Previous Page Next Page 
అధికారి పేజి 6

 

    "లేదు.... లేదు.... ఆడపిల్లలకి యీ సమాజంలో మానప్రాణాలకు రక్షణ లేదు" విధ్యార్దునిలు అంతా కోరస్ గా నినాదాలిచ్చారు.
   
    మహిళా  కళాశాలలో జరుగుతున్నా ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా మహిళామండలి ప్రెసిడెంటు వర్దనమ్మకు పిలిచారు.
   
    గ్లాసుడు నీళ్ళు తాగి తిరిగి స్పీచ్ ని కొనసాగించిందామె. స్టేజి మీద ఆమెతోపాటు గౌరవ అతిధిగా ఆహ్వానించబడిన ఎ.సి.పి. కుమారి శ్రీకళ కూడా వుంది. ఆమె చిరునవ్వుతో మహిళా మండలి ప్రెసిడెంటు ఆవేశపూరితంగా యిస్తున్న స్పీచ్ ని అలకిస్తోంది . మరోవైపు విద్యార్ధినులలో వస్తున్న స్పందనను క్రీగంట గమనిస్తోంది. ఎంతయినా ఆమె మొదట స్రీ ఆ తరువాతే పోలీసు అధికారి, అయినా ఆమె స్రీ పక్షపాతంగా అ ఫంక్షన్ కు రాకపోయినా, తీరా వచ్చి విన్ను తరువాత ఆడపిల్లల సమస్యల పట్ల అమెలో  తెలియకుండానే కించిత్తు బాధ మొదలుయ్యింది. 
   
    కరతాళ ద్వనులు మిన్నుముట్టాయి. అందరితోపాటు ఎ.సి.పి. శ్రీకళ శృతి కలిపి చప్పట్లు కొట్టింది.

    ఇప్పుడు తనవొంతు వచ్చింది. ఆవేశంగా మైకు అందుకోవాలని వున్నా తను  ఓ పోలీసు ఆఫీసరు అన్న నిబంధనకు కట్టుబడి తనను తాను సముదాయించుకుని ఏమాత్రం బేషణాలకు తావివ్వకుండా, అసలు తన ఫేసులో  ఏ ఫీలింగ్స్ ఎక్సు ప్రెస్  చేయకుండా సాదాసీదా స్రీమూర్తిలా మైకు ముందుకు వచ్చింది ఎ.సి.పి. కుమారి శ్రీకళ.
   
    మైడియర్ సిస్టర్స్ !........ కృషితో నాస్తి దుర్భిక్షమ్  అన్న  నానుడి అందరికీ వర్తిస్తుంది.  మనలో పట్టుదల ఏకాగ్రతవుంటే  మనం సాధించలేనిది ఏమీ లేదు. స్త్రీ ఆబల, సబల, అసహాయురాలు, సమాజంలో అన్యాయాలకి అపచరాలకి బలయిపోయిందని మనమందరం ఏకరువు పెట్టెడనికంటె, ఆడది అబలకాదు, అదిశక్తికి ప్రతిరూపం , ఆటపాటల్లో!  విద్యానికాలలో, వృత్తి ధర్మంలో, కుటుంబ వ్యవస్థలో ఏ రంగంలోనైనా మగవాడికి  ఏ విధంగాను  తీసిపోదని మనందరం ప్రూఫ్ చేసుకునే హక్కులను మనం కాపాడుకునేందుకు సంఘటితంగా ప్రయత్నించాలి . మనలో  ఐక్యత లేనప్పుడు మనం అందరికి చులకన అవుతాం. అందుచేత సమాజంలో స్రీకి జరుగుతున్న అన్యాయాలని అక్రమాలను సమిష్ట బాధ్యతగా మన మందారం ఎదుర్కోవాలి. అలా అని యుద్ధం ప్రకటించమని నేను చెప్పటం లేదు, మన హక్కులను కాలరాస్తున్న వాళ్ళకు కనువిప్పు కలిగేలా చేయాలి. మనల్ని ఎవరో రక్షిస్తారు అని కాపాడుతారని భ్రమపడేకంటే ఆత్మరక్షణార్ధం మనం కరాటే, జూడో వంటి విద్యలను నేర్చుకోవాలి. "మగవాడు మనల్ని  మోసం చేస్తున్నాడు ' అని గొంతెత్తి గోల చేసేకంటే అసలు ఆ అవకాశం మనం మగవాళ్ళకి ఇవ్వకుండా ముందే జాగ్రత్తపడాలి. ఒక విధంగా  మీరంతా అదృష్టవంతులు. మీకు ఉమెన్స్ కాలేజీ వుంది. మంచి వాతావరణంలో మీరు విద్యను అభ్యసిస్తున్నందుకు గర్వపడాలి. కాని చాలామంది ఆడపిల్లలు కో_ ఎడ్యుకేషన్  వున్న కాలేజీలో చదువుతూ నానా హింసలకు, రాగింగ్ కు, గురి అభినందిస్తున్నాను....." ఆమె మాట్లాడుతూనే వుంది. ఇంతలో విద్యార్ధినులలో కలకలం ప్రారంభమయ్యింది. కాలేజీ ప్రిన్సుపాల్ 'సెలైన్స్..... ప్లీజ్ కీఫ్ సైలెన్స్ ' అంటూ మైక్ లో విద్యార్ధినులను ఉద్దేశించి అభ్యర్దిస్తునే వుంది.
   
    "అన్యాయం జరుగిపోయింది మేడం..... ఘోర అన్యాయం జరిగిపోయింది ఎ.సి.పి గారు మీరు  ఈ కాలేజీలో వుండగానే ఆడపిల్ల అత్యా చారానికి గురి అయిపోయింది ఆమె జీవితం బలైపోయింది. ఆడపిల్లలకు ప్రత్యేకంగా కాలేజీ వున్నందుకు మమ్మల్ని అందర్నీ అభినందించి క్షణం కూడా కాలేదు అన్యాయం జరిగిపోయింది...." కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ పరిమళ ఏడుస్తూ అంది.  
   
    ప్రిన్సుపాల్, ఎ.సి.పి తో  పాటు మహిళా మండలి ప్రెసిడెంట్  అందరి ముఖాలు మాడిపోయాయి. 'అసలు ఏం జరిగింది పరిమళా?" ప్రిన్సుపాల్ గిరిజ కంగారుగా డయాస్ దిగి విధ్యర్దునులు వేపు పరిగెత్తింది.  
   
    ఎ.సి.పి. తన వెనుకనే వున్న గన్ మెన్ కి ఏం జరిగిందో క్షణాలలో తెలుసుకురమ్మని సూచనలిచ్చి పంపింది.

    అప్పటికే  ఆ వార్త ఆ నోట ఈ నోట టౌన్ మొత్తం దాహాన లంలా వ్యాపించింది. అప్పటికే కాలేజీ విధ్యార్దినిలు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్డు మీద రాస్తారోకోలు మొదలయ్యాయి. కొందరు ఆందోళనకారులు  బస్సుల మీద అటాక్ చేశారు. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను ఆపి పెట్రోలు పోసి నిప్పు పెట్టారు,. విచ్చిన్న కరశక్తులు., గుండాలు రంగా ప్రవేశంతో టౌన్ లో యుద్ద వాతావరణం నెలకొని వుంది. ఎ.సి.పి  శ్రీకళను విధ్యార్దినులంతా ఘేరాఫ్ చేశారు. ఆమె దిక్కుతోచని స్థితిలో వుంది, బి.హెచ్ .ఎస్ . సెట్ లో నగర పోలీసు కమిషనర్ కి తన అసహాయతను  తెలియజేసి అదనపు బలగాలను పంపవలసిందిగా  వేడుకుంది శ్రీకళ.
   
    అప్పటికే నగర పోలీసు కమిషనర్ విక్రమ్ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించి ఆయా ఏరియాల పోలీసు అఫీసీర్లను రోడ్లమీద అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా చూడవలసిందిగా ఆజ్ఞాపించాడు. అవసరమైతే విచ్చిన్నకర శక్తులపై లాఠీ చార్జీ, కాల్పులు జరుపవలసిందిగా సూచనలిచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS