Previous Page Next Page 
శంఖారావం పేజి 4

 

    "పోనీ ఏం చేద్దామంటావు " అన్నాడు విశ్వనాద్.
    "అదే నేను ఆలోచిస్తున్నాను...."
    "ఎమాలోచించినా ఇండియా వెళ్ళేక చూసుకుందాం. నువ్వు నీ అపార్టుమెంటు నుంచి కూడా కుంభూషణ్ కి ఫోన్ చేయి. నేనూ ఇక్కడినుంచి ప్రయత్నిస్తాను. మనిద్దరిలో ఎవరికి లైన్ దొరికినా ఫరవాలేదు ....' అన్నాడు విశ్వనాద్.
    "ఇద్దరికీ లైన్ దొరుకుతుంది " అన్నాడు వేదాంతం.
    'అప్పుడు మరీ మంచిది " అమ్మకు కబురు తెలుస్తుంది.
    వేదాంతం నవ్వి "కబురు అమ్మ కోసం కాదని నాకు తెలుసు" అన్నాడు.
    "మరెందుకు" అన్నాడు విశ్వనాధం గంభీరంగా.
    "ఉదయ కోసం అవునా"
    అతడా మాట అంటాడని ముందే ఊహించాడు విశ్వనాద్. అందుకే 'అస్తమించనున్న ఉదయ గురించే అస్తమానం నేనాలోచిస్తాననుకునే నీ ఆలోచన అస్తవ్యస్తంగా వుంది" అన్నాడు కోపాన్ని హాస్యంగా మార్చడానికి ప్రయత్నిస్తూ.
    "ఉదయ అస్తమించదు. ఈరోజు నేను చెబుతున్నాను విను" అన్నాడు వేదాంతం.
    "నీ నమ్మకం ఉదయను  బ్రతికించదు"
    వేదాంతం మాట్లాడలేదు. మనసులో మాత్రం "నీకంటే ఎక్కువగా నేను ఉదయను ప్రేమిస్తున్నాను. ఆ సంగతేలాగూ బైటకు చెప్పుకోలేను. కనీసం ఆమె బ్రతుకుతుందన్న ఆశ నైనా పబ్లిగ్గా ప్రకటించకూడదా?" అనుకున్నాడు.
    
                                     ***

    "డాక్టర్ కులభూషణ్ నీకు న్యూయార్క్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది" అన్నాడు డాక్టర్ రఘుపతి.
    "ఇంకెవరు? విశ్వనాదే అయుంటాడు"అనుకుంటూ కులభూషణ్ ఫోన్ దగ్గరకు పరుగెత్తాడు.
    ఫోన్ వేదాంతం దగ్గర్నుంచి వచ్చింది. కబురు కులభూషణ్ ని సంతోషంలో ముంచెత్తింది. అతడు ఫోన్ పెట్టేసి అక్కణ్ణించి తిన్నగా మరో గదిలోకి వెళ్ళాడు.
    అక్కడ డాక్టర్ రఘుపతి ఉన్నాడు.
    "రఘుపతీ అర్జంటుగా నేను బయటకు వెళ్ళాలి" అన్నాడతను.
    "ఏమిటి విశేషం?"
    "వచ్చేక చెబుతాను ..."
    "ఎక్కడికి వెడతావు ?"
    "మా అమ్మ సీతమ్మ దగ్గరికి...."
    రఘుపతి ఇంకేమీ మాట్లాడలేదు. సీతమ్మ దగ్గరకు వెళ్ళే టప్పుడు కులభూషణ్ నెవరూ వారించలేరు.
    అతడు తల ఊపాడు.
    మరికొద్ది క్షణాల్లో డాక్టర్ కులభూషణ్ స్కూటర్ మీద ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో ఓ బంగళా ముందున్నాడు.
    అది మరీ చిన్న బంగళా కాదు.
    అందులో సీతమ్మ ఉంటోంది.
    ఆ ఇంట్లో ఆమెకు తోడుగా వేరెవ్వరూ లేరు.
    రోజూ ఉదయం ఇద్దరు పనివాళ్ళు వస్తారు. ఇల్లు, దొడ్డి శుభ్రం చేసి వెడతారు.
    ఇంటిపనులన్నీ సీతమ్మ స్వయంగా చూసుకుంటుంది.
    తన వంట తనే చేసుకుంటుంది. తన బట్టలు తనే ఉతుక్కుంటుంది. తన గిన్నెలు తనే తోముకుంటుంది.
    సీతమ్మకు డబ్బుకు లోటు లేదు.
    కానీ డబ్బు నామె వృధా చేయదు.
