Previous Page Next Page 
దీప శిఖ పేజి 9

                                    
    అయితే, తను గోపాలం కోసమే కూర్చున్నట్లు మావయ్య మరీ కనిపెట్టేయ్య కుండా ఉండడం కోసం , ఏ వీరేశలింగం గారి వివేక వర్ధిని పత్రికో ముందు వేసుకుని పేజీలు  తిప్పుతూ కూర్చునేది. చూపు అయితే పత్రిక మీద కాని దృష్టి మాత్రం ఎప్పుడు చప్పుడవుతుందా అని వీధి గేటు మీదే!
    ఇలా ఉత్కంట తోనూ, ఉత్సాహోద్వేగాలతో నూ ఎన్ని శలవు రోజులు గడిచి పోయాయో , ఎన్ని ఆదివారాలు దొర్లి పోయాయో?    
    ఓ ఆదివారం --
    "హితకారిణి సమాజం కార్యవర్గ సమావేశం ఉంది" అంటూ పై మీద కండువా వేసుకుని వెళ్ళిపోయాడు మావయ్య.
    గోపాలం వచ్చే టైమయింది. మావయ్య కూడా లేడు ఇంట్లో. తను ఒక్కతే. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏవో భయం, మరేదో కంగారు, అయినా నా మనస్సు కి హాయిగానే ఉంది. "గోపాలం ఇంకా రాడేమిటి బాబూ -- ఇలా ఆలోచనల లో ఓ తియ్యని ఆందోళన.
    చిన్న చప్పుడైతే చాలు వీధి గేటు దగ్గరికి వెళ్లి చూడకుండా ఉండలేక పోతోంది. వెళ్ళడం , నిస్పృహ తో తిరిగి వస్తూ, పక్కనున్న మల్లె తీగ ఆకు ఒకటి విసుగ్గా తెంపి పరధ్యానంగా దాన్ని ముక్క ముక్కలు చేస్తూ గదిలో ఉన్న నిలువు టద్దం దగ్గరికి వెళ్లి నుంచోవడం, అబ్బే ఇది కాదని అదీ అది కాదని ఇదీ చీర మారుస్తూ ఉండడం -- ఇలా ఎన్ని సార్లో !
    అయినా అందమైన చీర అమిరితేనా? ఉహూ!
    ప్చ్!...... ఏవిటో చెప్పలేని వెలితీ , అసంతృప్తి అస్థిమితమూను, ఏవిటిది అంతా?
    మావయ్య ఇంట్లో ఉండగా గోపాలం ఎన్నిమార్లు రాలేదు? మరి అప్పుడున్న ఉత్సాహం - సరదా ఇప్పుడే మయ్యాయి?
    "విజయా!"
    పరధ్యానంగా ఉన్న తన్ను గోపాలం పిలుపు విని ఉలిక్కి పడింది. తల యెత్తి చూస్తె ఎదురుగా నవ్వుతూ గోపాలం.
    తెల్లని పన్నంచు ధోవతి , అందంగా మడచి కట్టిన బెంగాళీ కట్టూ. పచ్చని మెడ చుట్టూ మెత్తగా పరచుకుని అతని విశాలమైన చాతీని దాచలేక భుజాల మీదుగా జారుకుంటున్న తెల్లని సిల్కు లాల్చీ. అ తెల్లని దుస్తులలోంచి మరో దట్టమైన రంగుగా భాషిస్తూ కనిపిస్తున్న అతని పచ్చని శరీర కాంతిని చూస్తూ ఒక క్షణం సర్వమూ మరచి పోయింది తను.
    "మావయ్య లేరూ?"
    ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి అతని నుంచి దృష్టి మరల్చి తడబడుతూ........ "మావయ్యా? .....ఆ....ఉన్నాడు.......అబ్బే........లేడు లేడు ....అలా వీధిలోకి వెళ్ళాడు ' అంది తను.
    "ఆహా!" అంటూ కుర్చీలో కూర్చున్నాడు గోపాలం. తను దగ్గర్లో పూసల కర్టెన్ పట్టుకుని నిలబడి ఉంది.
    చాలాసేపటి వరకూ ఇద్దరూ మాట్లాడలేదు. ఆ అసహజమైన నిశ్శబ్దం ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంది. కాని ఎవరు ముందు మాట్లాడేటట్టు ? తల ఎత్తి అతని కేసి చూసింది.
    ఎంత సేపటి నుంచి అతను తనవేపు చూస్తున్నాడో? చచ్చేటంత సిగ్గు వేసింది. ఒళ్ళంతా కుంచించుకు పోయినట్లయిపోయింది. ఏవిటిలా చూస్తున్నారు?" అని అడుగుదామనుకుంది. కాని ధైర్యం చేసి అలా అడగలేక ఏవిటి మీ కాలేజీ విశేషాలు ?' అని అడిగింది.
    తన కంఠం తనకే క్రొత్తగా గద్గదికంగా వినిపించింది.
    "ఆ......ఏమున్నాయి?.....మామూలే! అంటూ అంతలోనే "ఆ! అన్నట్లు నిన్న మా కాలేజీ లో వ్యక్రుత్వపు పోటీలు జరిగాయి" అన్నాడు గోపాలం.
    "ఆహా? దేన్నీ గురించి మాట్లాడారు?" అంది తను.
    "సబ్జక్టు అయితే మహిళాభ్యుదయము . కందుకూరి వారి సంకర్షణ లు అనుకో కాని దాన్ని గురించి మాట్లాడిన వాళ్ళు బహు తక్కువ."
    "అంటే?"
    "అంటే వీరేశలింగం గారు తలపెట్టిన మహిళా అభ్యుదయాన్నినిర్మించాబోయి కొత్తగా ఈ మధ్య దేశం లోకి వచ్చిన ఆ గ్రామ ఫోను అనే యంత్రం గురించి రైళ్ళ లో ఉంటూన్న కార్బేడు దీపాల గురించి , మానేపల్లి వారి నాటకాలు గురించి, మాట్లాడారు మా విద్యార్ధులంతా"
    వస్తూన్న నవ్వును అపుకొంటూ "అదేమిటి? మహిళాభ్యుదయానికి మానేపల్లి వారి నాటకాలకి సంబంధం ఏమిటి?" అన్నది తను.
    "ఏవిటేవిటి? అది అంతే? కందుకూరి వారి సంస్కరణ లే కాకుండా ఈ గ్రామ ఫోనులూ, నాటకాలూ కూడా సంసార స్త్రీల ని సర్వనాశనం చెయ్యటానికి దాపురించాయి. అంటూ అనర్గళం గా ఏదో ఒకటి అరిచేస్తూ ఓ ఉమ్మడి ఉపన్యాసం ఇచ్చేస్తే సరి....విషయం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు అని అక్కర్లేదు, శ్రోతలకి ఆలోచించు కోడానికి అవకాశం ఇవ్వకుండా అరవగలిగారా లేదా? అంతే -- ఉపన్యాసం లో ఔచిత్యం లేకపోయినా మహోపన్యాసకుడి కిందే లెక్క!........."
    గోపాలం ఇలా చెప్పుకు పోతుంటే తనకి నవ్వు ఆగింది కాదు. పకపకా నవ్వుతూ " అయితే ఇంక మీ స్టూడెంట్స్ ఎవ్వరూ మా ఆడవాళ్ళ కబుర్లవి. వ్రాతల్ని ఆక్షేపించనక్కర్లేదు " అంది తను. గోపాలం కూడా నవ్వేశాడు. ఇలా కాసేపు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నాక కాని, తన గుండె ల్లో దడా, భావాల్లో తొందరా తగ్గి మామూలుగా గోపాలం తో మాట్లాడలేక పోయింది. ఇబ్బంది తగ్గి సంభాషణ కాసేపు సాపీగా సాగేక కాబోలు. అలవాట్లూ, అబిరుచులూ గురించి మాట్లాడు కున్నారు తనూ గోపాలము నూ........
    ..............    ...........
    "ఆ అభిరుచుల్ని పట్టే అలవాట్లు. ఇప్పుడు చూడండి మా మావయ్య కి అస్తమానూ పుస్తకాలూ చదవడం అలవాటు. నాకిలా అడ్డూ అపూ లేకుండా వాగడం అలవాటు. మీకేమో సున్నితంగా

                                          

"ఆ.....అలాగా?.....అవును......నిజమే....."అంటూ ఇటు ఊ కొడుతున్నట్లూ కాకుండా అటు మాట్లాడుతున్నట్లూ కాకుండా గడుసుగా ప్రవర్తించడ అలవాటు" అంది తను. సమాధానం ఏవిస్తాడో నని కొంటెగా అతని కేసి చూస్తూ.
    "అందుకు నేను ఒప్పుకోను. అలవాట్ల కు కారణం అభిరుచులు కాదు. ఆ వ్యక్తీ సాధించదలచు కొన్న లక్ష్యాలు. ఆ వ్యక్తీ చుట్టూ ఉన్న వాతావరణ మూను" అన్నాడు గోపాలం.
    హమ్మయ్యా! ఎలాగైతే నేం అయన చేత నాలుగు ముక్కలు మాట్లాడించగలిగింది.
    "అంటే మీ లక్ష్యం సిద్దించి వాతావరణం మారితే మీ అలవాటు కూడా మారుతుందంటారు -- అంతేనా?"
    "అంటే?"
    "అంటే -- చదువు పూర్తీ అయి ఉద్యోగం లో చేరి, భార్యామణిగారితో కాపురం చేస్తుంటే ఈ ముక్తసరి మాటలూ, ఈ గడుసు ప్రవర్తన లూ తగ్గి స్వేచ్చగా మాట్లాడుతూ సహజంగా ప్రవర్తిస్తారన్న మాట-- అవునా?
    అంత చనువు తీసుకుంటుందని ఊహించ లేదేమో! తీరా తను అలా మాట్లాడేసరికి గోపాలం కంగారు పడ్డాడు...."ఆహా ....నా అభిప్రాయం అది కాదు.......అయినా వాతావరణం మార్పుకి వివాహమే కావాలేమిటి ?' అన్నాడు కొంచెం తడబడుతూ.
    "వాతావరణం మారడానికి వివాహం ఒక్కటే కారణం అని నేను అనను కాని, వివాహంతో మాత్రం పరిస్థితి మారి తీరుతుంది. అప్పుడు మీ ప్రవర్తన లో కూడా మార్పు వస్తుంది తప్పకుండా. లేకపోతె ఎలా?....ఇప్పుడు నాతొ ఉన్నట్లే రేపు మీ భార్యతో కూడా ముభావంగా ముక్తసరిగా మాట్లాడితే ఆమె ఊరుకోవద్దూ?...."
    "అసలు నేను పెళ్లి అంటూ చేసుకుంటేగా ఆ సమస్య తల ఎత్తెది?"
    "అబ్బో- ఇలా అనేవాళ్ళే , కావలసిన స్నేహితులకి కూడా తెలియకుండా గుట్టు చప్పుడుగా చేసుకుంటారు " అంది తను.
    "అభయం అక్కర్లేదు. నీకు తెలియకుండా నా పెళ్లి జరగదు -- సరేనా?' అన్నాడు చటుక్కున గోపాలం.
    అంత ఛలోక్తి గా గోపాలం దగ్గర్నుంచీ సమాధానం వస్తుందని అనుకోలేదేమో -- ఆ మాటలతో బిత్తర పోయి సంభాషణ ను అంతటితో అపుసేసింది.     
    తను ఆ రోజల్లా అతను అన్న మాట గురించి ఆలోచిస్తూ కూర్చుంది. "నీకా భయం అక్కర్లేదంటే?" ఎవరి తోటో అతనికి వివాహం అవుతుందని నేను భయపడుతున్నాననే కదా అర్ధం ?...."నీకు తెలియకుండా కాదులే!" అంటే ?.... అతని వివాహం లో ప్రముఖ పాత్ర నాకు ఉంటుందనా?.... ఆలోచించిన కొద్దీ ఎన్ని అర్ధాలు వస్తున్నాయి ఆ మాటలో !....ఎంత తెలివిగా ఈ రెండు ముక్కలూ అని తన నోరు కట్టేశాడు ?....ఈ అర్ధాలన్నీ ఉద్దేశించే అన్నాడా ?....ఏవైనా పైకి అలా కనిపిస్తాడు కాని మహా చెడ్డ గడసరి  ఇలా ఆలోచిస్తున్న విజయ దూరంగా ఉన్న చెట్టు మీంచి వినిపించిన చప్పుడు కి ఉలిక్కిపడి అటు చూసింది చింత చెట్టు గుబుర్లో తెల్లని కొంగ కాబోలు కలత నిద్దర్లో లేచి చేసిన రెక్కల చప్పుడు అది. తన కంగారుకి విజయ నవ్వుకుంది. తిరిగి సర్దుకుని కొమ్మ మీద ముడిచి పెట్టుకుంటూ పడుకొన్న కొంగ నల్లటి చెట్ల ఆకుల మధ్య వెన్నెల్లో తెల్లగా కనిపిస్తున్న దొంతర మల్లె పువ్వుల గుత్తి లాగ ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS