"ఏమాత్రం తెలుసుకోలేరు. ఈ ప్రకృతితో పాటు మన సోదరసోదరీ సంబంధం వుంది. ఇక ఆంగ్లేయులతో సంబంధం, బార్యాభర్తల సంబంధం. మన జన్మతా ఆత్మీయులం, స్వబావసిద్దంగా కూడా మనందరం ఒకటే. మనం అందులో నూతనత, విచిత్రత, సూక్ష్మబావచ్చాయ చూడగలుగుతున్నాం. ఒక విధంగా చేతనాశూన్య అనురాగంలో లీనమయి వుంటున్నాం. ఆంగ్లేయులు ప్రకృతి బయటనుంచి లోపలకు ప్రవేశిస్తారు. వారు తమ స్వాతంత్ర్యాన్ని రక్షించుకోగలరు. అందువల్ల వారి పరిచయం ఎంతో మనోహరం. వారి సమాగమం యెంతో మధురం. కొత్తకోడలులాగా ప్రకృతిని తన అధికారం కిందకు తీసుకురావడానికి పనిచేస్తారు. ప్రకృతికూడా సమ్మోహితమవుతుంది. వారు ప్రకృతిని ముందుగానే జడపదార్దమని భావిస్తారు. హఠాత్తుగా ఒక రోజున త్రుళ్లిపడే ప్రకృతి యౌవ్వనాన్ని చూసి దాని అపరిమిత ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కనుగొంటారు. మనం అన్వేషించలేదు. దీనికి ఏకైక కారణం దానికోసం యెన్నడూ మనలో జిజ్ఞాస వుత్పన్నం కాకపోవడమే" అని అన్నాను.
పరస్పర సంఘర్షణవల్లనే ఒక ఆత్మ ఇంకొక ఆత్మను చక్కగా గుర్తించగలుగుతుంది. అప్పుడే అది సమాగమ ఆధ్యాత్మికతా పూర్ణ రూపం అనుభవించగలుగుతుంది. ఒకానొక కవి రాశాడు: "ఈశ్వరుడే మాతృహంశ. పితృహంశ భార్యాభర్తల రూపంలో విభక్తమైంది. ఈ విభక్తహంస నొకదాని నొకటి అనివార్య ఆనందం ద్వారా ఆకర్షించుకుంటూ వుంటాయి. కాని ఇది ఆచ్చాదం కాకపోతే వాటిలో యింతగా ప్రేమే వుండదు. మైత్రీకాంక్షలోనే అధిక ఆధ్యాత్మికత వుంది.
మనం భూమిని తల్లి అంటూ సంభోధిస్తాం. రాతిని పూజిస్తాం. నీడనిచ్చే రావి, మర్రిచెట్లను తండ్రినిలాగా గౌరవిస్తాం. కాని ఆత్మలో వాటి ఆధ్యాత్మికత అనుభవం కాలేదు. మనం కల్పన ద్వారా దానిని ప్రతిష్టించుకోవచ్చు. సుఖంకోసం శిరంవంచి మనస్కరిస్తాం. కాని ఈ మూల ఆధ్యాత్మికతా సంబంధం కేవలం సౌందర్య, ఆనంద సంబంధం. అది సువిధ, అనువిధ సంబంధం కాదు. ప్రవహించే ఆత్మకు ఆనందం చేకూరుకున్నప్పుడే ఆధ్యాత్మికత వుంటుంది. ఏదో విధంగా మనం దానిని ఏదో ఒక మూర్తిలో బంధించడానికి కుబేరరాశిని ప్రార్దిస్తాం. సౌందర్య రహిత మోహం అజ్ఞానతా మాత్రంగానే వుంటుంది. మనం మన దేవీ దేవతలను జడమూర్తులుగా భావించసాగుతాం.
ఓ గంగామాతా! నేను నిన్ను ధనం, స్వర్గం, ఇమ్మని కోరను. కోరినా దొరికేది కాదు. కాని బాల్యంనుంచి ఇన్ని రోజులుగా సూర్యోదయ సూర్యాస్తమాన సమయంలో చీకటి రెక్కల మీద అస్పష్టమైన వెన్నెలలో వర్షాకాల మేఘాలచేత ఆచ్చాదితమయిన మధ్యాహ్నంలో నాకు అవర్ణనీయ ఆనందం చేకూరుతుంది. యీ నా దుర్లభ జీవితానికి ఆ ఆనందం జన్మజన్మాంతరం లభించాలని చేతులు జోడించి ప్రార్దిస్తాను. భూమి నుంచి నేను యావజ్జీవం అనుపమ సౌందర్యం ప్రోగుచేసుకున్నాను. ఇహలోకంలోకి వెళ్లే సమయంలో వికసించే కమలం ఎదుటి పూతను చేతితో తీసుకుని వెళ్లగలగాలని, దానిలో నా ప్రియురాలిని కలుసుకుంటే ఆమెకు అనుపమ కానుక సమర్పించి జీవితం సార్ధకం చేసుకోవాలని నా ప్రార్దన."
స్త్రీ పురుషులు
పవన్ దేవ్ ఒక జటిల సమస్యను మా ముందు వుంచాడు. అతను ఇంగ్లీషు సాహిత్యంలో గద్య పద్య వాక్యాలు రెంటిలోనూ నాయకా నాయికల గొప్పతనం సమానంగా వికసించడం కానవస్తుంది. డెస్టమోనా ప్రతిభ ముందు ఇయాగో, ఒధెల్లోల ప్రతిభ ఏమాత్రం తీసిపోదు. క్లియోపాట్రా అయిన తన శ్యామల బంధనజాలంలో బంధించగల సమర్దురాలు, కాని లతాపాశంతో బిగించిన జయ స్తంభంలాగా ఆంటోని శ్రేష్టత ద్యోతకమైంది. లేమర్ మూర్ లో నాయిక తన సరళ సుకుమార సౌందర్యంతో మన మనస్సులను సమ్మోహితం చేస్తుంది. రేయెన్స్ వుడ్ విషాద నాయకుని వేపునుంచి మన దృష్టి మరలదు; కాన బెంగాలీ సాహిత్యంలో స్త్రీకి ప్రాధాన్యం కానవస్తుంది. కుందనందిని, సూర్యముఖి ముందు నగీంద్రుని ప్రభ బొత్తిగా కాంతివిహీనమయ్యింది. రోహిణి భ్రమరలముందు గోవిందలాల్ గోచరించడు. జ్యోతిర్మయి కపాల కుండల ముందు నందకుమార్ ప్రభ మినుకు మినుకు మంటూ తిరిగే మిణుగురు పురుగులాంటిది. ప్రాచీన బెంగాలీ కావ్యాలలో కూడా యిదే గోచరిస్తుంది. విద్యాసుందర్ రచనలలో విద్య, మాలినీ మాత్రమే సజీవ మూర్తులు. విద్యాసుందర్ చరిత్రలో సారవంతమైన వస్తువులేదు కవి కంకణ విశాలక్షేత్రంలో ఉబ్బితబ్బిబయి స్వేచ్చగా సంచరిస్తాడు. వ్యాధుడు వికృత బృహత్ స్థాణు మాత్ర ధనపతి. కాని అతని కొడుకు నిరర్దకుడు. బెంగాలీ సాహిత్యంలో పురుషులు శంకరునిలాగా ధూళిలో నిశ్చలంగా పొర్లుతుంటారు. స్త్రీలు బంగారంలాగా సజీవభావాలతో విరాజిల్లుతుంటారు. దీనికి కారణమేమిటి?' అని ప్రశ్నించాడు.
పవన్ దేవ్ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నిర్ఘరిణీదేవి వ్యాకుల పడింది. ప్రకాశవతి మేజాబల్లమీద పుస్తకాన్ని చేర్చి చూస్తూ ఇటువేపు ధ్యాస వుంచనేలేదు.
పృద్వీరాజ్ "మీరు బంకింబాబు ప్రసిద్ద నవలలను గురించి చర్చించారు. వాటిలో మనసుకే ప్రధానం. కర్మ మీద ప్రధానం కాదు. మనో జగత్తులో స్త్రీలకే అధిక ప్రాధాన్యం వుంటుంది. కర్మ జగత్తులో పురుషునికి అధికారం యెక్కువ. హృదయతృప్తిలో స్త్రీ పురుషుడు. స్త్రీ ముందు ఎలా నిలువగలుగుతాడు? కార్యక్షేత్రంలో పురుషుని చరిత్ర పూర్ణ వికాసం పొందుతుంది." అని అన్నాడు.
నిర్ఘరిణి మౌనం మానివేసింది. ఆమె పుస్తకాన్ని అవతలవుంచి వుదాసీనతా భావం విసర్జించి, "దుర్గేశనందినిలో విమల చరిత్ర ఏ కార్యంలో వికసించలేదు? ఇంత తత్పరత, ఇంత నిపుణత, అటువంటి పూనికమీద చర్చించిన నవలలో యెన్నింటిలోని నాయకులలో పొడగట్టుతోంది? ఆనందమఠం కర్మ ప్రధాన నవల. సత్యానంత, జీవానంద, భవానంద యిత్యాది సంప్రదాయక పాత్రలు పనిచేశారు. నిజం. కాని వారిపని కవి వర్ణనమాత్రమే. ఎవరి చరిత్రలో కావ్యవేదితపూర్ణ, వాస్తవిక వికాసం చెందుతుందో ఆతని చరిత్ర శాంతచరిత్ర. దేవీ చౌధరాణి నవలలో ఎంత కర్తృత్వతను పొందిందో స్త్రీ? కానీ ఆమె ప్రభుత్వంలోనేనా? ఎన్నటికీ కాదు," అని అన్నది.