    అందుకు కొందారామెను పరిహాసం చేస్తారు.
    కానీ అందుకు సీతమ్మ చిన్నబుచ్చు కోదు.
    ఆమెను ఇరవయ్యో ఏట భర్త పోయాడు. రెండేళ్ళ విశ్వనాద్ ను కానుకగా వదిలిపెట్టి.
    భర్త ఇన్సురెన్స్ డబ్బు పాతికవేలు వచ్చింది.
    ఆ డబ్బు కాజేయాలని బంధులామేచుట్టూ గుమిగూడారు. సీతమ్మ లొంగలేదు. బంధువులను విసిరికోట్టింది. మిత్రులు ఆసరా తీసుకుంది.
    మనిషి కష్టాల్లో వున్నప్పుడు మిత్రులాసరా కోరాలి . వీళ్ళు ప్రతిఫలా పేక్ష లేకుండా సాయపడతారు.
    మనిషి సుఖంగా వున్నప్పుడు బంధువులు కావాలి. సుఖాల్లో వీళ్ళు పంచుకున్నట్లు ఇంకెవరూ పాలు పంచుకోలేరు.
    సీతమ్మ మిత్రులనే కాక దేవుడినీ నమ్ముకుంది. అందులోనూ ప్రత్యక్ష దైవమైన స్వామి అలౌకికానందను నమ్ముకుంది.
    అలౌకికానంద స్వామికి నూట యాభై సంవత్సరాల వయసని చెప్పుకుంటారు. తన ఆశీర్వాద బలంతోనే గాంధీ, నెహ్రూ అవతరించారని అయన తరచూ అంటుంటాడు.
    అయన భక్తుల మధ్యకు తరచూ రాడు. అయన ఆశ్రమం ఊరి చివర కొండల్లో వుంది. ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకే అయన భక్తులకు దర్శనమిస్తాడు. ఆయనపై నమ్మకం ఎందరో అమాయకులకు ఊపిరిపోస్తోంది.
    కిట్టని వాళ్ళాయన గురించి ఎన్నో చెప్పుకుంటారు. ఆదాయాన గొప్పతనానికి అడ్డు రావడం లేదు.
    భర్త పోయిన వెంటనే సీతమ్మ అలౌకికానందస్వామి ని కలుసుకుంది. అయన విభూది ఆమెకు ధయిర్వానిచ్చింది. కొత్త జీవితం ప్రారంభించింది. లైఫ్ ఇన్యురేన్స్ ఏజెన్సీ తీసుకుంది.
    సీతమ్మ ఆడది అందమైనది వయసులో వున్నది. భర్తను పోగొట్టుకుంది.
    జీవితా భీమా ఏజెంటుగా ఆమె నిలదొక్కుకోడానికి కీవన్నీ కారణాలని కొందరు చెప్పుకునేవారు. తమ నిప్పు లాంటి దాన్నని ఆమె అనేది.
    సీతమ్మది జాలి గుండె. ఇరుగు పొరుగు పిల్లలనామె ప్రేమతో చేరదీసేది. ఆమెను నాలుగిళ్ళవతల ఓ ఇంట్లో ఓరోజు రెండు కుటుంబాలు అద్దేకున్నాయి. స్కూలు కెళ్ళిన పిల్లలిద్ద్రరూ అఫీసకు వెళ్ళిన వారి తల్లిదండ్రులూ ప్రాణాలు దక్కించుకున్నారు. పిల్లలిద్దరూ విశ్వనాద్, ఈడువాళ్ళు ముగ్గురిది ఆరేడేళ్ళ వయసు.
    తల్లి పోయిందని పిల్లలిద్దరూ గుండెలవిసేలా ఏడుస్తుంటే సీతమ్మ వాళ్ళను చేరదీసింది. తండ్రులు తాత్కాలికంగా పిల్లల బాధ్యత అమెకిచ్చారు. పిల్లలిద్దరూ సీతమ్మ దగ్గర బాగా అలవాటయి పోయారు. కొద్ది నెలలు గడిచాక తండ్రులు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పిల్లలు తండ్రుల దగ్గరకు వెళ్ళి సవతి తల్లుల బాధ పడలేక పారిపోయి మళ్ళీ సీతమ్మనే చేరారు. సీతమ్మ వారి నాదరించింది. కొంతకాలం తండ్రులు పిల్లల గురించి ఆమెకు కొంత డబ్బిచ్చే వారు.తర్వాత మానేసారు.
    సీతమ్మ ఎవర్నీ దేనికీ తప్పుపట్టా లేదు.
    భర్త లేని సీతమ్మ పురుష స్పర్శ కోసం తపించి పోతూ  ఈ పిల్లల సాకుతో వారి తండ్రులను తన వద్దకు రప్పించు కుంటుందని కొందరు అభాండం వేశారు.
    ఇలాంటి అభాండాలు వచ్చినప్పుడు అలౌకికానందస్వామిని కలుసుకుని తన బాధ చెప్పుకునేది.
    'అలనాడు శ్రీకృష్ణ భాగవానుడికీ ఈనాడు నాకూ తప్పని అభాండాలు సామాన్యురాలివి నీకు తప్పుతాయా ?" అని స్వామీ సీతమ్మ మీద జాలిపడ్డాడు.
    స్వామికీ ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలున్నాయని పుకార్లున్నాయి. సీతమ్మకు మాత్రం స్వామి అంటే అలాంటి అభిప్రాయం ఏర్పడే సంఘటనలు ఎదురు కాలేదు.
    సీతమ్మ పెంపకంలో పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారు. విశ్వనాద్, వేదాంతం, కులభూషణ్ ఆమె అసలు బిడ్డ ఎవరో చూసి ఎవరూ తెలుసుకోలేరు.
    తాము అన్నదమ్ములం కామని ఆ పిల్లలకుతెలుసు. కానీ సీతమ్మను వారు ముగ్గురూ ఉమ్మడి అమ్మగా భావించేవారు.
    సీతమ్మ పొదుపరి. ఆమె పాదు పరితనం కారణంగా పిల్లలు ముగ్గుర్ని  పెద్ద చదువులు చదివించగలిగిందామె.
    పిల్లలు ముగ్గురికి ఆమె అంటే ప్రాణం.
    అమ్మ అంటారు విశ్వనాద్, ఇతరులతో చెప్పేటప్పుడు అమ్మ సీతమ్మ అంటాడు కులభూషణ్.
    వేదాంతానికి తల్లి అంటే ప్రాణం. ఆమెను రక్షించుకునేందుకు అతడేమైనా చేస్తాడు. సీతమ్మ ఎక్కువగా అతడి గురించే కలవరపడేది. ఎందుకంటె ముగ్గురిలోకి అతడే బాగా మొండి మనిషి.
    సీతమ్మ వయసు నలభై దాటింది.
    ఆమెకు జుత్తు నెరిసి పెద్దమనిషి తరహగావుంటుంది.
    మనిషి వొళ్ళు చేయలేదు. జుట్టుకు నల్లరంగు వేసుకుంటే ముప్పై ఏళ్ళ మనిషిగా ఉంటుందని ఆమెను చిన్నప్పట్నించి ఎరిగిన వారంటారు.
    ప్రస్తుతం కులభూషణ్ ఆ ఊళ్ళోని గులాబీ నర్శింగ్ హోం లో డాక్టర్ గా ఉంటున్నాడు. అతడక్కడ వైద్యంతో పాటు వైద్య పరిశోధనలు కూడా చేస్తున్నాడు.
    గులాబీ నర్సింగ్ హొంలో రోగుల్ని పువ్వుల్లా చూసుకుంటారని పేరు. అక్కడ ఖరీదైన రోగులే చేరతారు. ఖరీదైన మందులు, ఖరీదైన డాక్టర్లు.....
    నాలుగు సంవత్సరాల క్రితం విశ్వనాద్ వేదాంతం కలిసి అమెరికా వెళ్ళారు.
    విశ్వనాద్ కోసం సీతమ్మ కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది. ఎందుకంటె ఆమె జీవితం అతడి కోసం.
    భర్త పోయినప్పుడు వెంటే ఆత్మహత్య చేసుకుని చావాలన్నంత విరక్తి కలిగిందామెకు. అంతపని చేయబోతూ ఆఖరుసారిగా కొడుకుని చూసుకుంది. వాడామేను  చూసి ముద్దుగా నవ్వాడు.
    ఆ నవ్వామెను కట్టేసింది.
    విశ్వనాద్ కోసమే ఆమె జీవించడం ప్రారంభించింది.
    వేదాంతం, కులభూషణ్ , విశ్వనాద్ అంటే ప్రాణం పెట్టేవారు. అతడిని కంటికి రెప్పలా కాపాడుకునేవారు. సహజంగా అవేశాపరుడైన వేదాంతం విశ్వనాద్ విషయంలో మాత్రం ఎంతో నిగ్రహంగా ఉండేవాడు. విశ్వనాద్ కు వారిద్దరూ మంచి మిత్రులు. అతడి కోసమే ఆమె వారిద్దర్నీ పెంచి పెద్ద చేసింది. కొడుకుతో సమంగా ఆదరించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS