ఈరీతిగా వ్రాయ మొదలిడినచో ఆ నలువది నాళ్లలోని ముచ్చటలే ఒక గ్రంధమగును. తరువాత నాల్గు సంవత్సర ములకు నేను తిరుపతిలో శ్రీ శాస్త్రిగారి పునర్ధర్సనము చేసినపు డచటి సంరంభ మింతిటికంటె మిక్కిలిచ్చుగానుండెను. తిరుపతిలో ట్రీట్మేంట్ల పద్ధతి కొనసాగినతీరు చూడఁగా మానవకోటికి అమృతత్వసిద్ధి యబ్బనున్నది గాబోలు ననిపించెడిది. తిరుపతిలో నున్నపుడు జబ్బులను 'పో' యన్న పోవునట్లు తోచెడిది. కాని మదరాసులో చూడనిదుర్ఘటనలు కూడ తిరుపతిలో జరుగక పోలేదు. డాక్టరు లాస వదులుకొన్న చివరి ఘట్టములో కొంద ఱచ్చటికి చేరిన వారు కలరు. అట్టి వారిని మాత్రము మృత్యువున కేల వదలవలెనని శ్రీ శాస్త్రిగారు సాహసించి ట్రీటు చేసెడి వారు. వారిలో కొందఱు సురక్షితులై నేఁ టికిని సుఖజీవనము నెఱపుచున్న వారు కలరు. కాని కొన్నింట ట్రీట్మేంటు వలన నుపయోగము కన్పించుచు నే ఆయువు తిరెడిది. నూటికి నూరుగురను సాధ్యాసాధ్యాదశలయం దన్నింటను రక్షించుటే జరిగినచో నిక సాధన పూర్తి యయినట్లే కదా! అట్టి శుభముహుర్త మిప్పటికి రాలేదు. ఎప్పటికి వచ్చునో!
ఆధ్యాత్మిక శక్తి వలన శారిరకరుగ్మతలు మాన్పనగు నని పలువురు విశ్వసింపరు. నమ్మకుండుటయే న్యాయ్యము. బలవ త్తర ప్రమాణము లున్ననే గాని విశ్వసింప వీలుగాని క్రొత్త విషయ మిది! తొలుత టెలిఫోను పద్ధతిని ప్రదర్శించినపుడు అచట నున్న ఒక గొప్ప రాజకీయ వేత్త దాని నొక గారడీ యని నిరసించె నట! తాను మాటాడుచు,ఆ కంఠద్వ ని మఱొకరినుండి వచ్చుచున్నట్టు చేయు కళ (ventrilo quism) అనె నట పాశ్చాత్య భౌతిక శాస్త్ర పరిశోధకులు క్రొంగ్రొత్త విషయములను కని పెట్టినపుడు పలుమారులు వారి నప్పటి పండిత ప్రపంచము హసించుటయో, హింసించుటయో జరగెడిది. గెలీలియో నుండి జగదీశబోసు వఱకు శాస్త్రపరిశోధనా చరిత్రలో నిట్టి సన్నివేశములు పెక్కుగలవు. కాని అభూతజ్ఞాతము లగు విషయములను సునిశిత ముగను, పలుమారులును సంశోధింపక యే యొప్పుకొనుట వలన గూడ ఒప్పుమి గలదు. ప్రత్యేకించి ఆధ్యాత్మిక ప్రపంచమునకును, భౌతిక ప్రపంచమునకును నిచ్చెనలు వేయుపని చాల ప్రమాదభూయిష్ఠమైనది. మార్గమా క్రొత్తది.దారి చూపువారా లేరు. ఈ దారి ఎటకు గొంపోవునో తెలియదు. మన యాయుష్కాల ములో గమ్యస్దానమును చేరగలమో లేదో తెలియదు. అందుచే నీ రంగములోని యన్వేషకునకు
"అసతో మా సద్గమయి
తమసో మా జ్యోతి ర్గమయ
మృత్యో ర్మామృతం గమయ"
బృహ. ఉ. 1, ౩. 28.
అను నిత్యపధికుని ప్రార్ధన మొక్కటే తోడు,
క్రీస్తు ప్రభువుగూడ ఆత్మశక్తి చే అనేకులను నిరామయుల నొనర్చెనని విందుము. క్రైస్తవులలో నిట్టి నమ్మకమును, అనుభవములును నేఁటికిని గలవు. సెంటు బొర్నాడొటే గీతము (The song of st Berna dotte) అను నవలలోని వాస్తవిక కధయంతయు నిట్టిదే. ఫ్రార్సులోని LOURDES అను పట్టణములోని మఠము వద్ద నిత్యము అనేక దేశముల నుండి రోగులు వచ్చి ప్రార్దనలో పాల్గొని నిరోగు లగుదురట! అచట ప్రవేశము బడయునపుడే రోగిని ఒక డాక్టర్ల సంఘము పరిశీలించి రోగవివరములను వ్రాసి యుంతు రట! పిమ్మట వారు వెడలిపోవు నప్పటి శరీరస్ధితిని పరిశీలించి అది ఎంత వరకు నిజ మగుమార్పో కాదో నిర్ణయించి రికార్డు చేయుదు రట.జీవవైద్య శాస్త్రములలో నగ్రశ్రేణికి జెంది నోబెల్ బహుమతి బడసిన అలెక్సిస్ కెరోల్ అను మహనీయుఁడు MAN THE UNKNOWN అను గ్రంధములో నిట్టి చికిత్సను గూర్చి ఇట్లు వ్రాసినాఁడు.
"... The most important cases of miraculous healing have been recorded by the Medical Bureau of Lourdes. Our present cmnception of the influence of prayer upon patho logical lesions is based upon the observation of patients who have been cured almost instantaneously of various affecttons, osteites,suppurating wounds, lupus, cancer, etc- The only condition in dispensable to the occurence of the phenomena is prayer. But there is no need for the patient himself to pray, or even to have any religius faith. It is sufficient that some one around him bein a state of prayer. Such facts are of profound significance. They show the vality of certain relatins,of srill unknpwn nature between psychological and organic processes, eductirs and sociologoists have almost always neglected to study.They open to man a new world....."
నేఁటి విజ్ఞాన పరిశోధన వలన పెక్కు ప్రకృతిరహస్యములు వెల్లడి యయినవి. పదమూఁడు, పదునాలుగు శతాబ్దములలో శాస్త్రపరిశోధనతీరును పరికించిన వా రెవరును నేఁటి విజ్ఞాన సముపార్జన సాధ్య మని యూహించియుండరు. నేఁటి విజ్ఞానపరిశోధన జీవ జడ పదార్ధములను వేర్పఱచు కక్ష్యాంతరములోనికి జేరుచున్నట్లు తోచును. మరియొక యడుగు వైచినచో నది విరాట్టునే చేరు నేమో! శాస్త్ర పరిశోధకులు వారి కవసర మయినపుడు పరిశోధనా మార్గములను,పరికరములను మార్చుకొనుచునే యున్నారు. ఈ నూతనాన్వేషణకు వలయు మార్పులను జేసికొనుట వారి ప్రజ్ఞకు మించినది గాదు.కాన వేరగిపడి వేనిని త్రోసి వేయవలదని మనవి!