పవన్ దేవ్, "భాయీ పృద్వీరాజ్! తర్కశాస్త్ర సరళ రేఖద్వారా సకల వస్తువులను నియమిత రూపంలో శ్రీశబ్దం చేయలేం. చదరంగ పటంలో యెరుపు, నలుపు రంగుల కాయలను నడపగలుగుతాం. అవి ప్రాణంలేని కొయ్యవస్తువులు. కాని మానవచరిత్ర అంత సాధారణ వస్తువుకాదు. నువ్వు అనేక యుక్తుల బలంతో భావప్రధానం, కర్మ ప్రదానం యిత్యాది అభేద్యసీమలను యెందుకు నిర్దేశించలేదు? కాని విశాల ప్రపంచ విచిత్ర కార్యక్షేత్రంలో అంతా తలకిందులయి పోయింది. సమాజ లోహపాత్రమధ్య జీవితాన్ని వెలగకపోతే మానవుల శ్రీ శీవిభాగం సమానభావంతో స్థిరంగా వుండిపోతుంది. కాని జీవిత శిక్షణ ప్రజ్వలింపగానే చుయ్ చుయ్ మంటూ సంపూర్ణ జీవిత చరిత్ర జ్వలిస్తూంటుంది. కొత్త కొత్త ఆశ్చర్యజనక విచిత్ర సీమలను నిర్మిస్తుంటుంది. సాహిత్యం పరివర్తనశీల మానవజగత్తుకు చంచల ప్రతిబింబం. దానిని మసాలోచించే శాస్త్ర విశేషాలతో బంధించ చూడడం వ్యర్దయత్నం. మనోవృత్తిలో స్త్రీయే ప్రదానం. ఈ విషయంలో యెవరూ సాధికారంగా చెప్పలేరు. ఒధెల్లో మనో ప్రదాన నాటకం. కాని అసమనాయికా హృదయావేశ ప్రపంచ ప్రంబంధంగా యెంచుకున్నది? లియర్ రాజు హృదయవేదన భయంకరంగా యెంచుకున్నది?" అని అన్నాడు,
గగన్ దేవ్ హఠాత్తుగా వ్యాకులపడి, "ఓహో! మీరు వ్యర్దంగా తర్కించడంలో నిమగ్నులైనారు. అయినా గంభీర పూర్వక సమాలోచన చూస్తే కర్మమాత్రమే స్త్రీ ధర్మమని, కావ్యక్షేత్రం పరిత్యజిస్తే స్త్రీ కి వేరే స్థానం లేదని తేలుతుంది. యదార్దపురుషుడు యోగి వుదాసి, ఏకాంతవాసి. కైకడియా ఎడారిలో పండుకుని గొర్రెలకాపరి ఒంటరిగా ఆకాశంలోని నక్షత్రాల గతిని చూస్తూ నిరీక్షిస్తుంటే అతనికి ఆనందం యెలా ప్రాప్తిస్తుంది? ఏ స్త్రీ అయినా ఈ విధంగా తన కాలం వృధా చేసుకుంటుందా? విశుద్ద ఆత్మ మీదనే కేవలం ధ్యానం వుంచితే ఆనందం జనిస్తుంది. దీనిని ఏ స్త్రీ బహు మూల్యమైనదని తెలుసుకుంది?నిరర్దక జ్ఞానం ప్రాప్తిలో యే స్త్రీ తన కాలం పోగొట్టుకుంటుంది? పృద్వీరాజ్ చెప్పినప్రకారం మానవుడు వాస్తవానికి కార్యశాలి. మానవ సమాజం రీతి నవీనతత్వం, నవీనభారం ఆవిష్కారం కావు. నిర్జనతలో, సమయంలో జ్ఞానం ప్రకాశిస్తుంది. భావం ఆవిర్బవిస్తుంది. యదార్ద మానవుడు నిర్జన ప్రదేశంలో నివసిస్తాడు. కర్మ వీరుడయిన నెపోలియన్ కూడా యెపుడూ తన పనిలో లీనం కాలేదు. అతను లోకంలోకూడా నివసించాడు. నిబిడ నిర్జనతలో తన భావరూప ఆకాశంనుంచి బెదిరించేవాడు. అతను ఒక బృహత్ దృష్టికోణం ద్వారా రక్షణపొంది భీషణ కార్యక్షేత్రంలో కూడా నిర్జణతను అనుభవించే వాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో సేనా నాయకుడు కాని అతని భీషణసంహార క్రీడలో కూడా అతనితో సమానుడైన ఏకాంతవాసి యెవరు?వారు పనిచేసేవారు, లేదా ధ్యానించేవారు. స్త్రీ కూడా వాస్తవానికి కర్మిణి. ఆమె పనిమధ్య వ్యవధి ఏమీ వుండదు. ఆమె పనిలో ఒక్కసారిగా లీనమవుతుంది. ప్రస్తుతః ఆమె లోకాలయంలో నివసిస్తుంది. ప్రపంచాన్నీ రక్షిస్తుంది. స్త్రీయే నిజానికి సంపూర్ణ సహాయం చేయగలుగుతుంది. ఆమె పూర్ణరూపం నుంచి చలిస్తుంది. ఆమెకు వేరే అస్తిత్వం లేదు!" అన్నాడు"
