                                                        

read more