Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 4


    "మహిళల పట్ల మగవాడి క్రూరత్వం గురించి నేను కొన్ని పరిశోధనలు చేస్తున్నాను. నేనొక సంఘ సేవకుణ్ణి. నా వద్ద నువ్వు సిగ్గు పడనవసరం లేదు. నేనొకసారి నీ శరీరాన్ని చూసి వెళ్ళిపోతాను...."
    అయన ఉద్దేశ్యం అరుణ కర్ధమైంది. అయినా అర్ధం కానట్లు ....' చూశారుగా , వెళ్ళండి!" అంది.
    అప్పుడు చెంగల్రావు తన ఉద్దేశ్యాన్నామే కర్ధంయ్యేలా చెప్పాడు. అరుణ అంగీకరించలేదు. అయన మృదువుగా హెచ్చరించాడు. ఆమె వినలేదు.
    "మాసేజ్ పేరుతొ వ్యభిచారం చేసే నువ్వు శ్రేయోభిలాషిగా వచ్చిన నావద్ద బెట్టు చేయడం తగని పని...." అన్నాడు చెంగల్రావు.
    "నీకేవ్వరో తప్పుడు సమాచారం అందజేశారు. నేను సామాన్య గృహిణిని. వ్యభిచారిణి కాను. నా జోలికి రాకు...." అందామె చేతులు జోడించి.
    అప్పుడు చెంగల్రావు లాల్చీ జేబులోంచి చిన్న పిస్తోలు తీసి  ఆమెకు గురిపెట్టి -- "నేను చెప్పినట్లు వింటావా చస్తావా?" అన్నాడు.
    ఆమె హడలిపోయింది. మళ్ళీ మళ్ళీ బ్రతిమాలుకుంది. అయన చలించలేదు. చివరికి -- "నన్ను తాకనని మాటివ్వాలి...." అంది.
    "ఎప్పుడో యిచ్చానామాట. నువ్వే నమ్మడం లేదు.
    ప్రాణ భయం కొద్దీ ఆమె అతడి మాటలనప్పుడు నమ్మింది.
    చెంగల్రావు ఆత్రంగా ఆమె వంక చూస్తున్నాడు. ఆమె కన్నీళ్ళకు చలించలేదు. అయన కళ్ళలో వింత వింత భావాలు ....
    అరుణ అయన ముందు నగ్నంగా నిలబడింది. చెంగల్రావు తనామెకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
    "థాంక్యూ వెరీ మచ్ .....నేను వెడుతున్నాను ...." అంటూ లేచాడాయన.
    అయన ఉద్దేశ్య మేమిటో అర్ధం కాక తెల్లబోయి చూస్తోంది అరుణ.
    చెంగల్రావు సరిగ్గా తలుపులు తీయబో'తుండగా బెల్ మ్రోగింది.
    అయన తలుపు తీసేసరికి యెదురుగా ఓ యువకుడున్నాడు. అతడు చెంగల్రావును చూసి తెల్లబోయి --- "ఎవరు మీరు ?" అన్నాడు.
    అయన బదులివ్వలేదు .
    "ఎవరు మీరు?" అన్నాడతడు మళ్ళీ.
    చెంగల్రావు అతణ్ణి తోసుకుని బయటకు వెడుతూ -- "నీ పక్క గదిలోనే వుంటున్నాను. నాతొ మాట్లాడాలను కుంటే అక్కడకురా ----" అన్నాడు.
    అతడు తెల్లబోయి అలాగే నిలబడి పోయాడొక్క క్షణం . తర్వాత లోపల అడుగుపెట్టి తలుపు వేసి --"అరుణా!" అన్నాడు.
    అరుణ అప్పుడతడికి కనపడుతూనే వుంది. ఆమె హడావుడిగా బట్టలు వేసుకుంటోంది.
    'అరుణా!" అన్నాడతడు. అది పిలుపు కాదు. అరుపు.

                                    8
    "హలో !" అన్నాడు చెంగల్రావు.
    "నేనురా ఇడియట్!" అన్నాడు ఇందు భూషణ్.
    "ఏమిటి విశేషం ?"
    "నువ్వు చెప్పిన ముగ్గురు మహనీయులు అరెస్టయ్యారు. ఏ క్షణం లోనైనా అరెస్టు చేయడానికి వారి మీద తలకు మోపెడు నేరారోపణ లున్నాయి...."
    "మరైతే ఇన్నాళ్ళూ ఏం చేస్తున్నారు మీరంతా?
    "ఇప్పుడైనవాళ్ళ జోలికి వెళ్ళకపోదును. నీకోసం ."
    "ఇది చాలా దారుణం ...." అన్నాడు చెంగ ల్రావు.
    'అందుకే కదా నేను ఫూల్ ప్లస్ రాస్కెల్ నని ఒప్పుకుంటున్నాను...."
    "చాలా థాంక్స్ రా...."
    "ఏమిటి -- ఒప్పుకున్నందుకా ?"
    "కాదు -- నాకోసం ఈ సాయం చేసినందుకు...." వెంటనే ఫోన్ ద్వారా చెప్పినందుకు..."
    "నీకు ఫోన్ చేసింది ఈ విశేషం చెప్పడానిక్కాదురా ఇడియట్...."
    "మరెందుకు ?"
    "నువ్వెప్పుడోస్తావా అని మీ వదిన ఇంటి దగ్గర యెదురు చూస్తోంది ?"
    "అందుకు సమయ మింకా రాలేదు. వేచి వుండాల్సిందే...." అని ఫోన్ పెట్టేశాడు చెంగల్రావు.
    సరిగ్గా అప్పుడే గదిలో బెల్ మ్రోగింది.
    చెంగల్రావు తనే లేచి వెళ్ళి తలుపు తీశాడు.
    బయట అరుణ, ఆమె ప్రియుడు వున్నారు.
    "లోపలకు రావచ్చా?" అన్నాడు అరుణ ప్రియుడు.
    "ష్యూర్!" అంటూ లోపలకు దారి తీసాడు చెంగల్రావు.
    అరుణ లోపలకు వచ్చింది. అరుణ ప్రియుడు తలుపులు వేసి, తను లోపలకు వచ్చాడు.
    "కూర్చోండి --" అన్నాడు చెంగల్రావు.
    సోఫాల్లో ముగ్గురూ కూర్చున్నారు.
    "నా పేరు దక్షిణామూర్తి. కోపం వస్తే దయాదాక్షిణ్యాలుండవని నా మిత్రులంతా అంటారు...."
    'అయితే ?"
    "నాకిప్పుడు కోపం వచ్చింది...."
    "ఎందుకు ?"
    "నువ్వు నా భార్య అరుణ పై అత్యాచారం చేశావు "
    "లేదు...." అన్నాడు చెంగల్రావు.
    "అలాగని నీపై పోలీసు కేసు పెట్టబోతున్నాను."
    చెంగల్రావు నవ్వి - "అందుకు నోటి మాట చాలదు. ఋజువులు కావాలి. భార్యని చెప్పుకుంటున్న నీ ప్రియురాలు అరుణను నేను తకనైనా తాకలేదు --" అన్నాడు.
    "ఆ విషయం అరుణ చెప్పింది. ఆమెను నేను నమ్ముతున్నాను. అయినా నిన్ను క్షమించలేను...." అన్నాడు దక్షిణామూర్తి.
    "నా జీవితం నీ క్షమ పై ఆధారపడి లేదు...."
    "అడిప్పుడే తెలుసుకుంటావు...." అంటూ అతడు జేబులోంచి బటన్ నైఫ్ తీసి -----"ఇదిప్పుడే నీకోసం కొని తెచ్చాను ...." అన్నాడు.
    "డబ్బులు వేస్టు....." అన్నాడు చెంగల్రావు నిర్లక్ష్యంగా.
    "ఇప్పుడు అరుణ నీపై అత్యాచారం చేస్తుంది. నువ్వు ప్రతిఘటిస్తావు. ప్రతిఘటించవు --- కత్తి నీ వంటిని పలకరిస్తుంది....."
    "ఎందుకీదంతా?"
    "నువ్వు అరుణ పై అత్యాచారం చేయబోయావనడానికి ఆమె శరీరం పై నిదర్శనాలు కావాలిగా ...." అన్నాడు దక్షిణామూర్తి.
    "అనవసరంగా కష్ట పడుతున్నావు...." ఆన్నాడు చెంగల్రావు.
    "నీవంటి వాడికి బుద్ది చెప్పడానికి ఈమాత్రం కష్టపడక తప్పదు. ఆడది మీదకు వస్తోంది కదా అని అత్యాచారం చేయడానికి ప్రయత్నించకు. కత్తి నిన్ను క్రూరంగా పలకరిస్తుంది...." అన్నాడు దక్షిణామూర్తి.
    "సరే -- వన్ టూ త్రీ అనేదాకా వ్యవధియ్యి నాకు.
    "ఊ"అన్నాడు దక్షిణా మూర్తి.
    చెంగల్రావు వెంటనే గట్టిగా - "వన్ ....టూ....త్రీ .... అన్నాడు.
    అంతే!
    పక్క గదిలోంచి యిద్దరు కండలు తిరిగిన వస్తాదులు వచ్చారు. ఇద్దరూ సన్నగా వున్నారు. వంటి మీద చొక్కాలు లేవు.
    దక్షిణామూర్తి ఏం జరుగుతున్నదీ తెలుసుకునే లోపు ఒక వస్తాదు అతడి వైపు ఏదో విసిరాడు. అది గురిగా అతడి చేతికి తగిలింది. కత్తి అతడి చేతిలోంచి జారి పడింది.
    "వాళ్ళు కత్తులాంటి వాళ్ళు, తాము కత్తులు వాడరు. యెదుటి వారి కత్తులకు భయపడరు. వంగి కత్తి తీయడానికి ప్రయత్నించావంటే మాత్రం ముందు నువ్వే వెనక్కి పడతావు...." అన్నాడు చెంగ ల్రావు.
    అప్పటికి వస్తాదు లిద్దరూ దక్షిణామూర్తి సమీపించారు.
    దక్షిణామూర్తి ముఖంలో భయం కనపడింది.
    "వారినేమీ చేయవచ్డు...." అంది అరుణ కంగారుగా.
    చెంగల్రావు నవ్వి --"వాళ్ళిద్దరితో నాకు వేరే పని వుంది. మీరిద్దరూ మర్యాదగా ఇక్కడ్నించి వెళ్ళిపోతే ఎవ్వరూ మీ జోలికి రారు...." అన్నాడు.
    అరుణ దక్షిణామూర్తి పక్కకు వెళ్ళి - "పదండి వెళ్ళిపోదాం -" అంది.
    "నువ్వు నా భార్యను అవమానించావు. నేనిది మర్చిపోను...." అన్నాడు దక్షిణామూర్తి.
    "ఆమె నీ భార్య అయుంటే నేను అవమానించి వుండేవాడిని కాదు. నువ్వే ఆమెను భార్య అని -- ఆడదాన్నే అవమానిస్తున్నావు....'
    అరుణ కంగారుగా - "నా గురించి మీకేం తెలుసనీ అలాగంటున్నారు? మీరనే మాటలు నా కాపురంలో నిప్పులు పోస్తాయని తెలియదా ?" అంది.
    "ఇతరుల కాపురాల్లో నిప్పులు పోసే నువ్వు నీ కాపురం గురించి మాట్లాడుతున్నావా? ఈ దక్షిణామూర్తి నిజంగా నీకు భర్త కాడని నాకు తెలుసు.... అతడు ప్రస్తుతం నీ అన్యాయం గురించి మాట్లాడుతున్నా - తన భార్యకు చేసిన అన్యాయం గురించి నాకు తెలుసు" అన్నాడు చెంగల్రావు.
    'అరుణా! నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నన్ను నమ్ముతున్నావు. ఈ ఉన్మాదుడి మాటలతో మనకు నిమిత్తం లేదు. పద - పోదాం ...." అన్నాడు దక్షిణామూర్తి.
    చెంగల్రావు తను వంగి క్రిందపడిన కత్తి తీసి -- "ఇంద ఇది కూడా తీసుకొని వెళ్ళు. ఇక్కడ మర్చిపోయావు ...." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS